స్వస్థబుద్ధితోను, నీతితోను జీవించుట
1 భక్తిహీనతను బలముగా ప్రేరేపించే లోకములో మనము జీవిస్తున్నాము. ఈ లోక ప్రమాణములు అంతకంతకు క్షీణించుచున్నవి. (2 తిమో. 3:3) క్రైస్తవులుగా మనము సరియైనదాని చేయుటకు తీర్మానించుకొని దానిలోనే ఎందుకు కొనసాగవలెనో అర్థము చేసికొనవలెను. అయితే మనకు ఎటువంటి నడిపింపు మరియు విధానము అందుబాటులో ఉన్నది? మనము ఏ ప్రమాణములను అనుసరించవలెను? 1993 సేవా సంవత్సర ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమముకొరకు “స్వస్థబుద్ధితోను, నీతితోను జీవించుట” అని ఎంపిక చేయబడిన ముఖ్యాంశము ప్రోత్సాహకరమైనది.—తీతు 2:12.
2 ప్రసంగములు, ప్రదర్శనలు, అనుభవముల ద్వారా భక్తిహీనతను ఎదిరిస్తూ, లోకాశలను విసర్జించుటకు మనలను మనము ఎలా బలపరచుకొనగలమో నేర్చుకొందుము. ఈ దుష్ట విధానము మధ్య, స్వస్థబుద్ధితోను, నీతితోను జీవించడము ఎలా సాధ్యమో చూడగలము. మన మనోబుద్ధిని కాపాడుకొనుటకు సహాయపడగల ఏర్పాట్లు సూచించబడును. (1 పేతు. 4:7) తల్లిదండ్రులు, యౌవనులు మధ్యాహ్న కార్యక్రమమందలి ప్రసంగములకు, పరిచయములకు ప్రత్యేకావధానము నివ్వవలెను. దైవజ్ఞానమును, అనుభవమును పొందుటకు, మరియు సంతోషకరమైన దైవపరిపాలనా భవిష్యత్తును ఏర్పాటు చేసికొనుట యొక్క అవసరతను ఇవి నొక్కితెల్పును.
3 భక్తిహీనమైన లోకముతో ఆవరించబడియున్నను, మనము అనుసరించవలసిన శ్రేష్టమైన విధానమును దేవుని వాక్యము మనకు ఉపదేశించు చున్నది. బైబిలు సలహాను గైకొనుటలో గల ప్రయోజనములు “ఆనందములేని లోకము మధ్య మీ ఆశీర్వాదములను కాపాడుకొనుడి” అను ప్రసంగములో ఉన్నతపరచ బడును. మనము హాజరగుటకు సిద్ధపడునప్పుడు, కార్యక్రమముపై జాగ్రత్తగా అవధానమును నిలిపి, సలహాను అన్వయించుట యెహోవాకు మనము చేసే సేవలో ఎంతో సమర్థవంతముగా ఉండుటకు మనకు సహాయపడును.—ఫిలి. 3:15, 16.