క్రీస్తు ద్వారా ఏకత నిశ్చయము
ఎఫెసీయుల నుండి ఉన్నతాంశములు
సా.శ. 52., తొలిభాగమందు అపొస్తలుడైన పౌలు ఎఫెసులో ప్రకటించెను. ఆసియా మైనరునందలి ధనవంతమైన ఈ వ్యాపార పట్టణము అబద్ధమతమునకుకూడ కేంద్రమైయున్నది. అయితే పౌలు సా.శ. 52/53 శీతకాలమందు తిరిగివచ్చిన తరువాత అక్కడ క్రైస్తవత్వము వర్ధిల్లెను. ఆయన ఒక పాఠశాల హాలులో ప్రతిదినము ప్రసంగములిచ్చుచు అక్కడ గడిపిన మూడు సంవత్సరములు ఇంటింటికి సాక్ష్యమిచ్చుచుండెను.—అపొస్తలుల కార్యములు 19:8-10; 20:20, 21, 31.
సా.శ. 60-61లో రోములో ఖైదిగా ఉన్నప్పుడు పౌలు ఎఫెసు క్రైస్తవులకు పత్రికను వ్రాసెను. యేసుక్రీస్తుతో మరియు క్రీస్తుద్వారా ఏకముచేయబడుట ఆయన పత్రికయొక్క ముఖ్యాంశము. వాస్తవమునకు, ‘క్రీస్తుతో ఏకముచేయబడుట’ (ఐక్యము) అనునది పౌలు వ్రాసిన ఏ ఇతర పత్రికకన్న ఎక్కువసార్లు అనగా 13సార్లు దీనిలో ప్రస్తావించబడినది. ఎఫెసీయులవలెనె దుర్నీతిని మరియు దుష్టసంబంధమైన ఆత్మీయశక్తులను ఎదిరించుచు క్రీస్తు పాత్రను గురించి తెలిపిన పౌలు మాటలనుండి మనమును ప్రయోజనము పొందగలము.
ఏకమగుట దేవుని సంకల్పము
పౌలు మొదట క్రీస్తుద్వారా దేవుడు ఎట్లు ఏకముచేయునో వివరించెను. (ఎఫెసీయులు 1:1-23) ఒక “యేర్పాటునుబట్టి” (పరిపాలనా పద్ధతిద్వారా) సమస్తమును అనగా పరలోకములో ఉన్నవాటినేగాని భూమిమీద ఉన్నవాటినేగాని సమకూర్చవలెనని యెహోవా సంకల్పించెను. క్రీస్తుద్వారా పరలోక జీవితమునకు ఎన్నుకొనబడినవారిని, భూమిమీద జీవించువారిని దేవుడు తనతో ఏకముచేసికొనును. ఈనాడు దేవుడు అభిషక్తులను, మరియు “గొప్పసమూహమును” ఐక్యముచేసెను. ‘భూమిమీద ఉన్నవాటిని సమకూర్చుట’ సమాధులలో ఉన్నవారు యేసు శబ్దమువిని బయటకు వచ్చువరకు కొనసాగును. (ప్రకటన 7:9; యోహాను 5:28, 29) దేవుని ఏర్పాటును ఎఫెసీయులు గుణగ్రహించాలని పౌలు ప్రార్థించినట్లే మనమును ఇందుకు కృతజ్ఞులమైయుండవలెను.
తరువాత ఒకప్పుడు పాపమందు మృతిచెందియున్న అన్యులైన క్రైస్తవులవైపు అవధానము మరల్చబడినది. (2:1–3:21) క్రీస్తుద్వారా ధర్మశాస్త్రము కొట్టివేయబడి యూదులు మరియు అన్యులు ఏకముచేయబడి ఆత్మచేతనింపబడుటకు దేవాలయముగా తయారైరి. పౌలు గృహనిర్వాహకత్వము అన్యులు ఎవరిద్వారా తాము దేవుని నిర్భయముగా సమీపించగలరో ఆ క్రీస్తునందు ఏకమగుటయను పరిశుద్ధమర్మమును బయలుపరచుటయైయుండెను. విశ్వాసము మరియు ప్రేమయందు వారిని యెహోవా స్థిరులనుగా చేయుటకు ఎఫెసీయుల కొరకు పౌలు మరల ప్రార్థించెను.
ఏకతను కలుగజేయు విషయములు
ఐక్యపరచు విషయములను దేవుడనుగ్రహించియున్నాడని పౌలు చూపించెను. (4:1-16) వీటిలో ఒకే ఆత్మీయశరీరము అనగా సంఘమున్నది. ఈ శరీరము క్రీస్తు శిరసత్వము క్రింద ఐక్యతయందు పనిచేయును. విశ్వాసమందు అందరు ఏకత్వముపొందుటకు మనుష్యులలో ఈవులను కూడా ఇచ్చెను.
అంతేగాక ఐక్యతను కలిగించు క్రైస్తవలక్షణములను ప్రదర్శించునట్లు యెహోవా సాధ్యపరచును. (4:17–6:9) “నవీనస్వభావమును ధరించుకొనినవారై” దుర్నీతికర భాష మొదలగు భక్తిహీనతను క్రైస్తవులు విసర్జింతురు. సరైన వినయమును చూపుతు, క్రీస్తుకు గౌరవముచూపి జ్ఞానముతో నడచుకొందురు.
అంతేకాక, మన ఐక్యతను చెరపగోరు దుష్ట ఆత్మీయశక్తులను ఎదిరించునట్లు దేవుడు క్రైస్తవులకు తోడ్పడును. (6:10-24) దేవుని నుండి వచ్చు ఆత్మీయ కవచము అట్టి రక్షణను ఇచ్చును. కావున దానిని ఉపయోగిస్తు, మన విజ్ఞాపనలయందు తోటి విశ్వాసులనుకూడా చేర్చుచు, పట్టుదలతో ప్రార్థనచేయుదము.
ఎఫెసీయులకు పౌలు ఎంత మంచి ఉపదేశమునిచ్చెను. దుష్టసంబంధమైన ఆత్మీయశక్తులను ఎదిరిస్తు, దుర్నీతిని విసర్జించుటద్వారా దానిని మనము గైకొందుముగాక. యేసుక్రీస్తుద్వారా మనము అనుభవిస్తున్న ఐక్యతను లోతుగా మెచ్చుకొందుముగాక. (w90 11/15)
[31వ పేజీలోని బాక్సు/చిత్రం]
అగ్నిబాణములు: ఆత్మీయ కవచమునందు, సాతానుయొక్క “అగ్నిబాణములను” నిరపాయమైనవిగా లేక ఆర్పివేయగల “విశ్వాసమను డాలు” ఉన్నది. (ఎఫెసీయులు 6:16) రోమీయుల వలన ఉపయోగించబడు కొన్నిబాణములు లోపలరంధ్రముగల వెదురువై, వాటిచివర్లందు ఇనుపమొనలతో మంటలురేపు గంధకమును కలిగియుండును. అగ్ని ఆరిపోకుండునట్లు ఒకవిధంగా వదులుగావుండు విల్లుతో వాటిని ప్రయోగింతురు. వాటిని నీళ్లతో తడుపుట మంటలు ఎక్కువగుటకే కారణమగును. అయితే పెద్దడాలులు సైనికులను అట్టి బాణములనుండి కాపాడును. అలాగే యెహోవాయందలి విశ్వాసము తనసేవకులకు “దుష్టుని అగ్నిబాణములను చల్లార్చుటకు” సహాయముచేయును. అవును, దుష్టుని ముట్టడులు, తప్పిదమును చేయుటకు పురికొల్పు శోధనలు, వస్తుసంబంధమైన వ్యామోహముతో కూడిన జీవితము, భయము, సందేహమునకు లోనగుట మొదలగువాటిని ఎదిరించుటకు విశ్వాసము సహాయముచేయును.