దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 102-105
మనం మంటి వాళ్లమని యెహోవాకు తెలుసు
యెహోవా దయను వివరించడానికి దావీదు అలంకారాలు ఉపయోగించాడు.
నక్షత్రాలతో నిండిన ఆకాశానికి భూమికి మధ్య ఎంత దూరం ఉంటుందో మనం లెక్కించలేం, అలాగే యెహోవా ఎంత ఎక్కువగా కృపను చూపిస్తాడో మనం అర్థం చేసుకోలేం
సూర్యోదయానికి సూర్యాస్తమయం ఎంత దూరంగా ఉంటుందో అంత దూరంలో, అంటే మనం ఊహించలేనంతగా యెహోవా మన పాపాలను దూరం చేస్తాడు
బాధపడుతున్న కొడుకు మీద నాన్న ఎలాగైతే దయ చూపిస్తాడో అలాగే పాపం చేసి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న వాళ్ల మీద యెహోవా కూడా దయ చూపిస్తాడు