కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 ఫిబ్రవరి పేజీ 4
  • మీ అమ్మానాన్నల్ని గౌరవించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ అమ్మానాన్నల్ని గౌరవించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ తలిదండ్రుల హృదయాలను ఉల్లసింపజేయుట
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
  • అందరిని సన్మానించుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • మన వృద్ధ తలిదండ్రులను సన్మానించడం
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • “నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము” అంటే అర్థమేంటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 ఫిబ్రవరి పేజీ 4

మన క్రైస్తవ జీవితం

మీ అమ్మానాన్నల్ని గౌరవించండి

యేసు భూమ్మీద జీవించినప్పుడు పదేపదే ఈ ఆజ్ఞ గురించి చెప్పాడు: “మీ అమ్మానాన్నల్ని గౌరవించు.” (నిర్గ 20:12; మత్త 15:4) యేసు ఈ విషయాన్ని ఏ ఇబ్బంది లేకుండా చెప్పాడు, ఎందుకంటే ఆయన యవ్వనం నుండి అతని అమ్మానాన్నకు “లోబడి ఉన్నాడు.” (లూకా 2:51) పెద్దవాడయ్యాక, తను చనిపోయే ముందు తల్లి సంరక్షణ కోసం ఏర్పాట్లు చేశాడు.​—యోహా 19:26, 27.

ఈ రోజుల్లో కూడా, అమ్మానాన్నల మాట వింటూ వాళ్లతో మర్యాదగా మాట్లాడే క్రైస్తవ యవ్వనులు, వాళ్లను గౌరవిస్తున్నారు. నిజానికి, అమ్మానాన్నల్ని గౌరవించమనే ఆజ్ఞను ఇంతకాలమే పాటించాలనే నియమమేమీ లేదు. మన తల్లిదండ్రులు ముసలివాళ్లు అయ్యాక కూడా వాళ్ల జ్ఞానం నుండి ప్రయోజనం పొందుతూ మనం వాళ్లకు గౌరవం చూపిస్తూ ఉండవచ్చు. (సామె 23:22) ముసలివాళ్లైన అమ్మానాన్నల అవసరాన్నిబట్టి ఆర్థికంగా, భావోద్వేగంగా వాళ్ల బాగోగులు చూసుకుంటూ కూడా వాళ్లను గౌరవిస్తాం. (1 తిమో 5:8) మనం పిల్లలమైనా, పెద్దవాళ్లమైనా మన అమ్మానాన్నలను గౌరవించడానికి వాళ్లతో చక్కగా మాట్లాడుతూ ఉండడం చాలా ముఖ్యం.

ఈ వైట్‌బోర్డ్‌ యానిమేషన్‌ వీడియోని చూడండి నేను అమ్మానాన్నలతో ఎలా మాట్లాడాలి? తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి:

  • మీ అమ్మానాన్నలతో మాట్లాడడం మీకు ఎందుకు కష్టంగా ఉంటుంది?

  • మీ అమ్మానాన్నలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్లకు ఎలా గౌరవం చూపించవచ్చు?

    ఒక అబ్బాయి తల్లిదండ్రులకు ఒక ఉత్తరం రాస్తున్నాడు, తల్లిదండ్రులకు ఒక ఉత్తరం రాస్తున్నాడు, ఒక అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు, ఒక అబ్బాయి తన తండ్రితో ఫుట్‌బాల్‌ ఆడుతున్నాడు
  • మీ అమ్మానాన్నలతో మాట్లాడడానికి ప్రయత్నించడం ఎందుకు ప్రయోజనకరం? (సామె 15:22)

    రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి అమ్మానాన్నలు వాళ్ల బాబుకు సహాయం చేస్తున్నారు

    మీ అమ్మానాన్నలతో మాట్లాడడం ద్వారా మీరు జీవితంలో విజయం సాధించవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి