కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 12/1 పేజీలు 9-14
  • విడిచిపెట్టకండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విడిచిపెట్టకండి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇతరులు మనల్ని నిరుత్సాహపర్చినప్పుడు
  • మనం తప్పిపోయినప్పుడు
  • మనం తగినంత చేయడంలేదని మనం భావించినప్పుడు
  • మననుండి ఎక్కువగా కోరబడినప్పుడు
  • అంతం ఇంకా రాలేదు గనుక
  • అలసిపోయినవారికి యెహోవా శక్తినిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • భవిష్యత్తు వైపు చూస్తూ ముందుకు సాగండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • నేను క్షమించరాని పాపం చేశానా?
    తేజరిల్లు!—1994
  • అపరాధ భావాలు కలగడం పూర్తిగా తప్పా?
    తేజరిల్లు!—2002
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 12/1 పేజీలు 9-14

విడిచిపెట్టకండి!

“మనము మేలు చేయడాన్ని విడిచిపెట్టకుందాము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము.”—గలతీయులు 6:9, NW.

1, 2. (ఎ) సింహం ఏయే విధాలుగా వేటాడుతుంది? (బి) అపవాది ప్రాముఖ్యంగా ఎవరిని వేటాడాలని ఆసక్తి కలిగివున్నాడు?

సింహం పలువిధాలుగా వేటాడుతుంది. కొన్నిసార్లు అది తన ఆహారం కొరకు నీటి గుంటల వద్ద లేదా బాగా వాడుకలోవున్న కాలిబాటల వెంబడి మాటువేసి వేటాడుతుంది. కాని కొన్నిసార్లు, సింహం “కేవలం పరిస్థితి నుండి ప్రయోజనం పొందుతుంది అంటే ఉదాహరణకు, నిద్రపోతున్న జీబ్రాపిల్ల మీద దాడిచేయడం” అని పోర్‌ట్రెయిట్స్‌ ఇన్‌ ది వైల్డ్‌ అనే పుస్తకం వివరిస్తుంది.

2 మన “విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు” అని అపొస్తలుడైన పేతురు వివరిస్తున్నాడు. (1 పేతురు 5:8) తనకు మిగిలివున్న సమయం కొంచెమేనని ఎరిగి, యెహోవాను సేవించకుండా ఆటంకపర్చడానికి మానవులపై సాతాను అత్యధికమైన ఒత్తిడి తెస్తున్నాడు. అయితే ఈ “గర్జించు సింహము” యెహోవా సేవకులపై దాడిచేయాలని ప్రాముఖ్యంగా ఆసక్తి కలిగివున్నాడు. (ప్రకటన 12:12, 17) అతని వేటాడే పద్ధతులు జంతు రాజ్యంలోని తనవంటి స్థానమందేవున్న సింహం యొక్క వేటాడే పద్ధతులలానే ఉంటాయి. అదెలా?

3, 4. (ఎ) యెహోవా సేవకులను వేటాడడంలో సాతాను ఏ విధానాలను ఉపయోగిస్తాడు? (బి) ఇవి “అపాయకరమైన కాలములు” గనుక, ఏ ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి?

3 కొన్నిసార్లు సాతాను ఇలా మాటు వేయాలని ప్రయత్నిస్తాడు—మనం యెహోవాను సేవించడాన్ని ఆపేలా మన యథార్థతను పాడుచేయడానికి హింసను లేదా వ్యతిరేకతను తీసుకువస్తాడు. (2 తిమోతి 3:12) కాని సింహంలానే, అపవాది కొన్నిసార్లు పరిస్థితి నుండి ప్రయోజనం పొందుతాడు. మనం నిరుత్సాహపడే వరకు లేదా అలిసిపోయే వరకు అతడు ఆగి, ఆ తర్వాత, మనం విడిచిపెట్టేలా చేయడానికి కృంగిపోయిన మన మనఃస్థితి నుండి ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తాడు. మనం సుళువుగా దొరికిపోయే ఎర కాకూడదు!

4 అయినా, మనం మానవ చరిత్రంతటిలోని అత్యంత కష్టతరమైన కాలంలో జీవిస్తున్నాము. ఈ “అపాయకరమైన కాలములలో,” ఒక్కోసారి మనలో అనేకులము నిరుత్సాహపడతాము లేదా కృంగిపోతాము. (2 తిమోతి 3:1) అయితే మనం అపవాదికి సుళువుగా ఎరగా దొరికిపోయేలా అలిసిపోవడాన్ని ఎలా నివారించవచ్చు? అవును, “మనము మేలు చేయడాన్ని విడిచిపెట్టకుందాము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము” అని అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ప్రేరేపిత ఉపదేశాన్ని మనం ఎలా అనుసరించగలము?—గలతీయులు 6:9, NW.

ఇతరులు మనల్ని నిరుత్సాహపర్చినప్పుడు

5. ఏది దావీదు అలసిపోయేలా చేసింది, కాని ఆయన ఏమి చేయలేదు?

5 బైబిలు కాలాల్లో, యెహోవా యొక్క అత్యంత నమ్మకమైన సేవకులు సహితం అలిసిపోయినట్లు భావించి ఉండవచ్చు. కీర్తనల రచయితయైన దావీదు ఇలా వ్రాశాడు: “నేను మూలుగుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవి.” దావీదు ఎందుకలా భావించాడు? “నాకు బాధ కలిగించువారి” వలన అని ఆయన వివరించాడు. ఇతరుల నొప్పించే చర్యలు దావీదుకు ఎంత హృదయవేదనను కలిగించాయంటే ఆయన కన్నీళ్లు ధారాళంగా ప్రవహించాయి. అయినప్పటికీ, తోటి మానవులు తనకు చేసిన దాన్ని బట్టి దావీదు యెహోవా నుండి వైదొలగి పోలేదు.—కీర్తన 6:6-9.

6. (ఎ) మనం ఇతరుల మాటలు లేక చర్యల వల్ల ఎలా ప్రభావితం చేయబడవచ్చు? (బి) కొందరు తాము అపవాదికి సుళువుగా దొరికిపోయేలా ఎలా చేసుకుంటారు?

6 అలాగే, ఇతరుల మాటలు లేక చర్యలు మనకు ఎంతో హృదయవేదనను కలుగజేస్తూ, మనం అలిసిపోయేలా చేస్తాయి. ‘కత్తిపోటువంటి అనాలోచితమైన మాటలు పలుకువారు కలరు’ అని సామెతలు 12:18 చెబుతుంది. అలా అనాలోచితంగా మాట్లాడేది క్రైస్తవ సహోదరుడు లేక సహోదరి అయినప్పుడు, ‘కత్తిపోటు’ మరింత లోతుగా దిగుతుంది. బహుశా కోపాన్ని ఉంచుకోవడం ద్వారా క్షోభపడటం మానవ సహజమైనదే కావచ్చు. మనం నిర్దయగా లేక అన్యాయంగా చూడబడ్డామని మనం భావించేటప్పుడు ప్రాముఖ్యంగా ఇది నిజమైవుంటుంది. బాధపెట్టిన వ్యక్తితో మాట్లాడడం మనకు కష్టం కావచ్చు; మనం ఆమెను లేక అతన్ని కావాలని తప్పించుకోవడానికి కూడా చూస్తాము. కోపంతో అలిసిపోయి, కొందరు విడిచిపెట్టి, క్రైస్తవ కూటాలకు రావడం మానేశారు. దుఃఖకరంగా, తద్వారా సుళువుగా ఎరగా దొరికిపోవడానికి అవకాశం కలిగేలా వారు “అపవాదికి చోటి”స్తారు.—ఎఫెసీయులు 4:27.

7. (ఎ) ఇతరులు మనల్ని నిరుత్సాహపర్చినా లేక బాధపెట్టినా సాతాను చేతుల్లోకి వెళ్లడాన్ని మనం ఎలా నివారించవచ్చు? (బి) మనం కోపాన్ని ఎందుకు విడిచిపెట్టాలి?

7 ఇతరులు మనల్ని నిరుత్సాహపర్చినప్పుడు లేక గాయపర్చినప్పుడు సాతాను పథకాలు సాగకుండా మనమెలా నివారించవచ్చు? మనం కోపాన్ని ఉంచుకోకుండా ఉండడానికి ప్రయత్నించాలి. బదులుగా, వీలైనంత త్వరగా సమాధానపడడానికి లేదా విషయాలను చక్కబరుచుకోవడానికి చొరవ తీసుకోండి. (ఎఫెసీయులు 4:26) కొలొస్సయులు 3:13 మనల్నిలా కోరుతుంది: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల . . . ఒకని నొకడు క్షమించుడి.” తప్పుచేసిన వ్యక్తి తన తప్పును అంగీకరించి, నిజంగా క్షమాపణ కోరినప్పుడు, క్షమించడం ప్రాముఖ్యంగా తగినది. (కీర్తన 32:3-5 మరియు సామెతలు 28:13 పోల్చండి.) అయితే, క్షమించడమంటే ఇతరులు చేసిన తప్పులను చూసిచూడనట్లు విడిచిపెట్టడం లేక తగ్గించడం కాదని మనం మనస్సులో ఉంచుకోవడం మనకు సహాయకరంగా ఉంటుంది. క్షమించడంలో కోపాన్ని విడిచిపెట్టడం చేరివుంది. కోపమన్నది మోయడానికి చాలా భారమైన బరువు. అది మనకు సంతోషం లేకుండా చేస్తూ, మన తలంపులను హరించివేయగలదు. అది మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపగలదు. బదులుగా, తగినచోట క్షమించడం మన స్వంత ప్రయోజనానికే దోహదపడుతుంది. ఇతరులు మనల్ని అన్నదాన్నిబట్టి లేదా మన ఎడల చేసినదాన్నిబట్టి, దావీదు వలె మనం ఎన్నడూ విడిచిపెట్టకుండా, యెహోవా నుండి దూరమైపోకుండా ఉందాము!

మనం తప్పిపోయినప్పుడు

8. (ఎ) ప్రాముఖ్యంగా కొందరు కొన్నిసార్లు ఎందుకు అపరాధ భావం కలిగివుంటారు? (బి) మనల్ని మనం విడిచిపెట్టుకునేంతగా అపరాధ భావం మనల్ని ఆక్రమించడానికి అనుమతించడంలో ఏ ప్రమాదం ఉంది?

8 “అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము,” అని యాకోబు 3:2 చెబుతుంది. మనమలా చేసినప్పుడు మనం అపరాధ భావం కలిగివుండడం కేవలం సహజం. (కీర్తన 38:3-8) ప్రాముఖ్యంగా మనం ఏదైనా శారీరకమైన బలహీనతతో పోరాడుతూ, అప్పుడప్పుడూ విఫలమౌతుంటే అపరాధ భావాలు బలంగా ఉంటాయి.a అలాంటి పోరాటాన్ని ఎదుర్కొన్న ఒక క్రైస్తవురాలు ఇలా వివరిస్తుంది: “నేను క్షమించరాని పాపం చేశానో లేదో తెలియక, నేను జీవితం కొనసాగించాలని కోరుకోలేదు. బహుశా నాకు ఇక ఏ నిరీక్షణా ఉండక పోవచ్చు గనుక నేను యెహోవా సేవలో ప్రయాసపడకూడదన్నట్లు భావించాను.” మనల్ని మనం విడిచిపెట్టుకునేంతగా అపరాధ భావం మనల్ని ఆక్రమిస్తే, మనం అపవాదికి అవకాశం ఇస్తాము—అతడు వెంటనే దాని నుండి ప్రయోజనం పొందుతాడు! (2 కొరింథీయులు 2:5-7, 11) అపరాధాన్ని గూర్చి మరింత సమతుల్యమైన భావం కలిగివుండడం అవసరం కావచ్చు.

9. దేవుని కనికరమందు మనకు విశ్వాసం ఎందుకుండాలి?

9 మనం పాపం చేసినప్పుడు కొంతమేరకు అపరాధభావం కలిగివుండడం తగినదే. అయితే, కొన్నిసార్లు అపరాధ భావాలు బలంగా ఉంటాయి ఎందుకంటే ఒక క్రైస్తవుడు తాను ఎన్నడూ దేవుని దయపొందడానికి అర్హున్ని కాలేనని భావించవచ్చు. అయితే బైబిలు ప్రేమపూర్వకంగా మనకిలా హామీ ఇస్తుంది: “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.” (1 యోహాను 1:9) దేవుడు మన విషయంలో అలా చేయకుండా ఉంటాడని నమ్మడానికి ఏదైనా గట్టి కారణం ఉందా? తన వాక్యంలో, తాను “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” వాడనైయున్నానని యెహోవా చెబుతున్నాడని గుర్తుంచుకోండి. (కీర్తన 86:5; 130:3, 4) ఆయన అబద్ధమాడడు గనుక, మనం పశ్చాత్తాప హృదయంతో ఆయనను సమీపిస్తే, తన వాక్యం వాగ్దానం చేస్తున్నట్లు ఆయన చేస్తాడు.—తీతు 1:2.

10. శరీర సంబంధమైన ఒక బలహీనతతో పోరాడడం గురించి గతంలో కావలికోట హృదయాన్ని ఉత్తేజపర్చే ఏ హామీని ప్రచురించింది?

10 మీరు ఏదైనా బలహీనతతో పోరాడుతూ, విఫలమౌతుంటే మీరేమి చేయాలి? విడిచిపెట్టకండి! ఒకసారి విఫలమవ్వడం మీరు ఇంత వరకు సాధించిన అభివృద్ధిని కొట్టివేయనవసరం లేదు. ఈ పత్రిక యొక్క ఫిబ్రవరి 15, 1954 సంచిక హృదయాన్ని ఉత్తేజపర్చే ఈ అభయాన్నిస్తుంది: “మనం గుర్తించిన దానికంటే లోతుగా మన పాత జీవన విధానంలో పాతుకుపోయిన ఏదైనా చెడు అలవాటును మానుకోవడంలో మనం పడిపోతూ అనేకసార్లు విఫలమౌతున్నామని మనం కనుగొన [వచ్చు]. . . . విచారించకండి. క్షమించరాని పాపం చేశాననే ముగింపుకు రాకండి. మీరు సరిగ్గా అలా తలంచాలన్నదే సాతాను కోరిక. మిమ్మల్ని బట్టి మీరు బాధపడుతూ, కలత చెందుతూ ఉన్నారన్న వాస్తవమే మీరు ఎంతో దూరం వెళ్లలేదనడానికి రుజువు. ఆయన క్షమాపణను శుభ్రం చేయడాన్ని మరియు సహాయాన్ని కోరుతూ దీనంగా, హృదయపూర్వకంగా దేవుని వైపు తిరగడానికి ఎన్నడూ విసుగు చెందకండి. ఒకే బలహీనత గురించి ఎంత తరచుగా అయినప్పటికీ, కష్టంలో ఉన్నప్పుడు బిడ్డ తన తండ్రి దగ్గరికి వెళ్లినట్లు ఆయన దగ్గరికి వెళ్లండి, తన కృపాబాహుళ్యమును బట్టి యెహోవా మీకు దయాపూర్వకంగా సహాయాన్నిస్తాడు, మీరు యథార్థంగా ఉంటే, మీకు శుభ్రమైన మనస్సాక్షి యొక్క గుర్తింపును ఇస్తాడు.”

మనం తగినంత చేయడంలేదని మనం భావించినప్పుడు

11. (ఎ) రాజ్య ప్రకటనపనిలో భాగం వహించడం గురించి మనం ఎలా భావించాలి? (బి) పరిచర్యలో భాగం వహించడం గురించి ఎటువంటి భావాలతో కొంతమంది క్రైస్తవులు పోరాడుతారు?

11 రాజ్య ప్రకటన పని ఒక క్రైస్తవుని జీవితంలో ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహిస్తుంది, దానిలో భాగం వహించడం ఆనందాన్నిస్తుంది. (కీర్తన 40:8) అయితే, కొంతమంది క్రైస్తవులు పరిచర్యలో ఎక్కువగా భాగం వహించలేకపోతున్నామని ఎంతో అపరాధభావం కలిగివుంటారు. అలాంటి అపరాధభావం మన ఆనందాన్ని కూడా హరించివేసి, మనం ఎన్నడూ తగినంత చేయడం లేదని యెహోవా అనుకుంటాడని ఊహిస్తూ, విడిచిపెట్టేలా చేస్తుంది. కొందరు పోరాడే భావాలను పరిశీలించండి.

తన భర్తతో కలిసి ముగ్గురు పిల్లలను పెంచుతున్న ఒక క్రైస్తవ సహోదరి ఇలా వ్రాసింది: “పేదరికం సమయాన్ని ఎంతగా తీసేసుకునేదై ఉందో మీకు తెలుసా? వీలైన చోటల్లా నేను దాన్ని పొదుపు చెయ్యాలి. అంటే సెకండ్‌హాండ్‌ వస్తువులు అమ్మే దుకాణాల కొరకు, తక్కువ ధరకు వస్తువులు అమ్మే దుకాణాల కొరకు వెదకడానికి లేదా చివరికి బట్టలు కుట్టడానికి సమయం తీసుకోవడం. నేను ప్రతి వారం ఒకటి లేక రెండు గంటలు [తగ్గింపు ధరకు ఆహారం] కూపన్లను కత్తిరించి, ఫైల్‌ చేసి, వాటిని అమ్మే పనిచేస్తూ గడుపుతాను. కొన్నిసార్లు ఈ పనులు చేసేటప్పుడు ఆ సమయాన్ని ప్రాంతీయ సేవలో గడిపి ఉండేదాన్ని కదా అని ఆలోచిస్తే, నాకు ఎంతో అపరాధభావం కలుగుతుంది.”

నలుగురు పిల్లలు, అవిశ్వాసియైన భర్తగల ఒక సహోదరి, “నేను యెహోవాను తగినంతగా ప్రేమించడం లేదేమో అనుకునేదాన్నని” వివరిస్తుంది. “కాబట్టి యెహోవాను సేవించడానికి నేను పోరాడేదాన్ని. నేను నిజంగా తీవ్రంగా ప్రయత్నించాను, కాని అది సరిపోతుందని నేను ఎన్నడూ భావించలేదు. చూడండి, నాకు స్వాభిమాన భావనే లేదు, కాబట్టి యెహోవాకు నేను చేస్తున్న సేవను ఆయన ఎలా అంగీకరిస్తాడో నేను ఊహించలేకపోయేదాన్ని.”

పూర్తికాల సేవను విడిచిపెట్టవలసి వచ్చిన ఒక క్రైస్తవురాలు ఇలా చెప్పింది: “యెహోవాను పూర్తి కాలం సేవిస్తాననే నా ఒప్పందానికి కట్టుబడి ఉండడంలో నేను విఫలమౌతున్నానన్న తలంపును నేను సహించలేకపోయాను. నేను ఎంత నిరుత్సాహపడ్డానో మీరు ఊహించలేరు! అది గుర్తు తెచ్చుకొని నేను ఇప్పుడు ఏడుస్తాను.”

12. పరిచర్యలో తాము ఎక్కువ చేయలేకపోతున్న దాన్ని బట్టి కొందరు క్రైస్తవులు ఎందుకు అపరాధ భాగం కలిగివుంటారు?

12 వీలైనంత సంపూర్ణంగా యెహోవాను సేవించాలని కోరుకోవడం కేవలం సహజం. (కీర్తన 86:12) అయితే ఎక్కువ చేయలేకపోతున్నామని కొందరు ఎందుకు ఎంతో అపరాధభావం కలిగివుంటారు? బహుశా జీవితంలోని చేదు అనుభవాల వల్ల కొందరికి అది, తాను పనికిరాననే సాధారణ భావానికి సంబంధించినట్లుగా అనిపిస్తుంది. మరితర సందర్భాల్లో, యెహోవా మననుండి కోరేదాన్ని గూర్చిన అవాస్తవమైన దృక్పథం మూలంగా అనౌచితమైన అపరాధభావం కలుగవచ్చు. “నేను అలసిపోయే వరకు పనిచేయనిదే నేను తగినంత చేసినట్లు ఉండదన్నట్లు నేను భావించానని” ఒక క్రైస్తవురాలు అంగీకరించింది. ఫలితంగా, ఆమె తనకు అత్యంత ఉన్నతమైన ప్రమాణాలను ఏర్పరచుకుంది—వాటిని చేరుకోలేకపోయినప్పుడు ఆమె మరింత అపరాధిలా భావించేది.

13. యెహోవా మన నుండి ఏమి అపేక్షిస్తున్నాడు?

13 యెహోవా మన నుండి ఏమి అపేక్షిస్తున్నాడు? టూకీగా చెప్పాలంటే, మన పరిస్థితులు అనుమతించినంత చేస్తూ, ఆయనను పూర్ణ ప్రాణముతో సేవించాలని యెహోవా ఎదురు చూస్తాడు. (కొలొస్సయులు 3:23) అయితే, మనం చేయాలి అని ఇష్టపడేదానికి మనం నిజంగా చేయ గలిగే దానికి మధ్య చాలా తేడా ఉండవచ్చు. మనం వయస్సు, ఆరోగ్యం, శారీరక బలం, లేక కుటుంబ బాధ్యతలు వంటి విషయాల వల్ల పరిమితం చేయబడవచ్చు. అయినప్పటికీ, మనం చేయగలిగినదంతా చేసినప్పుడు, మనం యెహోవాకు చేసే సేవ పూర్ణప్రాణముతో చేసినదని నిశ్చయత కలిగివుండవచ్చు, అంటే పూర్తికాల సేవలో ఉండడానికి తన ఆరోగ్యం మరియు పరిస్థితులు అనుమతించిన ఏ వ్యక్తి సేవకంటే కూడా ఎక్కువ లేదా తక్కువ పూర్ణప్రాణముతో చేసినట్లు కాదు.—మత్తయి 13:18-23.

14. మీ నుండి మీరు వాస్తవంగా ఏమి అపేక్షించగలరనేదాన్ని నిర్ణయించుకోవడంలో సహాయం అవసరమైతే మీరేమి చేయవచ్చు?

14 అయితే, మీ నుండి మీరు వాస్తవంగా ఏమి అపేక్షించవచ్చో మీరెలా నిశ్చయించుకోగలరు? మీరు విషయాన్ని ఒక నమ్మదగిన, పరిపక్వత చెందిన క్రైస్తవ స్నేహితునితో, బహుశా మీ సామర్థ్యాలను పరిమితులను మరియు మీ కుటుంబ బాధ్యతలను ఎరిగిన ఒక పెద్దతో లేదా అనుభవం గల ఒక సహోదరితో మాట్లాడాలని అనుకోవచ్చు. (సామెతలు 15:22) దేవుని దృష్టిలో, వ్యక్తిగా మీ విలువ మీరు ప్రాంతీయ సేవలో ఎంత చేస్తారు అనే దాన్ని బట్టి కొలవబడదని గుర్తుంచుకోండి. యెహోవా సేవకులు అందరూ ఆయనకు అమూల్యమైన వారే. (హగ్గయి 2:7; మలాకీ 3:16, 17) మీరు ప్రకటనాపనిలో చేసేది ఇతరులు చేసేదానికంటే ఎక్కువైనా తక్కువైనా గాని, అది మీరు చేయగలిగే దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నంత వరకూ యెహోవా ఇష్టపడతాడు, మీరు అపరాధ భావం కలిగివుండవలసిన అవసరం లేదు.—గలతీయులు 6:4.

మననుండి ఎక్కువగా కోరబడినప్పుడు

15. సంఘ పెద్దల నుండి ఏయే విధాలుగా ఎక్కువ కోరబడుతుంది?

15 “ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు” అని యేసు చెప్పాడు. (లూకా 12:48) కచ్చితంగా, సంఘ పెద్దలుగా సేవచేస్తున్న వారి నుండి ‘ఎక్కువగా కోరబడుతుంది.’ పౌలు వలె వారు సంఘం కొరకు తమను తాము వ్యయపర్చుకుంటారు. (2 కొరింథీయులు 12:15) వారు ప్రసంగాలకు సిద్ధపడాలి, కాపరి సందర్శనాలు చేయాలి, న్యాయవిచారణలు జరపాలి—తమ స్వంత కుటుంబాలను నిర్లక్ష్యం చేయకుండానే ఇవన్నీ చేయాలి. (1 తిమోతి 3:4, 5) కొంతమంది పెద్దలు రాజ్య మందిరాలను నిర్మించడంలో, ఆసుపత్రి అనుసంధాన కమిటీలకు సేవచేయడంలో, సమావేశాల్లో స్వచ్ఛంద సేవచేయడంలో పనితొందర కలిగివుంటారు. కష్టపడి పనిచేసే ఈ సమర్పిత పురుషులు అలాంటి బాధ్యతల బరువు క్రింద అలిసిపోవడాన్ని ఎలా నివారించవచ్చు?

16. (ఎ) ఇత్రో మోషేకు ఏ ఆచరణయోగ్యమైన పరిష్కారాన్ని ప్రతిపాదించాడు? (బి) తగిన బాధ్యతలను ఇతరులతో పంచుకొనేందుకు ఒక పెద్దకు ఏ లక్షణం సహాయం చేస్తుంది?

16 వినయము గలవాడు, దీనుడు అయిన మోషే ఇతరుల సమస్యల గురించి శ్రద్ధ తీసుకోవడంలో అలసిపోయినప్పుడు, ఆయన మామ అయిన ఇత్రో ఒక ఆచరణ యోగ్యమైన పరిష్కారాన్ని అంటే అర్హతగల ఇతర పురుషులతో కొంత బాధ్యతను పంచుకొనే విషయాన్ని ప్రతిపాదించాడు. (నిర్గమకాండము 18:17-26; సంఖ్యాకాండము 12:3) సామెతలు 11:2 ఇలా చెబుతుంది, “వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.” వినయము కలిగివుండడమంటే మీ పరిధులను గుర్తించి, అంగీకరించడమని భావం. వినయం గల వ్యక్తి ఇతరులకు బాధ్యత అప్పగించడానికి వెనుకాడడు, లేదా తగిన బాధ్యతలను అర్హతగల ఇతర పురుషులతో పంచుకోవడం ద్వారా తాను అధికారాన్ని కోల్పోతానేమోనని భయపడడు.b (సంఖ్యాకాండము 11:16, 17, 26-29) బదులుగా, వాళ్లు అభివృద్ధి సాధించడానికి వారికి సహాయం చేసేందుకు ఆసక్తి కలిగివుంటాడు.—1 తిమోతి 4:15.

17. (ఎ) సంఘ సభ్యులు పెద్దల భారాన్ని ఎలా తగ్గించవచ్చు? (బి) పెద్దల భార్యలు ఏ త్యాగాలు చేస్తారు, వీటిని మనం తక్కువగా చూడడం లేదని మనం వారికెలా చూపించవచ్చు?

17 పెద్దల భారాన్ని తగ్గించడానికి సంఘ సభ్యులు ఎంతో చేయవచ్చు. పెద్దలు తమ స్వంత కుటుంబాల ఎడల శ్రద్ధ తీసుకోవలసి ఉందని ఇతరులు అర్థం చేసుకొని, పెద్దల సమయాన్ని, శ్రద్ధను నిర్హేతుకంగా కోరరు. అంతేగాక, పెద్దల భార్యలు నిస్వార్థంగా చేసే ఇష్టపూర్వకమైన త్యాగాలు అంటే తమ భర్తల సమయాన్ని సంఘంతో పంచుకోవడం వంటివాటి ఎడల వారు మెప్పుదల లేకుండా ఉండరు. తన భర్త పెద్దగా పనిచేస్తున్న, ముగ్గురు పిల్లలుగల తల్లి ఇలా వివరించింది: “నా భర్త పెద్దగా సేవచేయగలిగేలా ఇంట్లోని పనుల్లో నేను ఇష్టపూర్వకంగా మోసే అదనపు భారం గురించి నేను ఎన్నడూ ఫిర్యాదు చేయను. ఆయన సేవచేయడం మూలంగా యెహోవా ఆశీర్వాదం మా కుటుంబంపై మెండుగా ఉందని నాకు తెలుసు, ఆయన వెచ్చిస్తున్న దాని గురించి నేను సణగను. అయితే వాస్తవంగా, నా భర్త పనితొందర కలిగివున్నాడు కాబట్టి, మరోలా అయితే నేను చేసేదానికన్నా కొంత ఎక్కువగా నేను పెరట్లో పని చేయవలసి వస్తుందంతే, పిల్లలను మరి కొంత ఎక్కువగా క్రమశిక్షణలో పెట్టవలసి వస్తుంది.” దుఃఖకరంగా, ఆమె మోస్తున్న అదనపు భారాన్నిబట్టి ఆమెను మెచ్చుకొనే బదులు కొందరు, “మీరు పయినీరింగ్‌ ఎందుకు చేయడం లేదు?” అనేలాంటి మూర్ఖమైన వ్యాఖ్యానాలు చేయడాన్ని ఈ సహోదరి విన్నది. (సామెతలు 12:18) ఇతరులు చేయలేకపోతున్న దాన్ని బట్టి వారిని విమర్శించే బదులు వారు చేస్తున్న దాన్ని బట్టి వారిని మెచ్చుకోవడం ఎంతో శ్రేష్ఠం!—సామెతలు 16:24; 25:11.

అంతం ఇంకా రాలేదు గనుక

18, 19. (ఎ) నిత్యజీవం కొరకైన పందెంలో పరుగెత్తడాన్ని ఆపడానికి ఇది ఎందుకు సమయం కాదు? (బి) యెరూషలేములోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఏ సమయోచితమైన ఉపదేశాన్ని ఇచ్చాడు?

18 తాను ఒక పెద్ద పరుగు పందెం ముగింపులో ఉన్నానని పరుగెత్తేవానికి తెలిసినప్పుడు, అతడు విడిచిపెట్టడు. అతని శరీరం అలిసిపోయి, విపరీతంగా వేడెక్కిపోయి, నిర్జలీకరించిపోయి తన సహనం యొక్క చరమ స్థితికి చేరివుండవచ్చు, కాని ముగింపుకు అంత దగ్గరగా వచ్చాక పరుగెత్తడాన్ని ఆపేందుకు అది సమయం కాదు. అలాగే, క్రైస్తవులుగా మనం జీవపు బహుమానం కొరకు పరుగుపందెంలో ఉన్నాము, మనం ముగింపుకు అతి సమీపంలో ఉన్నాము. ఇప్పుడు మనం పరుగెత్తడాన్ని ఆపడానికి సమయం కాదు!—1 కొరింథీయులు 9:24 పోల్చండి; ఫిలిప్పీయులు 2:16; 3:13, 14.

19 మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. దాదాపు సా.శ. 61 ఆ కాలంలో అపొస్తలుడైన పౌలు యెరూషలేములోని క్రైస్తవులకు వ్రాశాడు. సమయం గతించిపోతుంది—దుష్ట “తరం” అబద్ధమత యూదా విధానం “గతించి” పోనైవుంది. ప్రాముఖ్యంగా యెరూషలేములోని క్రైస్తవులు జాగ్రత్తగా, నమ్మకంగా ఉండవలసిన అవసరం ఉంది; నగరాన్ని సైన్యం చుట్టుముట్టడం చూసినప్పుడు వారు నగరంలో నుండి పారిపోవలసిన అవసరం ఉండింది. (లూకా 21:20-24, 32) అప్పుడు పౌలు ఇచ్చిన ప్రేరేపిత ఉపదేశం సమయానుకూలమైనది: ‘మీరు అలసటపడకండి, మీ ప్రాణములు విసుకనీయకండి.’ (హెబ్రీయులు 12:3) అపొస్తలుడైన పౌలు ఇక్కడ రెండు స్పష్టమైన క్రియాపదాలను ఉపయోగించాడు. ఆ గ్రీకు పదాలు ఏమిటంటే: ‘అలసట పడుట’ (కాʹమ్‌నో) మరియు ‘విసుగుచెందుట’ (ఎ·క్ల్యో·మాయ్‌) ఒక బైబిలు విద్వాంసుడు చెప్పినదాని ప్రకారం, ఈ పదాలు “ముగింపు రేఖను దాటిన తర్వాత విశ్రమించి, స్పృహ తప్పిపోయే పరుగెత్తేవాళ్ల గురించి చెప్పేటప్పుడు అరిస్టోటిల్‌ ఉపయోగించినవి. [పౌలు వ్రాసిన పత్రికను చదివే] పాఠకులు ఇంకా పరుగుపందెంలోనే ఉన్నారు. వాళ్లు సమయానికి ముందే విడిచిపెట్టకూడదు. వాళ్లు తాము అలసిపోయి స్పృహ తప్పి, అపస్మారక స్థితిలోకి వెళ్లడానికి అనుమతించకూడదు. కష్టాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, సహనం కలిగివుండవలసిన అవసరత మళ్లీ తెలియజేయబడింది.”

20. పౌలు ఇచ్చిన ఉపదేశం నేడు మనకు ఎందుకు సమయోచితమైనది?

20 పౌలు ఇచ్చిన ఉపదేశం నేడు మనకు ఎంత సమయోచితమైనది! పెరుగుతున్న ఒత్తిళ్ల దృష్ట్యా, తన కాళ్లు పట్టు తప్పబోతున్న పరుగెత్తేవానిలా మనం అలసిపోయినట్లు భావించే సమయాలు ఉండవచ్చు. కాని ముగింపు రేఖకు ఇంత సమీపంలో ఉన్నందున, మనం విడిచిపెట్టకూడదు! (2 దినవృత్తాంతములు 29:11) “గర్జించు సింహం” అయిన మన శత్రువు, మనం చేయాలని కోరుకునేది సరిగ్గా అదే. కృతజ్ఞతాపూర్వకంగా, యెహోవా “సొమ్మసిల్లినవారికి బలమి”చ్చే ఏర్పాట్లు చేశాడు. (యెషయా 40:29) ఆ ఏర్పాట్లేమిటి, వాటి నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు అనేవి తరువాతి శీర్షికలో చర్చించబడతాయి.

[అధస్సూచీలు]

a ఉదాహరణకు, కొందరు ఆగ్రహంలాంటి లోతుగా పాతుకుపోయిన వ్యక్తిత్వ లోపాన్ని అదుపు చేసుకోవడానికి లేక హస్తప్రయోగం వంటి సమస్యను అధిగమించడానికి పోరాడుతుండవచ్చు.—తేజరిల్లు! (ఆంగ్లం) మే 22, 1988, 19-21 పేజీలు; మరియు నవంబరు 8, 1981, 16-20 పేజీలు; వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ వారు ప్రచురించిన యౌవనస్థులు అడిగే ప్రశ్నలు—ఆచరణయోగ్యమైన సమాధానాలు (ఆంగ్లం), 198-211 పేజీలు చూడండి.

b కావలికోట యొక్క జనవరి 15, 1993 సంచిక నందలి 20-3 పేజీల్లో గల “పెద్దలారా—పని అప్పగించండి!” అనే శీర్షికను చూడండి.

మీ సమాధానం ఏమిటి?

◻ ఇతరులు మనల్ని నిరుత్సాహపర్చినప్పుడు లేక బాధపెట్టినప్పుడు మనం విడిచిపెట్టడాన్ని ఎలా నివారించవచ్చు?

◻ అపరాధ భావాన్ని గూర్చిన ఏ సమతుల్యమైన దృష్టి మనం విడిచిపెట్టకుండా ఉండేలా చేస్తుంది?

◻ యెహోవా మన నుండి ఏమి అపేక్షిస్తున్నాడు?

◻ అలసిపోకుండా ఉండడానికి వినయం సంఘ పెద్దలకు ఎలా సహాయం చేస్తుంది?

◻ హెబ్రీయులు 12:3 నందలి పౌలు ఉపదేశం నేడు మనకు ఎందుకు సమయోచితమైనది?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి