దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 52-59
మీ భారాన్ని యెహోవా మీద వేయండి
దావీదు జీవితంలో ఎన్నో ఘోరమైన కష్టాలను ఎదుర్కొన్నాడు. 55వ కీర్తనను రాసే సమయానికి, ఆయన ఈ కష్టాలను ఎదుర్కొన్నాడు . . .
అవమానాలు
హింస
విపరీతమైన అపరాధ భావాలు
కుటుంబంలో విషాదం
అనారోగ్యం
నమ్మకద్రోహం
తనకున్న కష్టాలు మోయలేనంతగా ఉన్నాయని అనిపించినా, దావీదు వాటిని ఎదుర్కొన్నాడు. ఆయన ప్రేరణతో రాసిన ఈ విషయం అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లకు సహాయపడుతుంది: మీ భారాన్ని యెహోవా మీద వేయండి.
ఈ రోజుల్లో మనం దీన్ని ఎలా పాటించవచ్చు?
మీకున్న సమస్యల గురించి, ఆందోళనల గురించి, బాధల గురించి హృదయపూర్వకంగా ప్రార్థనలో యెహోవాకు చెప్పండి
నిర్దేశం, మద్దతు కోసం యెహోవా వాక్యంపై, ఆయన సంస్థపై ఆధారపడండి
ఆ పరిస్థితిని తట్టుకోవడానికి బైబిలు ప్రమాణాలకు తగ్గట్టుగా మీరు చేయగలిగినదంతా చేయండి