దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండము 9-11
‘భూమంతటా ఒక్క భాష ఉండెను’
బాబెలులో యెహోవా, భాషలు తారుమారు చేసి మాట వినని మనుషులను చెదరగొట్టాడు. నేడు ఆయన అన్నిదేశాల, భాషల నుండి ఒక గొప్ప సమూహాన్ని సమకూరుస్తూ, వాళ్లకు ‘స్వచ్ఛమైన భాష’ నేర్పిస్తున్నాడు. ‘దానివల్ల వాళ్లందరూ యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థిస్తున్నారు, ఐక్యంగా ఆయన్ని సేవిస్తున్నారు.’ (జెఫ 3:9, NW; ప్రక 7:9) ‘స్వచ్ఛమైన భాష’ అంటే యెహోవా గురించి, ఆయన ఉద్దేశాల గురించి బైబిల్లో ఉన్న సత్యం.
కొత్త భాష నేర్చుకునేటప్పుడు కేవలం కొత్త పదాల్ని బట్టీపడితే సరిపోదు, ఒక కొత్త విధానంలో ఆలోచించడానికి కూడా కృషి చేయాలి. అదేవిధంగా, మనం సత్యం గురించిన స్వచ్ఛమైన భాష నేర్చుకుంటున్నప్పుడు మన ఆలోచనాతీరులో కూడా మార్పు వస్తుంది. (రోమా 12:2) ఎప్పుడూ కొనసాగే ఈ ప్రక్రియ వల్ల దేవుని ప్రజలు ఐక్యంగా ఉంటారు.—1 కొరిం 1:10.