కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 10/15 పేజీ 31
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఇలాంటి మరితర సమాచారం
  • “పరిసయ్యులు, సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • “నాయొద్ద నేర్చుకొనుడి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ఇప్పుడు మరణించియున్న కోట్లకొలది ప్రజలు తిరిగి జీవించెదరు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • మనం చనిపోయినా తిరిగి లేస్తాం!
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 10/15 పేజీ 31

పాఠకుల ప్రశ్నలు

మొదట హవ్వ, ఆ తర్వాత ఆదాము, మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు యొక్క ఫలాన్ని తిన్నప్పుడు, వారు తిన్నది జల్దరు (ఆపిల్‌) పండా?

మనకు తెలియదు. ‘తినకూడదన్న పండు’ జల్దరు (ఆపిల్‌) అని అనేకమంది ప్రజలు భావించారు, మరి శతాబ్దాలుగా చిత్రకారులు ఆ పండును జల్దరుగా చిత్రీకరించారు. కానీ బైబిలు ఆ చెట్టు పేరుగానీ పండు పేరునుగానీ చెప్పడంలేదు. హవ్వ దాన్ని కేవలం “తోట మధ్యనున్న చెట్టు ఫలము” అని మాత్రమే సంబోధించింది.—ఆదికాండము 3:3.

ఇన్‌సైట్‌ ఆన్‌ ది స్క్రిప్చర్స్‌లోని “జల్దరు” అనే శీర్షిక ఈ విషయంలో ఎంతో ఆసక్తిదాయకంగా ఉంది:

“తపువాచ్‌ అనే హెబ్రీ పదం సూచిస్తున్న చెట్టు మరియు పండు యొక్క గుర్తింపు ఎంతో ఉజ్జాయింపుతో కూడి ఉంది. అది దాని సువాసన, లేక సుగంధాన్నిబట్టి ప్రత్యేకంగా ఉంటుందని ఆ పదమే సూచిస్తుంది. అది ‘ఊదు; ఎగశ్వాస; ఊపిరి పీల్చుకోడానికి ప్రయాసపడు,’ అనే అర్థమున్న నాప్‌హాచ్‌ అనే మూలపదం నుండి వచ్చింది. (ఆది. 2:7; యోబు 31:39; యిర్మీ. 15:9) దీనిని గురించి, ఎమ్‌. సి. ఫిషర్‌ యిలా వ్రాశాడు: ‘[నాప్‌హాచ్‌తో] సంబంధం మొదట్లో శబ్దార్థముల వృద్ధ్యుతత్తులు మితిమీరి గమనించినట్లు కన్పించినా, “ఊపిరి” మరియు “వాసన పీల్చుకొను” అనే అర్థాలకు దగ్గరి సంబంధం కల్గివున్నాయి. అదే అర్థానిచ్చే మరొక పదమైన పుఆహా, (గాలి) “ఊదు” మరియు “మంచి వాసనను పీల్చు, సువాసన కలిగివుండు,” అనే అర్థాలనిస్తుంది.’—ఆర్‌. ఎల్‌. హారిస్‌చే కూర్చబడిన థియెలాజికల్‌ వర్డ్‌బుక్‌ ఆఫ్‌ ది ఓల్డ్‌ టెస్టమెంట్‌, 1980, సంపు. 2, పు. 586.

“నారింజ, దబ్బపండు, సీమదానిమ్మ, మరియు ఆప్రికాట్‌తో సహా అనేక పండ్లు, జల్దరు స్థానంలో సూచించబడ్డాయి. . . . అయితే దానికి సంబంధించిన అరబ్బీ పదమైన టూఫాహా ప్రాముఖ్యంగా ‘జల్దరు’ అనే అర్థాన్నిస్తుంది, మరి హెబ్రీ స్థలాల పేర్లైన తప్పూయ, బేత్తపూయ (బహుశా వాటి దరిదాపుల్లో ఆ పండ్లు విస్తారంగా ఉన్నందుకు ఆ పేర్లు పెట్టబడ్డాయి) ఈ పదం యొక్క ఉపయోగం ద్వారానే వాటి అరబి సమాంతరాల్లో భద్రపర్చబడ్డాయన్న విషయం గమనార్హంగా ఉంది. (యెహో. 12:17; 15:34, 53; 16:8; 17:8) ఈ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు కావుగానీ కొండ ప్రాంతంలో ఉన్నాయి, అక్కడి వాతావరణం సాధారణంగా ఒక మోస్తరుగా ఉంటుంది. దానికి తోడు, గతంలో కొంత వాతావరణ మార్పుల సంభావ్యతను పూర్తిగా కొట్టి పారేయలేము. జల్దరు చెట్లు నేడు ఇశ్రాయేలులో పెరుగుతున్నాయి, అలా అవి బైబిలు వివరణకు సంతృప్తిదాయకంగా సరిపోతున్నట్లు కనిపిస్తుంది. గత శతాబ్దంలో సిరియా, పాలస్తీనాలలో అనేక సంవత్సరాలు గడిపిన విలియమ్‌ థామ్‌సన్‌, ఫిలిష్తియా పల్లపు మైదానమందున్న అష్కెలోను ప్రాంతంలో జల్దరు తోటలను కనుగొన్నట్లు కూడా నివేదించాడు.—జే. గ్రాండేచే పునర్విమర్శ చేయబడిన ది లాండ్‌ అండ్‌ ది బుక్‌, 1910, పు. 545, 546.

“జల్దరు చెట్టు (పయిరస్‌ మాలస్‌) ప్రాముఖ్యంగా పరమగీతములో ప్రస్తావించబడింది, అక్కడ షూలమ్మీతి యొక్క కాపరి స్నేహితుని ప్రేమాతిశయములు జల్దరు చెట్టు యొక్క హాయినిచ్చే నీడకు మరి దాని పండ్ల తీయదనానికి పోల్చబడ్డాయి. (పరమ. 2:3, 5) దానికి ప్రతిగా, అతను ఆమె శ్వాసను జల్దరు సువాసనతో పోల్చాడు. (పరమ. 7:8; 8:5ను కూడా చూడండి.) సామెతలు (25:11)లో సరైన, సందర్భోచితమైన మాట ‘చిత్రమైన వెండి పళ్లెములో నుంచబడిన బంగారు జల్దరు పండ్లకు’ పోల్చబడింది. జల్దరును గురించిన మరొక వ్యాఖ్యానం కేవలం యోవేలు 1:12నందు మాత్రమే కనుగొనబడుతుంది. ఏమైనప్పటికీ, జల్దరే ఏదేను యొక్క నిషేధింపబడిన ఫలమని చెప్పబడే సాధారణ ఆచారం ఏదైనా ఉంటే అది ఎంత మాత్రం లేఖనాధారం లేనిది. అదే విధంగా, ‘కంటి ఆపిల్‌’ (ఆపిల్‌ ఆఫ్‌ ది ఐ) అనే వాక్యం కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌లో కనుగొనబడుతుంది, (కీర్త. 17:8; సామె. 7:2; మరియు ఇతర లేఖనాలు) కాని అది హెబ్రీ వాక్యం కాదు, ఎందుకంటే దాని అక్షరార్థమైన తర్జుమా ‘[ఒకని] కనుపాప’ అనే అర్థాన్నిస్తుంది.”—ది వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ న్యూయార్క్‌,చే 1988లో ప్రచురింపబడిన ఇన్‌సైట్‌ ఆన్‌ ది స్క్రిప్చర్స్‌, సంపుటి 1, పుటలు 131-2.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి