దేవుని వాక్యంలో ఉన్న సంపద | నహూము 1-హబక్కూకు 3
ఆధ్యాత్మిక విషయాల్లో అప్రమత్తంగా, చురుగ్గా ఉండండి
బబులోనీయుల చేతిలో యూదా నాశనం అవుతుందని నమ్మడం బహుశా కష్టంగా అనిపించి ఉంటుంది. యూదా శక్తివంతమైన ఐగుప్తుతో కలిసి ఉంది. కల్దీయులు ఐగుప్తీయులకన్నా శక్తిమంతులా? కాదు. అంతేకాదు యెహోవా యెరూషలేమును, ఆలయాన్ని నాశనం అయ్యేలా వదిలేస్తాడు అని చాలామంది యూదులు అస్సలు అనుకోలేదు. ఏమైనప్పటికీ ఆ ప్రవచనం తప్పకుండా నెరవేరుతుంది, హబక్కూకు దాని కోసం ఎదురుచూస్తూ ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా, చురుగ్గా ఉండాలి.
లోకాంతం చాలా దగ్గర్లో ఉంది అని నేను ఎందుకు నమ్ముతున్నాను?
నేను ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా, చురుగ్గా ఎలా ఉండాలి?