కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 8/15 పేజీ 29
  • మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • “చదువువాడు గ్రహించుగాక”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • యెహోవాను మీ ఆశ్రయంగా చేసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • కుటుంబములారా, దేవుని సంఘంలో భాగంగా ఆయనను స్తుతించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ప్రతి ఒక్కరూ స్వతంత్రులుగా ఉంటారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 8/15 పేజీ 29

మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?

ఇటీవలి కావలికోట సంచికలు మీ విషయంలో ఆచరణాత్మకమైన విలువగలవిగా ఉన్నట్లు మీరు కనుగొన్నారా? అయితే, ఈ క్రింద ఇవ్వబడిన ప్రశ్నలతో మీ జ్ఞాపకశక్తిని ఎందుకు పరీక్షించుకోకూడదు:

◻ ఉద్యోగ విషయంలో నిర్ణయాలు తీసుకోవలసివున్న అనేకమంది క్రైస్తవులు వ్యక్తిగత నిర్ణయాన్ని తీసుకోవడానికి ఏ రెండు ప్రశ్నలు సహాయం చేశాయి?

మొదటి కీలకమైన ప్రశ్నేమిటంటే: బైబిలులో లౌకిక పని ఖండించబడిందా? రెండవ ప్రశ్న: ఫలాని పని చేయడం, ఏదైనా ఖండించబడిన పనిలో ఒక వ్యక్తిని భాగస్వామిని చేస్తుందా?—4/15, పేజీ 28.

◻ ఏవిధంగా, ‘మానవ సృష్టి నాశనమునకు లోనైంది’? (రోమీయులు 8:20)

మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వల చర్యల మూలంగా మనం ‘వ్యర్థతకు లోనుచేయబడ్డాము.’ ఇది జరిగింది “[మనం] స్వేచ్ఛగా” ఇష్టపడడం మూలంగాకాదు, లేదా మనం వ్యక్తిగతంగా ఎంపిక చేసుకోవడం ఫలితంగా కాదు. మనం దాన్ని వారసత్వంగా పొందాము. మన ఆది తల్లిదండ్రులు తమ సంతానానికి కేవలం అపరిపూర్ణతను, పాపాన్ని, మరణాన్ని మాత్రమే వారసత్వంగా ఇవ్వగల్గినప్పటికీ యెహోవా వారు పిల్లలకు జన్మనిచ్చేందుకు కరుణతో అనుమతించాడు. మరణం అందరికీ సంప్రాప్తమయ్యింది, కాబట్టి ఆ భావంలో ‘సృష్టి వ్యర్థతకు లోనయ్యేలా’ దేవుడు అనుమతించాడు.—5/1, పేజీ 5.

◻ ‘హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలబడటం’ భవిష్యత్తులో జరుగుతుందనడం ఎందుకు సహేతుకమైనది? (మత్తయి 24:15)

ఆ ప్రవచన మొదటి నెరవేర్పులో ‘పరిశుద్ధ స్థలమందు నిలుచున్న హేయవస్తువు,’ సా.శ. 66లో జనరల్‌ గాలస్‌ ఆధ్వర్యంలో జరిగిన రోమన్లదాడికి ముడి పెట్టబడింది. ఆ దాడికి ఆధునికకాల సమాంతరం, అంటే “మహా శ్రమ” ప్రారంభం ఇంకా ముందుంది. (మత్తయి 24:21) కాబట్టి ‘నాశనకరమైన హేయవస్తువు’ పరిశుద్ధ స్థలమందు నిలువనైవుంది.—5/1, పేజీలు 16, 17.

◻ పనిచేస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలతో గడపడానికి సమయాన్ని ఎలా కనుగొనవచ్చు?

పగలంతా పని చేసి అలసిపోయిన తల్లి, వంట చేయడంలో తనతో కలవమని తన పిల్లలకు చెప్పవచ్చు. వారాంతాల్లో చేయవలసిన అనేక పనుల లిస్ట్‌ ఉన్న తండ్రి, ఆ పనుల్లో కొన్నింటిని తన పిల్లలతో కలిసి చేయవచ్చు.—5/15, పేజీ 6.

◻ ‘యెహోవా మార్గంలో నడిచేవారు’ ఏమి చేయాలి? (యిర్మీయా 7:23)

యెహోవా మార్గంలో నడవడానికి యథార్థత—ఆయన్ను మాత్రమే సేవించాలన్న కృతనిశ్చయం అవసరం. దానికి నమ్మకం—యెహోవా వాగ్దానాలు నమ్మదగినవి, అవి తప్పకుండా నెరవేరుతాయి అన్న సంపూర్ణ విశ్వాసం అవసరం. యెహోవా మార్గంలో నడవడానికి విధేయత—ఆయన నియమాలను ఏమాత్రం తప్పిపోకుండా అనుసరించడమూ, ఆయన ఉన్నతమైన ప్రమాణాలను అంటిపెట్టుకోవడమూ అవసరం. (కీర్తన 11:7)—5/15, పేజీ 14.

◻ ‘మనుష్యులలో ఈవులు’ నెరవేర్చగల నాలుగు ముఖ్యమైన బాధ్యతలు ఏవి? (ఎఫెసీయులు 4:8)

వారు మనల్ని వాత్సల్యంతో సరిదిద్దగలరు, ప్రేమతో క్షేమాభివృద్ధి కలుగజేయగలరు, సంఘంతో మన ఐక్యతకు దోహదపడగలరు, ధైర్యంతో మనల్ని కాపాడగలరు. (ఎఫెసీయులు 4:12-14)—6/1, పేజీ 14.

◻ అపొస్తలుల కార్యములలోను, పౌలు వ్రాసిన ఉత్తరాలలోను ప్రస్తావించబడినట్లుగా పౌలుకు దాదాపు వందమందితో ఉన్న సహవాసం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

మనం ఎల్లప్పుడు దేవుని సంస్థతో, మన స్థానిక సంఘంతో మన తోటి విశ్వాసులతో పనిచేస్తూ ఉండాలి. మనకు మంచి కాలాల్లోనూ దుర్దశల్లోనూ వారి సహాయం, మద్దతు, ఆదరణ అవసరం.—6/1, పేజీ 31.

◻ ఇతరులు సృష్టికర్త గురించి ఆలోచించేలా సహాయం చేయడానికి ఏ మూడు వాదనలను ఉపయోగించవచ్చు?

అనంత విశ్వంలో కనబడే ఖచ్చితత్వం, భూమ్మీద జీవావిర్భావం, త్రోసిపుచ్చలేని మానవ మెదడు యొక్క సాటిలేనితనమూ, వైవిధ్యభరితమైన దాని సామర్థ్యాలూ.—6/15, పేజీ 18.

◻ సృష్టికర్త వ్యక్తిగత నామం యొక్క భావాన్ని అర్థం చేసుకోవడం ఎందుకంత ప్రాముఖ్యం?

దేవుని నామం, “తానే కర్త అవుతాడు” అన్న భావాన్ని సూచిస్తుంది, ఆయన సంకల్పిస్తాడనీ చర్య కూడా తీసుకుంటాడనీ నొక్కి చెబుతుంది. మనం ఆయన నామాన్ని తెలుసుకుని ఉపయోగించడం ద్వారా, ఆయన తన వాగ్దానాలను నెరవేరుస్తాడనీ, తన సంకల్పాన్ని చురుకుగా వాస్తవరూపానికి తీసుకువస్తాడనీ మనం మరింత గ్రహింపుకు రాగలము.—6/15, పేజీ 21.

◻ కుటుంబ బైబిలు పఠనంలో పిల్లలను ఎలా నిమగ్నం చేయవచ్చు?

సాధ్యమైన చోట్ల ప్రతి పిల్లవానికి సొంత బైబిలు, పఠిస్తున్న పత్రిక ఉండేలా ఏర్పాటు చేయండి. పఠిస్తున్న ప్రచురణలోని చిత్రాన్ని వివరించమని చిన్న పాపను గానీ బాబును గానీ అడుగవచ్చు. ఫలాని లేఖనం చదవమని ముందే ఒక పిల్లవానికి చెప్పవచ్చు. పఠన సమాచారంలో ఆచరణయోగ్యమైన అన్వయింపు కోసమైన అవకాశాలను ఎత్తిచూపమని కాస్త పెద్ద వయస్సున్న పిల్లవానికి ముందే చెప్పవచ్చు.—7/1, పేజీ 15.

◻ సంఘకూటాల కోసమైన సిద్ధపాటులో ఒక కుటుంబం చేర్చగల కొన్ని లక్ష్యాలు ఏవి?

(1) కుటుంబంలో ప్రతి ఒక్కరు సంఘ కూటాల్లో వ్యాఖ్యానించడానికి సిద్ధంగా ఉండటం; (2) వ్యాఖ్యానాలను తమ సొంత మాటల్లో ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కృషిచేయటం; (3) వ్యాఖ్యానాల్లో లేఖనాలను చేర్చటం; (4) వ్యక్తిగత అన్వయింపును చేసుకునే దృష్టితో సమాచారాన్ని విశ్లేషించటం.—7/1, పేజీ 20.

◻ మంచి వివాహబంధానికి ఒక కీలకం ఏమిటి?

మంచి వివాహబంధమనే తాళాన్ని తెరవడానికి, అందులోని ప్రశస్తమైన ఆనందాలను అనుభవించేందుకు మనసులో మాటను ఆరోగ్యకరమైన విధంగా తెలియజేసుకోవడం అత్యవసరం. దానిలో మనస్సులోని భావాలను, ఆలోచనలను పంచుకోవడం ఇమిడి ఉంది. మనసులోని మాటను ఆరోగ్యకరమైన విధంగా తెలియజేసుకోవడంలో నిర్మాణాత్మకమైన, సేదతీర్చేటువంటి, నీతియుక్తమైన, ప్రశంసించదగిన, సాంత్వనపరచే విషయాలను తెలుపుకోవడం ఇమిడి ఉంది. (ఎఫెసీయులు 4:29-32; ఫిలిప్పీయులు 4:8)—7/15, పేజీ 21.

◻ ‘యెహోవా మార్గం’ అంటే ఏమిటి? (కీర్తన 25:8, 9, 12)

ఆ మార్గం ప్రేమ మార్గం. అది దేవుని ప్రమాణాల ప్రకారంగా సరియైనదేదో దాన్ని చేయడంపై ఆధారపడివుంటుంది. సూత్రానుసారమైన ఈ ప్రేమను బైబిలు, “సర్వోత్తమమైన మార్గము” అని పిలుస్తుంది. (1 కొరింథీయులు 12:31)—8/1, పేజీ 12.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి