మన క్రైస్తవ జీవితం
“దేవుడే నాకు సహాయకుడు”
దావీదు జీవితంలో తీవ్రమైన కష్టాలు వచ్చినప్పుడు ఆయనకు ఎలా అనిపించిందో కీర్తనలు 52-59 అధ్యాయాల్లో ఉంది. అన్ని కష్టాల్లో కూడా యెహోవా మీద ఆయన నమ్మకం ఉంచాడు. (కీర్త 54:4; 55:22) యెహోవా వాక్యాన్నిబట్టి ఆయనను కీర్తించాడు. (కీర్త 56:10) మనం కూడా దేవుని మీద అలాంటి విశ్వాసాన్ని, నమ్మకాన్నే పెంచుకుంటున్నామా? కష్టాలొచ్చినప్పుడు ఆయన వాక్యం ఇచ్చే నిర్దేశం వైపు చూస్తున్నామా? (సామె 2:6) ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు ఏ వచనం గుర్తొస్తుంది . . .
నిరుత్సాహంలో లేదా కృంగిపోయినప్పుడు?
అనారోగ్యంతో ఉన్నప్పుడు?
ఇతరుల వల్ల బాధపడినప్పుడు?
హింస వ్యతిరేకత ఎదురైనప్పుడు?