మన క్రైస్తవ జీవితం
మీ పరిస్థితులు మారినప్పుడు ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా చురుకుగా ఉండండి
మార్పుల్ని ఆపలేము. ముఖ్యంగా ఈ చివరి రోజుల్లో. (1 కొరిం 7:31) మనం ఊహించినా ఊహించకపోయినా, మంచివైనా, చెడ్డవైనా, మార్పులు మన ఆరాధనకు ఆటంకం కలిగించవచ్చు, యెహోవాతో మన సంబంధాన్ని పాడు చేయవచ్చు. ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా, చురుకుగా ఉండడానికి మనకు ఏది సహాయం చేస్తుంది? ఊరు మారుతున్నప్పుడు ఆధ్యాత్మికంగా బలంగా ఎలా ఉండాలి? అనే వీడియో చూసి ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
ఒక సహోదరుడు ఆ నాన్నకు ఏ సలహా ఇచ్చాడు?
ఆ కుటుంబం ఉన్న పరిస్థితికి మత్తయి 7:25లో సూత్రం ఎలా వర్తిస్తుంది?
ఆ కుటుంబం అక్కడకు వెళ్లడానికి ముందే ఎలా ప్లాన్ చేసుకున్నారు? అది వాళ్లకు ఎలా సహాయం చేసింది?
మారిన సంఘానికి, టెరిటరీకి అలవాటు పడడానికి ఆ కుటుంబానికి ఏది సహాయం చేసింది?
ఈ మధ్య కాలంలో నేను అనుభవించిన పెద్దపెద్ద మార్పులు:
ఈ వీడియోలో ఉన్న సూత్రాలను నేను ఎలా పాటించవచ్చు?