కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lff పాఠం 59
  • మీరు హింసను సహించగలరు!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు హింసను సహించగలరు!
  • ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎక్కువ తెలుసుకోండి
  • ఒక్కమాటలో
  • ఇవి కూడా చూడండి
  • హింసలు ఎదురైనప్పుడు సంతోషించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • హింసల్ని ఎదుర్కోవడానికి ఇప్పుడే సిద్ధపడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • కష్టాల్ని తట్టుకోవడానికి యెహోవా ఏమేం ఇచ్చాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • పరీక్షల్లో సహనం చూపించడం యెహోవాకు స్తుతి తెస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
lff పాఠం 59
59వ పాఠం. ఇద్దరు పోలీసులు ఒక సహోదరునికి బేడీలు వేసి తీసుకెళ్తున్నారు. అక్కడ న్యూస్‌ రిపోర్టర్లు, తోటి యెహోవాసాక్షులు నిలబడి ఉన్నారు.

59వ పాఠం

మీరు హింసను సహించగలరు!

ముద్రిత ప్రతి
ముద్రిత ప్రతి
ముద్రిత ప్రతి

ఇప్పుడు లేదా భవిష్యత్తులో క్రైస్తవులందరూ వ్యతిరేకతను, ఆఖరికి హింసను ఎదుర్కొంటారు. దానికి మనం భయపడాలా?

1. మనకు హింసలు ఎందుకు వస్తాయి?

బైబిలు స్పష్టంగా ఇలా చెప్తుంది: “క్రీస్తుయేసు శిష్యులుగా దైవభక్తితో జీవించాలని కోరుకునే వాళ్లందరికీ హింసలు వస్తాయి.” (2 తిమోతి 3:12) యేసు ఈ సాతాను లోకానికి చెందినవాడు కాదు, కాబట్టి ఆయనకు హింసలు వచ్చాయి. మనం కూడా ఈ లోకానికి చెందినవాళ్లం కాదు కాబట్టి ఈ లోక ప్రభుత్వాలు, మత సంస్థలు మనల్ని హింసించినప్పుడు మనం ఆశ్చర్యపోం.—యోహాను 15:18, 19.

2. హింసలు ఎదుర్కోవడానికి మనం ఎలా సిద్ధపడవచ్చు?

యెహోవా మీద మన నమ్మకాన్ని ఇప్పుడే బలపర్చుకోవాలి. ప్రతీరోజు ఆయనకు ప్రార్థించడానికి, బైబిలు చదవడానికి సమయం తీసుకోండి. క్రమంగా మీటింగ్స్‌కి వెళ్లండి. అలా చేస్తే, ఎలాంటి హింస వచ్చినా ఆఖరికి అది కుటుంబ సభ్యుల నుండి వచ్చినా సరే, మీరు దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఎన్నోసార్లు హింసను అనుభవించిన అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “నాకు సహాయం చేసేది యెహోవాయే; నేను భయపడను.”—హెబ్రీయులు 13:6.

క్రమంగా ప్రకటించడం ద్వారా కూడా మనం ధైర్యాన్ని పెంచుకోవచ్చు. ప్రకటనా పని చేయడం వల్ల యెహోవా మీద నమ్మకాన్ని పెంచుకుంటాం, మనుషుల భయాన్ని తీసేసుకుంటాం. (సామెతలు 29:25) మీరు ప్రకటించడానికి ఇప్పుడు ధైర్యం పెంచుకుంటే, భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రకటించడానికి సిద్ధంగా ఉండగలుగుతారు. ఆఖరికి, ప్రభుత్వం మన పనిని ఆపడానికి ప్రయత్నించినా సరే ప్రకటిస్తూ ఉండగలుగుతారు.—1 థెస్సలొనీకయులు 2:2.

3. హింసల్ని సహించినప్పుడు మనం ఎలా ప్రయోజనం పొందుతాం?

నిజమే, హింసలు అనుభవించడాన్ని మనం ఇష్టపడం. కానీ, వాటిని సహిస్తే మన విశ్వాసం ఇంకా బలంగా తయారౌతుంది. హింసల్ని సహించే శక్తి ఇక మన దగ్గర లేదని అనిపించినప్పుడు యెహోవా సహాయాన్ని రుచి చూస్తాం, కాబట్టి ఆయనకు ఇంకా దగ్గరౌతాం. (యాకోబు 1:2-4 చదవండి.) మనం హింసలు అనుభవించడం చూసి యెహోవా బాధపడతాడు, కానీ మనం వాటిని సహించడం చూసి ఆయన సంతోషిస్తాడు. బైబిలు ఇలా చెప్తుంది: “మంచి చేసినందుకు బాధలుపడి సహిస్తే దేవుడు దాన్ని ఇష్టపడతాడు.” (1 పేతురు 2:20) చివరి వరకు సహించే వాళ్లందరికీ యెహోవా కొత్తలోకంలో శాశ్వత జీవితం ఇస్తాడు. అప్పుడు సత్యారాధనను వ్యతిరేకించే వాళ్లెవ్వరూ ఉండరు.—మత్తయి 24:13.

ఎక్కువ తెలుసుకోండి

హింసలు ఎదురైనా మనం యెహోవాకు విశ్వసనీయంగా ఉండగలమని, సహించడం వల్ల వచ్చే ప్రయోజనాల్ని పొందగలమని ఎందుకు నమ్మకంతో ఉండవచ్చో చూడండి.

తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నా ఒకామె బైబిలు స్టడీకి వెళ్తోంది.

4. ఇంట్లోవాళ్లు వ్యతిరేకించినా మీరు సహించగలరు!

యెహోవాను ఆరాధించాలని మనం తీసుకున్న నిర్ణయాన్ని మన ఇంట్లోవాళ్లు ఇష్టపడకపోవచ్చు అని యేసు చెప్పాడు. మత్తయి 10:34-36 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మనం యెహోవాను ఆరాధించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇంట్లోవాళ్లు ఏం చేసే అవకాశం ఉంది?

ఉదాహరణకు వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

వీడియో: యెహోవా మమ్మల్ని చేరదీశాడు (5:13)

  • మీ కుటుంబం లేదా స్నేహితులు యెహోవా సేవ చేయకుండా మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తే, మీరేం చేస్తారు?

కీర్తన 27:10; మార్కు 10:29, 30 చదవండి. ప్రతీ లేఖనం చదివిన తర్వాత, ఈ ప్రశ్నను చర్చించండి:

  • కుటుంబం లేదా స్నేహితుల నుండి వ్యతిరేకత ఎదురైతే, బైబిలు ఇస్తున్న ఈ మాట మీకు ఎలా సహాయం చేస్తుంది?

5. హింసలు ఎదురైనా యెహోవాను ఆరాధిస్తూనే ఉండండి

వేరేవాళ్లు ఆపాలని ప్రయత్నించినా, యెహోవాను ఆరాధిస్తూనే ఉండాలంటే మనకు ధైర్యం అవసరం. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

వీడియో: హింస ఎదురైనా ధైర్యం చూపించారు (6:27)

  • ఈ వీడియోలోని అనుభవాలు మీకు ఎలా ధైర్యాన్ని ఇచ్చాయి?

అపొస్తలుల కార్యాలు 5:27-29; హెబ్రీయులు 10:24, 25 చదవండి. ప్రతీ లేఖనం చదివిన తర్వాత, ఈ ప్రశ్నను చర్చించండి:

  • ప్రభుత్వం మనల్ని ప్రకటించవద్దు అని, మీటింగ్స్‌కి వెళ్లవద్దు అని చెప్పినా యెహోవాను ఆరాధిస్తూనే ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

6. హింసల్ని సహించడానికి యెహోవా మీకు సహాయం చేస్తాడు

ప్రపంచవ్యాప్తంగా, రకరకాల వయసులకు చెందిన యెహోవాసాక్షులు హింసల్ని ఎదుర్కొన్నారు. అయినా వాళ్లు యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగారు. వాళ్లకు ఏది సహాయం చేసిందో తెలుసుకోవడానికి, వీడియో చూడండి. తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

వీడియో: యెహోవా దేవుడు నాకు బలాన్ని ఇస్తాడు (3:40)

  • ఈ వీడియోలోని వాళ్లకు, హింసల్ని సహించడానికి ఏది సహాయం చేసింది?

రోమీయులు 8:35, 37-39; ఫిలిప్పీయులు 4:13 చదవండి. ప్రతీ లేఖనం చదివిన తర్వాత, ఈ ప్రశ్నను చర్చించండి:

  • మీరు ఎలాంటి కష్టాన్నైనా సహించగలరు అని ఈ లేఖనం ఎలా భరోసా ఇస్తుంది?

మత్తయి 5:10-12 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • హింసలు వచ్చినా మీరు ఎందుకు సంతోషంగా ఉండవచ్చు?

విశ్వాసం కారణంగా హింసను, జైలు శిక్షను అనుభవించిన ఆధునికకాల యెహోవాసాక్షులు.

లక్షలమంది యెహోవాసాక్షులు వ్యతిరేకతను నమ్మకంగా సహించారు. మీరు కూడా సహించగలరు!

కొంతమంది ఇలా అంటారు: “హింసల్ని సహించడం నా వల్ల కాదు.”

  • ఏ లేఖనాలు వాళ్లలో ధైర్యాన్ని నింపవచ్చు?

ఒక్కమాటలో

హింసలు ఎదురైనా తనను ఆరాధించడానికి మనం చేసే ప్రయత్నాల్ని యెహోవా విలువైనదిగా చూస్తాడు. ఆయన సహాయంతో మనం తప్పకుండా సహించగలం!

మీరేం నేర్చుకున్నారు?

  • క్రైస్తవులకు హింసలు ఎందుకు వస్తాయి?

  • హింసల్ని సహించడానికి మీరు ఇప్పుడే ఎలా సిద్ధపడవచ్చు?

  • ఎలాంటి కష్టం వచ్చినా మీరు యెహోవాను ఆరాధించగలరు అని ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

తటస్థంగా ఉన్నందుకు ఒక యువ సహోదరుడిని జైల్లో వేశారు. సహించడానికి యెహోవా అతనికి ఎలా సహాయం చేశాడో చూడండి.

హింస ఎదురైనా సహించడం (2:34)

వ్యతిరేకత ఉన్నా ఒక జంట ఎన్నో ఏళ్లుగా యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగింది. వాళ్లకు ఏది సహాయం చేసిందో చూడండి.

పరిస్థితులు ఎలా ఉన్నా యెహోవాను సేవించడం (7:11)

హింసను ధైర్యంగా ఎలా ఎదుర్కోవచ్చో తెలుసుకోండి.

“హింసల్ని ఎదుర్కోవడానికి ఇప్పుడే సిద్ధపడండి” (కావలికోట, జూలై 2019)

కుటుంబం నుండి వచ్చే వ్యతిరేకతను మనం ఎలా ఎదుర్కోవచ్చు? మనం సమాధానంగా ఉంటూనే యెహోవాకు నమ్మకంగా ఎలా ఉండవచ్చు?

“సత్యం ‘శాంతిని కాదు, కత్తిని’ తీసుకొస్తుంది” (కావలికోట, అక్టోబరు 2017)

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి