కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • bm భాగం 2 పేజీ 5
  • పరదైసులో జీవించే అవకాశం చేజారిపోయింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పరదైసులో జీవించే అవకాశం చేజారిపోయింది
  • బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఏదెను తోటలో జీవితం ఎలా ఉండేది?
    దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • దేవుడు అందరికన్నా గొప్పవాడు
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • ఆదాము, హవ్వ దేవుని మాట వినలేదు
    నా బైబిలు పుస్తకం
  • మొదటి మానవ దంపతుల నుంచి మనం నేర్చుకోవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
bm భాగం 2 పేజీ 5
నిషేధించిన పండును హవ్వ తీసుకుంటోంది

భాగం 2

పరదైసులో జీవించే అవకాశం చేజారిపోయింది

దేవునికి ఎదురు తిరిగిన ఒక దేవదూత, మొదటి మనుషులైన ఆదాము హవ్వలు దేవుని పరిపాలన తమకు అక్కర్లేదనుకునేలా చేశాడు. దాంతో మనుషులు పాపమరణాల బారినపడ్డారు

మనుషులను సృష్టించడానికి ఎంతోకాలం ముందే దేవుడు, కంటికి కనిపించని దేవదూతలను సృష్టించాడు. తిరుగుబాటుదారుడైన ఒక దేవదూత కుయుక్తిగా, దేవుడు తినొద్దని చెప్పిన చెట్టు పండ్లను హవ్వతో తినిపించడానికి ప్రయత్నించాడు. అందుకే అతడికి ఆ తర్వాత అపవాదియైన సాతాను అనే పేరు వచ్చింది.

సాతాను పాము వెనుక నుండి మాట్లాడుతూ, దేవుడు ఆదాము హవ్వలకు మంచిదేదో దక్కకుండా చేస్తున్నాడన్నట్టు మాట్లాడాడు. ఆ చెట్టు పండ్లను తింటే ఆమె, ఆమె భర్త అసలు చావనే చావరని ఆ దూత హవ్వతో చెప్పాడు. అలా అతడు, దేవుడు తన పిల్లలైన మనుషులతో అబద్ధమాడాడని నిందించాడు. దేవుని మాట వినకపోతే వాళ్లకు విశేష జ్ఞానం, స్వేచ్ఛ లభిస్తాయని చెప్పాడు. అయితే, అదంతా పచ్చి అబద్ధం. నిజానికి, భూమ్మీద అదే మొట్టమొదటి అబద్ధం. సాతాను దేవుని పరిపాలనా హక్కును ప్రశ్నించాడు అంటే అసలు దేవునికి మనుషులను పరిపాలించే హక్కు ఉందా, ఆయన నీతియుక్తంగా, మనుషులకు మంచి జరిగేలా పరిపాలిస్తాడా అని సవాలు చేశాడు.

సాతాను చెప్పిన అబద్ధాన్ని హవ్వ నమ్మింది. ఆ తర్వాత ఆమెకు ఆ పండు తినాలనిపించి, తను తిని తన భర్తకు కూడా ఇచ్చింది. ఆయన కూడా తిన్నాడు. అలా వాళ్లు పాపులయ్యారు. పండు తినడం చిన్న విషయంగా అనిపించవచ్చు కానీ అది దేవునికి ఎదురుతిరగడంతో సమానం. కావాలని దేవుని ఆజ్ఞను మీరి, పరిపూర్ణ జీవితంతోసహా సమస్తాన్నీ అనుగ్రహించిన సృష్టికర్త పరిపాలన వద్దనుకున్నారు.

ఆ సంతానం “నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువు.” —ఆదికాండము 3:15

వాళ్లు చేసిన పనికి దేవుడు కఠిన శిక్ష విధించాడు. పాము వెనుక నుండి మాట్లాడిన సాతానును నాశనం చేసే సంతానం లేదా విమోచకుడు వస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. ఆదాము హవ్వలపై వెంటనే మరణశిక్ష అమలు చేయకుండా దేవుడు ఇంకా పుట్టని వాళ్ళ పిల్లలపై కనికరం చూపించాడు. వాళ్ల పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే, దేవుడు పంపించే వ్యక్తి ఏదెనులో జరిగిన తిరుగుబాటువల్ల వచ్చిన చెడు ఫలితాలన్నిటినీ తీసేస్తాడు. రాబోయే రక్షకుని గురించిన దేవుని వాగ్దానం ఎలా నెరవేరుతుంది, అసలు ఆ రక్షకుడు ఎవరు వంటి విషయాలు ఆదికాండము తర్వాతి పుస్తకాల్లో క్రమక్రమంగా తెలియజేయబడ్డాయి.

దేవుడు ఆదాము హవ్వలను అందమైన తోట నుండి వెలివేశాడు. ఏదెను తోట బయట పంట పండించుకొని బ్రతకడానికి వాళ్లెంతో శ్రమపడాల్సి వచ్చింది. కొంతకాలానికి హవ్వకు కయీను పుట్టాడు. ఈయనే వాళ్ల మొదటి సంతానం. ఆ తర్వాత హేబెలు, నోవహు పూర్వికుడైన షేతుతో సహా వాళ్లకు ఇతర కుమారులు, కుమార్తెలు పుట్టారు.

—ఆదికాండము 3 నుండి 5 అధ్యాయాలు; ప్రకటన 12:9.

  • మొదటి అబద్ధం ఏమిటి, దాన్ని ఎవరు చెప్పారు?

  • ఆదాము హవ్వలు అందమైన తోటలో జీవించే అవకాశాన్ని ఎలా చేజార్చుకున్నారు?

  • ఎదురు తిరిగినవారిని శిక్షించినప్పుడు దేవుడు, ఇంకా పుట్టని వాళ్ల పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఏ ఏర్పాటు చేశాడు?

అపరిపూర్ణత, మరణం

ఆదాము హవ్వలు అందమైన తోటలో చావులేని జీవితాన్ని అనుభవించేలా దేవుడు వాళ్లను పరిపూర్ణులుగా సృష్టించాడు. అయితే వాళ్లు దేవునికి ఎదురుతిరిగి పాపం చేశారు. అలా వాళ్లు పరిపూర్ణతను పోగొట్టుకొని, వాళ్లకు జీవాన్నిచ్చిన యెహోవాతో తమ సంబంధాన్ని కూడా పాడుచేసుకున్నారు. అప్పటినుండి వాళ్లు, వాళ్ల పిల్లలు పాపమరణాల బారినపడుతున్నారు.—రోమీయులు 5:12.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి