దేవుని వాక్యంలో ఉన్న సంపద | నిర్గమకాండం 33-34
యెహోవాకున్న ఆకర్షణీయమైన లక్షణాలు
మోషే యెహోవా లక్షణాల్ని బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టే ఇశ్రాయేలీయులతో ఓపిగ్గా వ్యవహరించగలిగాడు. అదేవిధంగా, మనం కూడా యెహోవా లక్షణాల్ని బాగా అర్థం చేసుకున్నప్పుడు తోటి ఆరాధకుల పట్ల కరుణ చూపించగలుగుతాం.
“కరుణ, కనికరం గల దేవుడు”: పిల్లల్ని తల్లిదండ్రులు చూసుకున్నట్టే, యెహోవా తన ఆరాధకుల్ని ఎంతో ప్రేమగా, శ్రద్ధగా చూసుకుంటాడు
‘ఓర్పును చూపించే దేవుడు’: తప్పులు చేసినప్పుడు సహిస్తూ, మార్చుకోవడానికి సమయం ఇవ్వడం ద్వారా యెహోవా తన సేవకుల పట్ల ఓర్పును చూపిస్తున్నాడు
“అపారమైన విశ్వసనీయ ప్రేమను చూపించే దేవుడు”: యెహోవాకు తన ప్రజలపట్ల విశ్వసనీయ ప్రేమ ఉంది కాబట్టి వాళ్లతో ఆయనకున్న బంధం శాశ్వతంగా ఉంటుంది
ఇలా ప్రశ్నించుకోండి, ‘యెహోవాలా నేను కరుణను, కనికరాన్ని ఎలా చూపించవచ్చు?’