ప్రాంతములో మన రాజ్య పరిచర్యను నెరవేర్చుట
1 యెహోవాయెడల, పొరుగువారియెడలగల ప్రేమ మనలను రాజ్యసువార్తను ప్రకటించునట్లు పురికొల్పును. సత్యమును నైపుణ్యముతో చేపట్టుటవలన, “విపత్కరములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును” మనము పడద్రోయగలము. (2 కొరిం. 10:5) ఈ విషయములో మనకు సహాయపడునట్లు వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ ఏర్పాటు చేయబడినది.
2 ప్రాంతములో మన ప్రచారపనికి సంబంధించిన ముఖ్య శీర్షిక “ఫేల్డ్ మినిస్ట్రీ,” మన వ్యక్తిగత దృక్పథము, పరిచయములు, ఆటంకములను ఎదుర్కొనుట, ఒక్కొక్క సాహిత్యము కొరకు అందింపు, పునర్దర్శనములు, మరియు బైబిలు పఠనములవంటి ప్రతివిషయము అచ్చట చర్చించబడెను. ఒక అంశాన్ని రెండు మంచి అనుభవములతో వివరించుటకు మీరు ఇష్టపడుచున్నారా? మీకు కావలసిన సమాచారమును మధ్యగావున్న శీర్షికనామమైన “ఎక్స్పీరియన్సెస్” అనుదాని క్రింద కనుగొనగలరు.
3 పరస్పరముగా విభేదముగానున్నట్లు కన్పించు కొన్ని లేఖనములను బహుశ పేర్కొని, బైబిలు పరస్పర విరుద్ధతను కలిగియున్నదని ఎవరైనా మిమ్మును ఆక్షేపించారా? “బైబిల్ ఆథంటెసిటి” అను దాని క్రింద ఉపశీర్షికలైన “కాంట్రడిక్షన్స్” మరియు “హార్మొని” అనునవి ఈ ఆక్షేపణనుగూర్చిన సామాన్య చర్చకు సంబంధిత సూచనలిచ్చును. పరస్పరభేదము కలిగియున్నట్లుగా కన్పించు లేఖనముల విస్తృత పట్టిక, వాటిని తేటగా పరిష్కరించు సూచనలను “స్క్రిప్చర్స్ హార్మొనైజ్డ్” అను ఉపశీర్షిక క్రింద కనుగొనగలరు.
4 కొన్ని ప్రాంతములలో, త్రిత్వము, నరకాగ్ని, ఆత్మ అమర్త్యతవంటి క్రీస్తుమత సామ్రాజ్య అబద్ధ సిద్ధాంతాలగు తర్కనలను పడద్రోయవలసియున్నాము. వీటనన్నింటికి ప్రధాన శీర్షికలున్నవి. “ట్రినిటి” మరియు “ఇమ్మొర్టాలిటి ఆఫ్‌ది సోల్” అను వాటి క్రింద “స్క్రిప్చర్స్ మిస్ అప్లయిడ్ టు సపోర్ట్” అను ఉపశీర్షికను మీరు కనుగొందురు. వివిధ లేఖన భాగములకు సంబంధించిన చర్చలకు ఇది మిమ్మును నడిపించును. “స్క్రిప్చర్స్ మిస్ ఇంటర్ప్రెటెడ్” అను ఉపశీర్షికలో “హెల్” అనే శీర్షికక్రింద అటువంటి సమాచారము కనుగొనబడును.
5 ఒక బైబిలు పఠనమును ప్రారంభించుటకు ఎదురు చూచుచున్నావా? లేదా అభివృద్ధి చెందకుండా వున్న పఠనమున్నదా? “బైబిల్ స్టడీస్” అను శీర్షిక క్రింద “స్టార్టింగ్,” “అసిస్టింగ్—,” “టీచింగ్,” అను ఉపశీర్షికలు ప్రతి ఒక్కటి వృద్ధి చెందగల్గు బైబిలు పఠనములను కనుగొని వాటిని చేయదగు సహాయము చేయుటకు తగిన సూచనలున్నవి. ఎప్పుడు ఒక పఠనమును ఆపుచేయుట మంచిదో తెలిసికొను సహాయము నిమిత్తము, “టర్మినేటింగ్ అన్ప్రూట్పుల్” “డిస్కంటిన్యూయింగ్” అను ఉపశీర్షికలను పరిశీలించుము.
6 ప్రాంతీయ సేవలో అదనపు ఆధిక్యతలకు చేరుకొనుగోరుచున్నావా? “పుల్టైమ్ మినిస్ట్రీ,” “ఆగ్జలరీ పయనీర్స్,” “పయనీర్స్,” “మిషనరీస్,” “సర్వింగ్ వేర్ నీడ్ ఈజ్ గ్రేటర్” అను శీర్షికలు అట్టి గమ్యములను ఎలా సాధించవలెనో అను ఆచరణాత్మక విషయాలను మరియు ఇప్పటికే ఆవిధంగా చేసినవారు పొందిన అనుభవాలకు మిమ్మును నడుపును.
7 ప్రాంతములో మన రాజ్య పరిచర్యను నెరవేర్చుట మనకు గొప్ప సంతృప్తినిచ్చును. (యోహా. 4:34) ఈ సంతోషదాయ పనిలో మీరు భాగము వహించుచుండగా వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ మీకు సహాయపడును.