దేవుని వాక్యంలో ఉన్న సంపద | మత్తయి 12-13
గోధుమలు, గురుగులు గురించిన ఉపమానం
క్రీ.శ. 33 మొదలుకొని, గోధుమల తరగతికి చెందిన అభిషిక్త క్రైస్తవులందర్నీ మానవజాతి నుండి ఎలా తీసుకువెళ్తాడో, ఎప్పుడు తీసుకువెళ్తాడో వివరించడానికి యేసు గోధుమలు, గురుగులు గురించిన ఉపమానాన్ని ఉపయోగించాడు.
తన పొలంలో ఒక మనిషి మంచి విత్తనాలు నాటాడు
విత్తిన మనిషి: యేసుక్రీస్తు
మంచి విత్తనాలు నాటడం: యేసు శిష్యులు పవిత్రశక్తి చేత అభిషేకించబడ్డారు
పొలం: ప్రపంచ మానవజాతి
“అందరూ నిద్రపోతున్నప్పుడు అతని శత్రువు వచ్చి, గోధుమల మధ్య గురుగుల్ని నాటి వెళ్లిపోయాడు”
శత్రువు: అపవాది
అందరూ నిద్రపోతున్నప్పుడు: అపొస్తలులు చనిపోయాక
“కోతకాలం వరకు రెండిటినీ కలిసి పెరగనివ్వండి”
గోధుమలు: అభిషిక్త క్రైస్తవులు
గురుగులు: నకిలీ క్రైస్తవులు
‘ముందు గురుగుల్ని పీకేసి తర్వాత గోధుమల్ని సమకూర్చండి’
దాసులు/కోత కోసేవాళ్లు: దేవదూతలు
గురుగులు పీకడం: నకిలీ క్రైస్తవులు, అభిషిక్త క్రైస్తవుల నుండి వేరుచేయబడ్డారు
గోదాములోకి సమకూర్చడం: అభిషిక్త క్రైస్తవులు తిరిగి సంఘంగా సమకూర్చబడ్డారు
కోతకాలం మొదలైనప్పుడు నిజ క్రైస్తవుల్ని, నకిలీ క్రైస్తవుల నుండి వేరు చేసింది ఏమిటి?
ఈ ఉపమానాన్ని అర్థం చేసుకోవడం ద్వారా నేను వ్యక్తిగతంగా ఎలా ప్రయోజనం పొందుతాను?