కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 10/15 పేజీలు 19-24
  • యెరూషలేము—సార్థకనామధేయ పట్టణం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెరూషలేము—సార్థకనామధేయ పట్టణం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అద్భుతమైన ఒక సమావేశ దినము
  • ఆనందమయమైన మరొక సమావేశం
  • దేవుని మందిరమును మనం అలక్ష్యం చేయకూడదు
  • ఆనందమయ ప్రతిష్ఠాపన
  • నిత్యానందానికి కారణం
  • యెరూషలేము—అది ‘మీ ముఖ్య సంతోషంకన్నా హెచ్చుగా ఉన్నదా’?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • నెహెమ్యా పుస్తకంలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • యెరూషలేము గోడలు
    నా బైబిలు పుస్తకం
  • యెరూషలేము గోడలు
    నా బైబిలు కథల పుస్తకము
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 10/15 పేజీలు 19-24

యెరూషలేము—సార్థకనామధేయ పట్టణం

“నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగా . . . సృజించుచున్నాను.”—యెషయా 65:18.

1. దేవుడు ఎంపికచేసుకున్న నగరాన్ని గురించి ఎజ్రా ఎలా భావించాడు?

దేవుని వాక్యమందు శ్రద్ధగల ఒక విద్యార్థిగా యూదా యాజకుడైన ఎజ్రా యెహోవా పవిత్రారాధనతో యెరూషలేముకు ఒకప్పుడున్న సంబంధాన్ని ప్రియమైందిగా ఎంచాడు. (ద్వితీయోపదేశకాండము 12:5; ఎజ్రా 7:27) ప్రేరేపితుడై తాను రచించిన బైబిలు భాగాల్లో అంటే మొదటి రెండు దినవృత్తాంతములలోనూ, ఎజ్రా గ్రంథంలోనూ దేవుని పట్టణంపట్ల ఆయనకున్న ప్రేమ బయల్పర్చబడింది. మొత్తం బైబిల్లో యెరూషలేము అనే పేరు 800 సార్లకు పైగా ఉండగా, దాదాపు 200 సార్లు ఈ చారిత్రక రికార్డుల్లోనే ఉంది.

2. ఎజ్రా యెరూషలేము పేరును కొన్నిసార్లు ఎలా నమోదు చేశాడు, మరి దీనికున్న ప్రాముఖ్యత ఏమిటి?

2 బైబిలు కాలంనాటి హెబ్రీ భాషలో “యెరూషలేము” నగరం పేరు బహు వచన రూపంలో ఉన్నట్టుగా అవగతమౌతుంది. ఈ బహు వచన రూపం కళ్లు, చెవులు, చేతులు, పాదాలు వంటి జతలు జతలుగా ఉండే వాటి కోసం అతి తరచుగా ఉపయోగించబడేది. దేవుని ప్రజలు రెండు విధాలైన భావంలో అంటే ఆధ్యాత్మికంగానూ, భౌతికంగానూ అనుభవించబోయే ప్రవచనాత్మక శాంతిగా యెరూషలేము పేరును ఈ బహు వచన రూపంలో దృష్టించవచ్చు. ఎజ్రా ఆ విషయాన్ని పూర్తిగా అర్థంచేసుకున్నాడా లేదా అన్న విషయాన్ని లేఖనాలు బయల్పర్చడంలేదు. అయినా, యూదులు దేవునితో సమాధానాన్ని అనుభవించేందుకు ఒక యాజకునిగా తాను చేయగల్గినంత చేశాడు. యెరూషలేము సార్థకనామధేయ పట్టణంగా అంటే “రెండు విధములైన సమాధానాన్ని కల్గిన [లేదా సమాధానానికి పునాది]” పట్టణంగా ఉండేలా చేయడానికి ఆయన నిశ్చయంగా ఎంతో కృషి చేశాడు.—ఎజ్రా 7:6.

3. ఎజ్రా కార్యకలాపాలు మనకు మరలా పరిచయం చేయబడడానికి ముందు ఎన్నేళ్లు గడిచిపోయాయి, మరి ఏ పరిస్థితుల్లో ఆయన్ని మనం చూస్తాం?

3 యెరూషలేమును తాను సందర్శించడానికీ, అక్కడకు నెహెమ్యా రావడానికీ మధ్య గడచిన 12 ఏళ్లలో ఎజ్రా ఎక్కడున్నాడనే విషయాన్ని బైబిలు తెలియజేయడం లేదు. ఆ కాలంలో అంతంత మాత్రంగానే ఉన్న జనాంగపు ఆధ్యాత్మిక పరిస్థితి, ఆ సమయంలో యెరూషలేములో ఎజ్రా లేడనే విషయాన్ని సూచిస్తోంది. అయినప్పటికీ, నగర ప్రాకార పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తైన తర్వాత ఎజ్రా మరలా యెరూషలేములో నమ్మకమైన యాజకునిగా సేవచేయడాన్ని మనం చూస్తాం.

అద్భుతమైన ఒక సమావేశ దినము

4. ఇశ్రాయేలీయుల ఏడవ నెల మొదటి తారీఖుకున్న విశేషమేమిటి?

4 యెరూషలేము ప్రాకార నిర్మాణ కార్యక్రమం, ఇశ్రాయేలీయుల మతపర క్యాలెండరులో ఏడవ నెలయైన తిష్రీ అనే ప్రాముఖ్యమైన పండుగ నెల నాటికి సరిగ్గా సకాలంలో పూర్తైంది. తిష్రి నెల మొదటి రోజు ఒక ప్రత్యేకమైన అమావాస్య పండుగ, అది శృంగధ్వని పండుగ అని పిలువబడింది. ఆ రోజున, యెహోవాకు బలులు అర్పించబడుతుండగా యాజకులు బూరలను ఊదుతారు. (సంఖ్యాకాండము 10:10; 29:1) తిష్రి నెల పదవ తారీఖున వచ్చే వార్షిక ప్రాయశ్చిత్త దినం కోసమూ, అదే నెలలో 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు జరిగే ఆనందమయ ఫల సంగ్రహపు పండుగ కోసమూ ఇశ్రాయేలీయులను ఆ రోజు సిద్ధపరిచేది.

5. (ఎ) ‘యేడవ మాసము మొదటి దినాన్ని’ ఎజ్రా నెహెమ్యాలు ఎలా చక్కగా ఉపయోగించుకున్నారు? (బి) ఇశ్రాయేలీయులు ఎందుకు దుఃఖించారు?

5 “యేడవ మాసము మొదటి దినమున” “జనులందరును” సమకూడారు. అలా సమకూడమని బహుశా నెహెమ్యా ఎజ్రాలు ప్రోత్సహించివుండవచ్చు. వారిలో స్త్రీలూ, పురుషులూ, “చదువబడుదాని గ్రహింప శక్తిగల” వారందరూ ఉన్నారు. మరావిధంగా ఎజ్రా పీఠముమీద నిలువబడి “ఉదయము మొదలుకొని మధ్యాహ్నమువరకు” ధర్మశాస్త్రాన్ని చదువుతుండగా చిన్న పిల్లలు కూడా హాజరై ఎంతో శ్రద్ధగా విన్నారు. (నెహెమ్యా 8:1-4) మధ్య మధ్యలో, అక్కడ చదివినదాన్ని అర్థంచేసుకోవడానికి లేవీయులు ప్రజలకు సహాయం చేసేవారు. అది, వాళ్లూ, వాళ్ల పితరులూ ఎంతగా దేవుని ధర్మశాస్త్రానికి అవిధేయత చూపించారనే విషయాన్ని గ్రహించినప్పుడు ఇశ్రాయేలీయులు కన్నీళ్లను విడిచేలా కదిలించింది.—నెహెమ్యా 8:5-9.

6, 7. యూదులు ఏడ్వకుండా ఆపేందుకు నెహెమ్యా చేసిన దానినుండి క్రైస్తవులు ఏమి నేర్చుకోవచ్చు?

6 కానీ దుఃఖంతో ఏడ్వడానికిది సమయం కాదు. అది పండుగ సమయం, మరి ప్రజలు యెరూషలేము గోడ పునర్నిర్మాణ పనిని అంతకుముందే ముగించడం జరిగింది. కాబట్టి నెహెమ్యా “పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానము చేయుడి, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధము చేసికొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు” అని చెప్పడం ద్వారా వాళ్లు సరియైన దృక్పథాన్ని కల్గివుండేలా చేశాడు. విధేయతాపూర్వకంగా “జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి, తినుటకును త్రాగుటకును లేనివారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి యిండ్లకు వారు వెళ్లిరి.”—నెహెమ్యా 8:10-12.

7 దేవుని ప్రజలు ఈ వృత్తాంతం నుండి నేడు ఎంతో నేర్చుకోగలరు. కూటాల్లోనూ, సమావేశాల్లోనూ ప్రసంగించే ఆధిక్యత ఉన్న వాళ్లు, పైన ప్రస్తావించబడిన మాదిరిని మనస్సులో ఉంచుకోవాలి. కొన్నిసార్లు అవసరమైన సరిదిద్దాల్సిన సలహాను ఇవ్వడమేగాక అలాంటి సందర్భాలు దేవుని కట్టడల్ని పాటించడం మూలంగా వచ్చే ప్రయోజనాల్నీ, ఆశీర్వాదాల్నీ ఉన్నతపరుస్తాయి. చేసిన మంచి పనినిబట్టి మెచ్చుకోవడమూ, సహించుకోవడానికి ప్రోత్సాహాము ఇవ్వబడ్డాయి. దేవుని ప్రజలు దేవుని వాక్యం నుండి తాము పొందిన క్షేమాభివృద్ధికరమైన ఉపదేశాన్నిబట్టి హృదయానందంతో అలాంటి సమావేశాల నుండి ఇళ్లకు వెళ్లాలి.—హెబ్రీయులు 10:24, 25.

ఆనందమయమైన మరొక సమావేశం

8, 9. ఏడవనెల రెండో రోజున ఏ ప్రత్యేక సమావేశం జరిగింది, అది దేవుని ప్రజలు ఏం పొందడానికి కారణమైంది?

8 ఆ ప్రత్యేకమైన నెలలో రెండవ రోజున “జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును యాజకులును లేవీయులును ధర్మశాస్త్రగ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రియైన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి.” (నెహెమ్యా 8:13) “ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దానిచొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసికొ[న్నాడు]” గనుక ఆ కూటాన్ని నిర్వహించడానికి అతడు అర్హుడై ఉన్నాడు. (ఎజ్రా 7:10) దేవుని ప్రజలు ధర్మశాస్త్ర నిబంధనను అతి సన్నిహితంగా అనుసరించాలన్న విషయాన్ని ఆ కూటం నిస్సందేహంగా ఉన్నతపర్చింది. రానైవున్న పర్ణశాలల పండుగను ఆచరించేందుకు సరియైన ఏర్పాట్లను చేయాల్సిన అవసరమే వారి ముందున్న తక్షణ కర్తవ్యం.

9 వారం రోజుల పాటు జరిగే ఈ పండుగ, సరియైన పద్ధతిలో జరిగింది. ప్రజలందరూ రకరకాల చెట్ల కొమ్మలతోనూ, ఆకులతోను వేసిన తాత్కాలిక నివాసాల్లో నివసించారు. ప్రజలు ఈ పర్ణశాలలను తమ తమ ఇండ్లమీదా, లోగిళ్లలోనూ, దేవమందిరపు ఆవరణలోనూ, యెరూషలేము వీధుల్లోనూ కట్టారు. (నెహెమ్యా 8:15, 16) ప్రజలను సమకూర్చి, దేవుని ధర్మశాస్త్రం నుండి వారికి చదివి వినిపించేందుకు ఇదెంతటి సదవకాశమో గదా! (పోల్చండి ద్వితీయోపదేశకాండము 31:10-13.) పండుగ “మొదటి దినము మొదలుకొని కడదినమువరకు” అనుదినము అదే విధంగా చదివి వినిపించడం జరిగింది, అది దేవుని ప్రజలు “బహు సంతోషము” పొందడానికి కారణమైంది.—నెహెమ్యా 8:17, 18.

దేవుని మందిరమును మనం అలక్ష్యం చేయకూడదు

10. ఏడవనెల 24వ రోజున ఎందుకు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడింది?

10 దేవుని ప్రజలు చేసిన గంభీరమైన తప్పిదాల్ని సరిదిద్దడానికి సరియైన సమయమూ, స్థలమూ ఉన్నాయి. అది అలాంటి సమయమని ఎజ్రా నెహెమ్యాలు గ్రహించారు. అందుకే వాళ్లు తిష్రి నెల 24వ తారీఖును ఉపవాస దినంగా ఏర్పాటు చేసినట్లు కనబడుతోంది. మరలా దేవుని ధర్మశాస్త్రాన్ని చదివారు, ప్రజలు తమ పాపాల్ని ఒప్పుకున్నారు. ఆ తర్వాత దేవుడు త్రోవ తప్పిన తన ప్రజలతో కనికరపూర్వకంగా వ్యవహరించిన వైనాన్ని లేవీయులు పునఃసమీక్షించి, యెహోవాను రమ్యమైన పదజాలంతో స్తుతించారు, ఒక ‘స్థిరమైన నిబంధనను’ చేసికొన్నారు, దానికి ప్రధానులూ, లేవీయులూ, యాజకులూ ముద్రలు వేశారు.—నెహెమ్యా 9:1-10:1.

11. ఏ ‘స్థిరమైన నిబంధనకు’ యూదులు తమకుగా తాము లోబడ్డారు?

11 రాతపూర్వకమైన “స్థిరమైన నిబంధన”ను అనుసరిస్తామని సామాన్య జనులు ప్రమాణం చేశారు. తాము “దేవుని ధర్మశాస్త్రము ననుసరించి” నడుచుకొంటామన్నారు. “దేశపు జనుల”తో వియ్యమందమని వాళ్లు ఒప్పుకున్నారు. (నెహెమ్యా 10:28-30) అంతేగాక, సబ్బాతును ఆచరించేందుకూ, సత్యారాధనకు మద్దతునివ్వడంలో సంవత్సరం సంవత్సరం ఆర్థికంగా సహాయపడేందుకూ, బల్యర్పణకు కావాల్సిన కట్టెల్ని సరఫరా చేసేందుకూ, బల్యర్పణకు తమ మందల్లో నుండి పశువుల్లో నుండి ప్రథమ సంతానాన్ని ఇచ్చేందుకూ, ఆలయ భోజన బల్లల దగ్గరకు తమ పొలం పంటల్లో ప్రథమ పంటల్ని తీసుకు వచ్చేందుకూ యూదులు తమను తాము బద్ధులుగా చేసుకున్నారు. స్పష్టంగా, వాళ్లు ‘తమ దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదని’ నిశ్చయించుకున్నారు.—నెహెమ్యా 10:32-39.

12. నేడు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపర్చకుండా ఉండడంలో ఏమి చేరివున్నాయి?

12 యెహోవా దేవుని గొప్ప ఆధ్యాత్మిక ఆలయ ఆవరణల్లో ‘పవిత్రమైన సేవను చెల్లించే’ తమ ఆధిక్యతను అలక్ష్యంచేయకుండా ఉండేలా యెహోవా ప్రజలు నేడు జాగ్రత్త వహించాలి. (ప్రకటన 7:15) యెహోవా ఆరాధన అభివృద్ధి పథంలో ఉండేందుకు క్రమంగా చేసే హృదయపూర్వక ప్రార్థనలు ఇందులో చేరివున్నాయి. అలాంటి ప్రార్థనలకు అనుగుణంగా జీవించడానికి క్రైస్తవ కూటాలకోసం సిద్ధపడడమూ, వాటిలో భాగంవహించడమూ, సువార్తను ప్రకటించేందుకు చేసిన ఏర్పాట్లలో భాగంవహించడమూ, పునర్దర్శించడం ద్వారా ఆసక్తిగలవారికి సహాయపడడమూ, సాధ్యమైతే వారితో బైబిలు పఠనాల్ని నిర్వహించడమూ అవసరమౌతాయి. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపర్చకూడదనుకునే అనేకులు ప్రచారపు పని కోసమూ, సత్యారాధనా స్థలాల్ని నిర్వహించడం కోసమూ ఆర్థికంగా తోడ్పడేందుకు చందాల్ని ఇస్తారు. కూటాల్ని నిర్వహించడానికి అత్యవసరంగా అవసరమైన కట్టడాల్ని నిర్మించి, వాటిని శుభ్రంగానూ, క్రమమైనరీతిలోనూ ఉంచేందుకు మనం మన మద్దతును ఇవ్వవచ్చు కూడా. దేవుని ఆధ్యాత్మిక మందిరం విషయంలో ప్రేమను చూపించేందుకొక ప్రాముఖ్యమైన మార్గమేమంటే, తోటి విశ్వాసుల్లో శాంతిని పెంపొందించడం కోసమూ, భౌతికంగాగానీ, ఆధ్యాత్మికంగాగానీ ఏ అవసరతలోనైనా ఉన్నవారికి సహాయపడడం కోసమూ పాటుపడడమే.—మత్తయి 24:14; 28:19, 20; హెబ్రీయులు 13:15, 16.

ఆనందమయ ప్రతిష్ఠాపన

13. యెరూషలేము ప్రాకార ప్రతిష్ఠాపనకు ముందు ఏ అత్యవసర విషయంపై శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది, ఏ చక్కటి మాదిరిని అనేకమంది ఉంచారు?

13 నెహెమ్యా కాలంలో ముద్రలు వేసిన ‘స్థిరమైన నిబంధన’ యెరూషలేము ప్రాకార ప్రతిష్ఠోత్సవ దినం కోసం దేవుని ప్రాచీనకాల ప్రజల్ని సంసిద్ధుల్ని చేసింది. కానీ శ్రద్ధ చూపించాల్సిన అవసరమున్న మరొక అత్యవసర విషయం మాత్రం ఇంకా అలానే ఉండిపోయింది. యెరూషలేము చుట్టూ పన్నెండు గుమ్మాలతోనున్న పెద్ద ప్రాకారం ఉంది, దాంట్లో చెప్పుకోదగినంత పెద్దగా జనాభా మాత్రంలేదు. కొంతమంది ఇశ్రాయేలీయులు అక్కడ నివసిస్తున్నా, “ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెనుగాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి.” (నెహెమ్యా 7:4) ఈ సమస్యను పరిష్కరించడానికి, జనులు “పరిశుద్ధపట్టణమగు యెరూషలేమునందు పదిమందిలో ఒకడు నివసించునట్లు . . . చీట్లు వేసిరి.” ఈ ఏర్పాటుకు చూపించిన ఇష్టపూర్వకమైన ప్రతిస్పందన, “యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనినవారిని” ప్రజలు దీవించేలా వారిని ప్రేరేపించింది. (నెహెమ్యా 11:1, 2) పరిపక్వతతో కూడిన క్రైస్తవ సహాయ అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు కదిలి వెళ్లేందుకు నేడు ఎవరి పరిస్థితులైతే అనుమతించాయో ఆ సత్యారాధకులకు ఇదెంత చక్కటి మాదిరియో గదా!

14. యెరూషలేము ప్రాకార ప్రతిష్ఠోత్సవ దినాన ఏం జరిగింది?

14 యెరూషలేము ప్రాకార ప్రతిష్ఠోత్సవ దినం కోసం ప్రముఖమైన సిద్ధపాట్లు త్వరలోనే ఆరంభమయ్యాయి. యూదాకు చుట్టు ప్రక్కలనున్న పట్టణాలనుండి గాయకులూ, సంగీతకారులూ, వచ్చారు. వీళ్లు స్త్రోత్ర గీతాల్ని పాడే రెండు గొప్ప గుంపులుగా ఏర్పాటు చేయబడ్డారు, అందులో ప్రతీ గుంపునూ పెద్ద సమూహం అనుసరించేది. (నెహెమ్యా 12:27-31, 36, 38) ఆలయానికి చాలా దూరంగా ఉన్న ప్రాకారంమీద నుండి, బహుశా లోయ ద్వారం దగ్గర నుండి ఆ రెండు గొప్ప గుంపులూ అలాగే సమూహాలూ ప్రారంభమై, అవి దేవుని మందిరం దగ్గర కలుసుకునేంత వరకూ ఆ రెండు గుంపులూ, సమూహాలూ ఒకదానికొకటి అభిముఖంగా సాగాయి. “దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినముననే వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలుకూడ సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహు దూరమునకు వినబడెను.”—నెహెమ్యా 12:43.

15. యెరూషలేము ప్రాకార ప్రతిష్ఠాపన శాశ్వతమైన ఆనందానికి కారణమెందుకు కాలేదు?

15 ఈ ఆనందమయ ఆచరణ జరిగిన తారీఖును బైబిలు తెలియజేయడం లేదు. యెరూషలేము పునరుద్ధణ విషయంలో ఇది చరమాంకం కాకపోతే గనుక నిశ్చయంగా ఇది ఓ ఉన్నతాంశమే. పట్టణంలోపల చేపట్టాల్సిన నిర్మాణకార్యక్రమం చాలానే ఉంది. కాలక్రమేణా, యెరూషలేము పౌరులు తమ చక్కటి ఆధ్యాత్మిక స్థానాన్ని కోల్పోయారు. ఉదాహరణకు, నెహెమ్యా పట్టణాన్ని రెండోసారి సందర్శించినప్పుడు, దేవుని మందిరం మరలా నిర్లక్ష్యానికి గురైనట్టూ, ఇశ్రాయేలీయులు మరలా అన్య స్త్రీలను పెండ్లి చేసుకున్నట్టూ ఆయన కనుగొన్నాడు. (నెహెమ్యా 13:6-11, 15, 23) ప్రవక్తయైన మలాకీ రాతల్లో కూడా ఇలాంటి చెడ్డ పరిస్థితులే ధృవపర్చబడ్డాయి. (మలాకీ 1:6-8; 2:11; 3:8) కాబట్టి యెరూషలేము ప్రాకారాన్ని ప్రతిష్ఠించడం, శాశ్వతమైన ఆనందానికి కారణంకాలేదు.

నిత్యానందానికి కారణం

16. ఏ చరమాంకపు సంఘటనల కోసం దేవుని ప్రజలు ఎదురు చూస్తున్నారు?

16 దేవుడు తన శత్రువులపై విజయం పొందే సమయం కోసం నేడు యెహోవా ప్రజలు ఎదురు చూస్తున్నారు. అబద్ధ మతాలన్నింటితో కూడుకున్న అలంకారిక నగరమైన “మహా బబులోను” నాశనంతో అది ఆరంభమౌతుంది. (ప్రకటన 18:2, 8) అబద్ధ మత నాశనం, రానైవున్న మహా శ్రమయొక్క మొదటి దశను గుర్తిస్తుంది. (మత్తయి 24:21, 22) నిజంగా ప్రాముఖ్యమైన సంఘటన అంటే “నూతనమైన యెరూషలేము” పౌరులైన 1,44,000 మందితో కూడిన పెండ్లి కుమార్తెతో ప్రభువైన యేసుక్రీస్తుకు పరలోకంలో జరగబోయే వివాహ సంఘటన మనముందు ఉంది. (ప్రకటన 19:7; 21:2) ఆ పరలోక వివాహమెప్పుడు పూర్తవుతుందో ఖచ్చితంగా మనం చెప్పలేం కానీ అది మాత్రం ఖచ్చితంగా ఆనందమయ సంఘటన అవుతుంది.—కావలికోట (ఆంగ్లం) ఆగస్టు 15, 1990, పేజీలు 30-1.

17. నూతన యెరూషలేము నిర్మాణకార్యక్రమం పూర్తికావడం గురించి మనకేం తెలుసు?

17 నూతన యెరూషలేము నిర్మాణ కార్యక్రమం త్వరలోనే పూర్తికానైవుందని మనకు తెలుసు. (మత్తయి 24:3, 7-14; ప్రకటన 12:12) భూసంబంధమైన యెరూషలేము పట్టణంవలేగాక, అది నిరుత్సాహానికొక కారణంగా ఎన్నటికీ ఉండదు. ఎందుకంటే దాని పౌరులందరూ యేసుక్రీస్తు యొక్క ఆత్మాభిషిక్తులూ, పరీక్షించబడినవాళ్లూ, శుద్ధిచేయబడిన అనుచరులూ అయివున్నారు. మరణం వరకూ వాళ్లు చూపించిన నమ్మకత్వాన్నిబట్టి, వాళ్లలో ప్రతీ ఒక్కరూ విశ్వ సర్వాధిపతియైన యెహోవా దేవునికి నిరంతరమూ యథార్థంగా ఉన్నట్టు రుజువు చేసుకుంటారు. సజీవులైనా మృతులైనా సరే మిగిలిన మానవజాతియంతటికీ అది ప్రాముఖ్యమైన అర్థాన్ని కల్గివున్నది !

18. మనమెందుకు ‘ఎల్లప్పుడు హర్షించి, ఆనందించాలి’?

18 యేసు అర్పించిన విమోచన క్రయధన బలినందు విశ్వాసాన్ని ఉంచుతున్న మానవులపై నూతన యెరూషలేము తన అవధానాన్ని మళ్లించినప్పుడు జరగబోయే దాన్ని పరిశీలించండి. “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని” అపొస్తలుడైన యోహాను రాశాడు. (ప్రకటన 21:2-4) అంతేగాక, మానవజాతిని పరిపూర్ణతకు తెచ్చేందుకు దేవుడు ఈ పట్టణ ఏర్పాటు వంటి ఏర్పాటును ఉపయోగిస్తాడు. (ప్రకటన 22:1, 2) దేవుడు ఇప్పుడు సృజిస్తున్న వాటిని గూర్చి ఎల్లప్పుడు హర్షించి ఆనందించేందుకు’ అవి ఎంత అద్భుతమైన కారణాలై ఉన్నాయో గదా!—యెషయా 65:18.

19. క్రైస్తవులు సమకూర్చబడిన ఆధ్యాత్మిక పరదైసు అంటే ఏమిటి?

19 పశ్చాత్తాపాన్ని కనుపర్చిన మానవులు దేవుని సహాయాన్ని పొందేందుకు అంతవరకూ వేచివుండనక్కర్లేదు. 1919వ సంవత్సరంలో, ప్రేమ, సంతోషం, సమాధానం వంటి దేవుని ఆత్మ ఫలాలు విస్తారంగా ఉండే ఒక ఆధ్యాత్మిక పరదైసులోనికి 1,44,000 మంది సభ్యుల్లోని చివరివారిని యెహోవా సమకూర్చడం ఆరంభించాడు. (గలతీయులు 5:22, 23) ఆ ఆధ్యాత్మిక పరదైసు యొక్క విశిష్టమైన ఉన్నత లక్షణం దాని అభిషిక్త నివాసుల విశ్వాసమే, అంటే భూనివాసులందరికీ దేవుని రాజ్య సువార్తను ప్రకటించడంలో నడిపింపును ఇవ్వడంలో ఎంతో ప్రతిఫలదాయకంగా ఉన్న అభిషిక్త నివాసుల విశ్వాసమే. (మత్తయి 21:43; 24:14) తత్ఫలితంగా, భూసంబంధమైన నిరీక్షణగల ‘వేరే గొఱ్ఱెలకు’ చెందిన దాదాపు అరవై లక్షలమంది ఆ ఆధ్యాత్మిక పరదైసులోనికి ప్రవేశించడానికీ, ప్రతిఫలదాయకమైన పనిలో ఆనందించడానికి అనుమతించబడ్డారు. (యోహాను 10:16) దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అర్పించిన విమోచన క్రయధన బలియందుంచిన తమ విశ్వాసం ఆధారంగా యెహోవా దేవునికి తమను తాము సమర్పించుకోవడం ద్వారా వాళ్లు ఈ పనిని చేయడానికి అర్హులయ్యారు. నూతన యెరూషలేము భావి పౌరులతో వారు చేసే సహవాసం, నిజానికి ఒక ఆశీర్వాదమని రుజువైంది. ఆ విధంగా, అభిషిక్త క్రైస్తవులతో తన వ్యవహారాల్నిబట్టి యెహోవా “క్రొత్త భూమి” కోసం అంటే పరలోక రాజ్యపు భూసంబంధ పరిధిలో నివసించే దైవభయంగల మానవ సమాజం కోసం ఒక స్థిరమైన పునాదిని వేశాడు.—యెషయా 65:17; 2 పేతురు 3:13.

20. క్రొత్త యెరూషలేము సార్థకనామధేయ పట్టణంగా ఎలా ఉంటుంది?

20 తమ ఆధ్యాత్మిక పరదైసులో యెహోవా ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్న శాంతియుతమైన పరిస్థితులు, భూమిపైకి రానైవున్న భౌతిక పరదైసులో త్వరలోనే వాస్తవంకానైవున్నాయి. క్రొత్త యెరూషలేము మానవజాతిని ఆశీర్వదించేందుకు పరలోకం నుండి దిగివచ్చినప్పుడు అది జరుగుతుంది. యెషయా 65:21-25లో వాగ్దానం చేయబడిన శాంతియుతమైన పరిస్థితుల్ని దేవుని ప్రజలు రెండు రీతుల్లో అనుభవిస్తారు. ఆధ్యాత్మిక పరదైసులో యెహోవా దేవుని ఐక్య ఆరాధకులుగా, పరలోక యెరూషలేములో తమ స్థానానికి చేరుకోవాల్సిన అభిషిక్తులూ, ‘వేరే గొఱ్ఱెలకు’ చెందిన వాళ్లూ దేవుడు అనుగ్రహించిన శాంతిని ఇప్పుడు అనుభవిస్తున్నారు. ‘దేవుని చిత్తం పరలోకమందు ఎలా నెరువేరుతుందే అలాగే భూమిపై కూడా నెరవేరునప్పుడు,’ అలాంటి సమాధానం భూపరదైసులోనికి ప్రవేశిస్తుంది. (మత్తయి 6:10) అవును, ‘రెండు విధాలైన శాంతికి’ గట్టి ‘పునాది’గా దేవుని మహిమాయుక్త పరలోక నగరం, యెరూషలేము అన్న నామాన్ని సార్థకం చేసుకుంటుంది. దాని మహిమగల సృష్టికర్తయైన యెహోవా దేవునికీ, దాని పెండ్లి కుమారుడైన రాజగు యేసుక్రీస్తుకూ నిరంతరమూ స్తుతుల్ని తెచ్చేదిగా అది నిలిచిపోతుంది.

మీకు జ్ఞాపకమున్నాయా?

◻ యెరూషలేములో నెహెమ్యా ప్రజల్ని సమావేశపర్చినప్పుడు ఏమి సాధించబడింది?

◻ దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపర్చకుండా ఉండేందుకు ప్రాచీనకాల యూదులు ఏం చేయాల్సి వచ్చింది, మనం ఏం చేయవలసివుంది?

◻ శాశ్వతమైన ఆనందాన్నీ, శాంతినీ తీసుకురావడంలో “యెరూషలేము” ఎలా చేరివుంది?

[23వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

యెరూషలేము గుమ్మాలు

సంఖ్యలు ప్రస్తుతకాలపు ఎత్తును మీటర్లలో సూచిస్తున్నాయి

మత్స్యపు గుమ్మం

పాత పట్టణపు గుమ్మము

ఎఫ్రాయిము గుమ్మము

మూల గుమ్మము

వెడల్పు గోడ

మైదానము

లోయ ద్వారము

రెండవ భాగము

ఉత్తరాన ఉన్న మునుపటి గోడ

దావీదు పురము

పెంట ద్వారము

హిన్నోము లోయ

కోట

గొఱ్ఱెల గుమ్మము

బందీ గృహపు గుమ్మము

ఆలయ ప్రాంతం

తనిఖీ గుమ్మము

గుఱ్ఱపు గుమ్మము

ఓపెలు

మైదానము

నీటి గుమ్మము

గిహోను ఊట

బుగ్గ గుమ్మము

రాజోద్యానవనము

ఏన్‌రోగేలు

టైరోపోయాన్‌ (మధ్య) లోయ

కిద్రోను వాగు లోయ

740

730

730

750

770

770

750

730

710

690

670

620

640

660

680

700

720

740

730

710

690

670

యెరూషలేము పట్టణ నాశనం జరిగినప్పటిదనీ, ప్రాకార పునర్నిర్మాణ కార్యక్రమంలో నెహెమ్యా నడిపింపును ఇచ్చినప్పటదనీ తలంచబడుతున్న యెరూషలేము ప్రాకారము

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి