మనం అంత్య దినాల్లో జీవిస్తున్నామా?
‘వ్యవహరించనశక్యమైన అపాయకరమైన కాలములు’ అనే పదబంధం కాయిరోయి క్వాలెపోయి అనే గ్రీకు పదాల నుండి తర్జుమా చేయబడింది. (2 తిమోతి 3:1) “భయానకము” అని అక్షరార్థభావం గల పదం యొక్క బహువచనం క్వాలెపోయి, అది భయము, అపాయము అనే భావాన్ని స్ఫురిస్తుంది. ఆ పదం “చెడు మరింత విస్తరించడాన్ని” సూచిస్తుందని ఒక బైబిలు వ్యాఖ్యాత చెబుతున్నాడు. కాబట్టి, మునుపటి యుగాల్లో సంక్షోభములు సంభవించినా, “అంత్య దినములు” అనేవి విపరీతమైన క్రూరత్వం గలవై ఉంటాయి. దానిని గూర్చి 2 తిమోతి 3:13 ఈ విధంగా చెబుతుంది, “దుర్జనులును వంచకులును . . . అంతకంతకు చెడిపోవుదురు.”
ఇది మన దినాలను వర్ణిస్తుందా? మనం అంత్య దినాల్లో జీవిస్తున్నామని ఇవి సూచిస్తున్నాయా అని గ్రహించేందుకు మనం 2 తిమోతి 3:2-5లో వ్రాయబడిన విశేషమైన రుజువులను విశ్లేషిద్దాము.
“మనుష్యులు . . . ధనాపేక్షులు.”—2 తిమోతి 3:2.
యు.ఎస్. న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్టు చెబుతున్నట్లు, వంచన అనేది “ఆర్థిక నేర భావావేశంగా” మారింది. అమెరికాలో ప్రతి సంవత్సరం 50 నుండి 80 అరబ్ డాలర్ల వరకు ఆరోగ్యరక్షణలో వంచన మాత్రమే జరుగుతుంది. విచారకరంగా, అలాంటి అవినీతి అనేది మామూలే. ఎథిక్స్ రిసోర్స్ సెంటర్ అధ్యక్షుడైన గారీ ఎడ్వార్డ్స్ చెబుతున్న ప్రకారం, మన “సంస్కృతి కొన్నిసార్లు అవినీతిని ఆచరిస్తుంది.” ఆయనిలా వివరిస్తున్నాడు: “రాజకీయవేత్తలును, ప్రభుత్వాన్ని మోసం చేసి తప్పించుకునే వ్యాపారస్థులునైన ప్రతినాయకులను మనం కథానాయకులనుగా చేస్తాము.”
“అహంకారులు.”—2 తిమోతి 3:2.
అహంకారియైన వ్యక్తి ఇతరులను నీచమైనవారిగా ఎంచుతాడు. వర్గ, జాతి విద్వేషాల్లో ఇది నేడు ఎంతగా స్పష్టమౌతుందో! దీనికి “అల్పసంఖ్యాకులందరూ గురవుతున్నారు,” అని కెనడాయందలి టొరంటోలోని ది గ్లోబ్ అండ్ మెయిల్ చెబుతుంది. “జర్మనీలో జాతి హింస అనేది పెరుగుతోంది, అమెరికాలో కూ క్లక్స్ క్లాన్ చురుగ్గా ఉంటోంది, స్వస్తికాలు టొరొంటో కాలిబాటలను, సమాజమందిరాలను పాడు చేస్తున్నాయి.” కెనడా యొక్క జ్యూయిష్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్వింగ్ అబెల్లా ఇలా చెబుతున్నాడు: “మనం దానిని అన్ని చోట్ల: స్వీడన్, ఇటలీ, హోలాండ్ మరియు బెల్జియమ్ అలాగే జర్మనీలోను చూస్తున్నాము.”
“తలిదండ్రులకు అవిధేయులు.”—2 తిమోతి 3:2.
“రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పుట్టినవారు, దుర్భాషలాడే, పోటీపడే, గౌరవం లేని పిల్లల తరాన్ని ఉద్భవింపజేసిన వారిగా ప్రసిద్ధి పొందారని” ది టొరొంటో స్టార్ చెబుతుంది. ఇంట్లో మొదలైన తిరుగుబాటుతనం పాఠశాలలో వెల్లడి అవుతుంది. నాలుగేండ్ల వయస్సున్న చిన్న పిల్లలు కూడా ఎదురు తిరుగుతున్నారని ఒక ఉపాధ్యాయురాలు చెప్పింది. “ఉపాధ్యాయులు పాఠాలు నేర్పించడానికంటే, ప్రవర్తనను గూర్చి చెప్పడానికే ఎక్కువ సమయం గడుపుతున్నారు” అని ఆమె చెబుతుంది. నిజమే, పిల్లలందరూ తిరుగుబాటుదారులు కారు. అయితే, “మొత్తం మీద వారికి దేని విషయంలోనూ గౌరవం లేనట్లు కనిపిస్తుంది” అని చిరకాలానుభవం గల ఉన్నత పాఠశాల అధ్యాపకుడు బ్రూస్ మాక్ గ్రెగర్ వ్రాస్తున్నారు.
“అనురాగరహితులు.”—2 తిమోతి 3:3.
అంత్యదినాల్లో, మరెక్కడికన్నా అనురాగం కనిపించవలసిన కుటుంబంలోనే దాని కొరత కనిపిస్తుంది. ద న్యూయార్క్ టైమ్స్ నివేదించేదేమంటే, “వాహన ప్రమాదాలను, అత్యాచారాలను, ఆక్రమణలను అన్నింటినీ కలిపిన దానికన్నా అమెరికాలోని వనితలు గాయపడడానికి, మరణించడానికి గృహంలో హింస అనేది ఎక్కువ కారణమౌతుంది.” విశ్వసించదగిన కుటుంబ సభ్యులే ఎక్కువగా పిల్లలపై అత్యాచారం చేస్తున్నారు. పెరుగుతున్న విడాకుల రేటు, పెద్దవారిపై అత్యాచారం, గర్భస్రావాలు కూడా అనేకులకు “సహజ మానవ అనురాగం పూర్తిగా లేకుండాపోయింది” అని రుజువునిస్తున్నాయి.—ఫిలిప్స్.
“క్రూరులు, సజ్జనద్వేషులు.”—2 తిమోతి 3:3.
వార్తాపత్రిక విలేఖరియైన బాబ్ హర్బర్ట్ ఈ విధంగా వ్రాస్తున్నాడు, “హత్య చేయడానికి బాల్య హంతకులకు కారణమేమీ అవసరం లేదు. ‘అకారణంగా’ మరొక మానవుని షూట్‌చేసి చంపే తలంపును చాలామంది పిల్లలు భావోద్రేకంతో హత్తుకున్నారు.” కొందరు తల్లిదండ్రులకు కూడా నైతిక బుద్ధిహీనత కనిపిస్తుంది. యౌవన తొలిప్రాయంలోని అబ్బాయిల గుంపు ఎంత ఎక్కువ మంది అమ్మాయిలతో వీలైతే అంత ఎక్కువ మందితో లైంగిక సంబంధం పెట్టుకున్నారనే దానిపై పోటీగా ఫాయింట్లను లెక్కించుకుంటున్నారనే నిందారోపహరణకు గురవ్వగా, ఒక తండ్రి ఇలా వ్యాఖ్యానించాడు: “తన ప్రాయంలోవున్న చురుకైన అమెరికా కుర్రవాడు చేయని దేనిని నా కొడుకు చేయలేదు.”
“దేవునికంటె సుఖానుభవమునెక్కువగా ప్రేమించువారు.”—2 తిమోతి 3:4.
ఒక అంచనా ప్రకారం, యౌవనారంభ దశలోనున్న పిల్లలు మత గుంపుతో ఒక గంట గడిపితే, 15 గంటలు ఎలక్ట్రానిక్ మాధ్యమంతో గడుపుతారు. అల్టూనా మిర్రర్ ఈ విధంగా నివేదిస్తుంది, “నేడు, సంత దుకాణాల్లోను పాఠశాల ప్రవేశమార్గాల్లోను వర్థిల్లుతున్న సమాచార వ్యవస్థ తెచ్చిపెట్టిన సంస్కృతి యౌవనారంభంలోనున్న వారి జీవితాలను శాసిస్తుంది. ఇక కుటుంబానిది రెండవ స్థానం, చివరి స్థానం చర్చిది.” మిర్రర్ ఇలా కూడా చెబుతుంది, “తల్లిదండ్రులు దగ్గర లేనప్పుడు, చర్చి మౌనంగా ఉన్నప్పుడు, ఇక యౌవనస్థుల జీవితాలను మాధ్యమమే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.”
“పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు.”—2 తిమోతి 3:5.
బైబిలు సత్యానికి జీవితాలను మార్చే శక్తి ఉంది. (ఎఫెసీయులు 4:22-24) అయితే, అత్యంత భక్తిహీన క్రియల్లో కొన్ని మతం ముసుగులోనే జరుగుతాయి. క్రైస్తవ మతాధికారులే పిల్లలపై అత్యాచారం చేయడం ఒక విషాదకరమైన ఉదాహరణ. దన్యూయార్క్ టైమ్స్ ప్రకారం, ఒక లాయరు “తాము మతగురువుల చేత అత్యాచారం చేయబడ్డారని వాదించే 27 రాష్ట్రాల్లోని కక్షిదారుల (క్లయింట్ల) పక్షాన పెండింగ్‌లో ఉన్న 200 కేసులు తనకున్నాయని చెబుతున్నాడు.” నిజంగా, క్రైస్తవ నాయకులు భక్తి ఉందని చూపించే ఏ ఆచారమైనా లేదా ఆడంబరమైనా పచ్చి వేషధారణయని వారి దుష్ట క్రియలచేత వెల్లడి చేయబడింది.
అంత్య దినాల్ని గూర్చిన మరిన్ని రుజువులు
మనుష్యులు ఇలా ఉంటారని కూడా 2 తిమోతి 3:2-4 చెబుతుంది. . .
◻ స్వార్థప్రియులు
◻ దూషకులు
◻ కృతజ్ఞతలేనివారు
◻ అపవిత్రులు
◻ అతిద్వేషులు
◻ అపవాదకులు
◻ అజితేంద్రియులు
◻ ద్రోహులు
◻ మూర్ఖులు
◻ గర్వాంధులు
“నీ రాకడకు సూచనలు”
తన మరణానికి కొంచెం ముందు, యేసును ఇలా అడిగారు: “నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” (మత్తయి 24:3) అంత్యదినాలను సూచించే ప్రత్యేక పరిస్థితులను, సంఘటనలను యేసు తెలియజేశాడు వాటిలో కొన్నింటిని మనం పరిశీలిద్దాము.
“జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును.”—మత్తయి 24:7.
“ఇరవయ్యో శతాబ్దంలో—మొత్తం మీద సాంఘికాభివృద్ధి మరియు పేద ప్రజల జీవితాల ఎడల ప్రభుత్వ శ్రద్ధ పెరిగినప్పటికీ,—ఈ శతాబ్దంలో మెషిన్ గన్, ట్యాంక్, బి-52, అణు బాంబు, చివరికి మిసైల్ ఈ శతాబ్దాన్ని శాసిస్తున్నాయి. ఇది మరే ఇతర యుగం కన్నా, మరింత రక్తసిక్తమైన మరియు వినాశకరమైన యుద్ధాలతో గుర్తించబడింది.”—మైల్‌స్టోన్స్ ఆఫ్ హిస్టరీ.
“అక్కడక్కడ . . భూకంపములు కలుగును.”—మత్తయి 24:7.
ఈ శతాబ్దంలో ఇండియా, ఇటలీ, ఇరాన్, చిలీ, చైనా, జపాన్, టర్కీ మరియు పెరూలో రిక్టరు స్కేలుపై 7.5 నుండి 8.3 పాయింట్ల తీవ్రతతో భూకంపాలు సంభవించాయి.
“మహా భయోత్పాతములు పుట్టును.”—లుకా 21:11.
ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన భయపెట్టే మార్పుల కారణంగా, ప్రజల జీవితాల్లో బహుశ ఒకే ఒక పెద్ద భావోద్రేకం భయమే. ప్రజలు తమ భద్రతకు, తమ జీవితాలకు అపాయం కలిగించే యుద్ధం, నేరం, కాలుష్యం, రోగం, ద్రవోల్బణం వంటి విషయాలను గూర్చి మరియు ఇతర విషయాలను గూర్చి భయపడుతున్నారు.
“కరవులు కలుగును.”—మత్తయి 24:8.
“సహాయక గుంపులు వాదులాడుకుంటుండగా, ఆకలిబాధ అధికమౌతుంది,” అని న్యూ సైంటిస్ట్ పత్రికలో ఒక వార్తాశీర్షిక ప్రకటిస్తుంది. అమెరికా మాజీ అధ్యక్షుని అభిప్రాయం ప్రకారం, రెండు దశాబ్దాల్లో భూగ్రహమంతా కరువు చేత సర్వనాశనం చేయబడే అపాయంలో ఉంది. “అలాంటి భయం ప్రవచించబడినప్పటికీ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వ్యవసాయ శాఖకు ధనిక దేశాలు ఇస్తున్న సహాయం మొత్తం అకస్మాత్తుగా తగ్గిపోతోంది.”
“అక్కడక్కడ . . తెగుళ్లు తటస్థించును.”—లూకా 21:11.
నిపుణుల జాబితా తెలియజేసిన ప్రకారం, అమెరికా ప్రభుత్వం సంవత్సరానికి 50 కోట్ల డాలర్ల కన్నా ఎక్కువ ఖర్చు చేసి ఎయిడ్స్‌కు ఎదురుగా పోరాడుతుంది, అయితే అది ఘోర అపజయంగా పిలువబడుతుంది. “మనం ఎయిడ్స్ కారణాన ఈ తరమంతటి ఉత్పాదక సామర్థ్యాన్ని కోల్పోతున్నాము,” అని 200 నుండి 300 మంది రోగులకు చికిత్స చేసే డా. డోనా స్వీట్ హెచ్చరించారు. అమెరికాలో 25 నుండి 44 ఏండ్ల వరకు ప్రాయంగల వారి మరణాలకు ఇప్పుడు ముఖ్య కారణం ఎయిడ్సే.
“అక్రమము విస్తరించును.”—మత్తయి 24:12.
అమెరికాలో 2,500 మంది యౌవనస్థుల్లో చేసిన సర్వే ఏమి బయల్పరచిందంటే 15 శాతం మంది గత 30 రోజుల్లో ఒక ప్రత్యేక సమయమందు తుపాకులు పట్టుకుని తిరిగారు, మరి 11 శాతం మంది గత సంవత్సరంలో కాల్చివేయబడ్డారు, 9 శాతం మంది ఇతరులపై కాల్పులు జరిపారు.
త్వరలో ఏముంది?
మనం చూసినట్లు, మానవ జాతి సరైన మార్గం నుండి వైదొలగి, శాంతియుతమైన లోకానికి ఎంతో దూరమైంది. పరిమాణాన్ని చూస్తే, పై సంఘటనలు మునుపెన్నటికన్నా భయంకరంగా ఉన్నాయి. నిజమే, మానవ కుటుంబం తాను అపరిచిత ప్రాంతంలో ఉన్నట్లు కనుగొంటుంది. అది అంత్యదినములు అని పిలువబడే యుగంలో ప్రయాణిస్తుంది.
ఈ కాలం తర్వాత ఏది వస్తుంది?
[Picture Credit Line on page 4]
Michael Lewis/Sipa Press