ఆసక్తినెట్లు పెంపొందించాలి
1 “పెంపొందించుట” అంటే అభివృద్ధిపరచు లేదా సాగుచేయు అనే అర్థాన్ని మనం నిఘంటువులో నేర్చుకుంటాము. అయితే ఈ మాట శ్రమ, శ్రద్ధ, లేదా పఠనం ద్వారా అభివృద్ధి చేయుట అనే అర్థాన్నికూడ ఇవ్వగలదు. శిష్యులుగా చేయుట మన పరిచర్యయొక్క ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం. (మత్త. 28:19, 20) కాబట్టి, ప్రాంతీయ పరిచర్యలో మనము కనుగొను ఆసక్తిని పెంపొందించుటకు మనం కృషిచేయాల్సిన అవసరం ఉంది.
2 చిత్తశుద్ధిగల వ్యక్తుల ఆత్మీయ అభివృద్ధిని పెంచుటకు సాధారణంగా వారిని పదేపదే సందర్శించాల్సి ఉంటుంది. ఫలవంతమైన పునర్దర్శనాలు ఒక క్రమ బైబిలు పఠనానికి నడిపించాలి.
3 గొప్ప ఆసక్తిచూపిన వారిని మాత్రమే నీవు పునర్దర్శిస్తావా? పునర్దర్శించడానికి నీవు సాహిత్యమే వారికందించియుండ నవసరం లేదు. మొదటి సందర్శనములో సాధారణంగా ఎక్కువ సాహిత్యాల్ని అందించని ఒక పయినీరు స్నేహపూర్వకంగా ఉన్న ప్రతిఒక్కరిని పునర్దర్శిస్తాడు. లేఖనముల మీద ఆధారపడిన ఒక మంచి చర్చ నీవుచేస్తే అది పునర్దర్శనానికి ఒక చక్కని ఆధారాన్నిస్తుంది.
4 పునర్దర్శనాలలో బైబిలు పఠనములు ప్రారంభించుటకు కరపత్రాలను ఉపయోగించండి: వివిధ అంశాలుండే మన కరపత్రాలు మనకాలానికి తగినవై యున్నవి. బైబిలు జ్ఞానాన్ని సంపాదించి, దానిని అన్వయించు అవసరతను అవి నొక్కితెల్పును.
మీరిట్లు చెప్పవచ్చును:
◼ “బైబిలును నమ్మడానికి గల కొన్ని కారణాలను గూర్చి మనం పోయినసారి మాట్లాడాము. ఎలాంటి భవిష్యత్తును గూర్చి బైబిలు మాట్లాడుతుంది?” లైఫ్ ఇన్ ఎ పీస్‌పుల్ న్యూ వరల్డ్ అనే కరపత్రంలో 3వ పేజీలోగల రెండవ పేరానుండి చదవడం ప్రారంభించండి. లేఖనాల్ని చూడండి. మీరు చదివేదానికి గృహస్థుని ప్రత్యుత్తర మేమిటో అడగండి. 5వ పేజీ నందుగల “హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ ఫర్ యు” అనే ఉపశీర్షిక క్రిందగల అంశాల్ని పరిశీలించుట ద్వారా ముగించండి.
5 అదే విధంగా, మీరు వాట్ హోప్ ఫర్ డెడ్ లవ్డ్ వన్స్? అనే కరపత్రాన్ని ఉపయోగించవచ్చును.
మీరిట్లనవచ్చు:
◼ “మనమింతకు ముందు క్లుప్తంగా పరిశీలించినట్లు, అనేకమందికి దేవునియందు నమ్మకం లేదు. ఉదాహరణకు, వారిలా ప్రశ్నిస్తారు, ‘దేవుడెంతో శక్తిమంతుడైతే, ప్రజలు మరణించడానికి ఆయనెందుకు అనుమతిస్తున్నాడు?’ ఆ ప్రశ్నకు సమాధానమివ్వడానికి ఈ కరపత్రం సహాయం చేయగలదు.” 2వ పేజీలోగల నాల్గవ పేరాతో ఆరంభమయ్యే భాగానికి దృష్టి మళ్లించండి. ప్రతి పేరా తర్వాత తత్సంబంధిత ప్రశ్నవేసి, అక్కడ ఎత్తివ్రాయబడకుండా, సూచింపబడిన లేఖనాల్ని పరిశీలించండి. మన సమస్యలు లేదా ఇదిగో . . . సమస్తము అను బ్రోషూర్లు మీ సంఘంలో ఉన్నట్లయితే, వాటినికూడ ఈ విధంగానే ఉపయోగించవచ్చును.
6 పఠనమును కొనసాగించుట: ఇక్కడ సూచింపబడిన పద్ధతులను అనుసరించుట ద్వారా, మీరు ఒక బైబిలు పఠనాన్ని ప్రారంభిస్తున్నారు. క్రమంగా ఆ చర్చను కొనసాగించుటకుగాను, మీ సందర్శన ముగింపునందు ఆ గృహస్థున్ని ఇలా అడగండి: “కేవలం కొద్ది నిమిషాల్లోనే ప్రాముఖ్యమైన ప్రశ్నలకు మేము జవాబివ్వడాన్ని మీరు గమనించారా? పునరుత్థాన నిరీక్షణను గూర్చి లేదా మీకు ఆసక్తికరమైన మరో అంశాన్ని గూర్చి మాట్లాడడానికి మనం వచ్చేవారం మరికొంత సమయం తీసుకుందాం.” మీరు సందర్శించు ప్రతిసారి ఈ శీర్షికలలో ప్రస్తావించబడిన ప్రశ్నలలో కేవలం ఒకదానిని మాత్రమే ఉపయోగించవచ్చును. తగినసమయంలో, మీరు ఒక బ్రోషూరును ఉపయోగించవచ్చును లేదా నిరంతరము జీవించగలరు అనే పుస్తకం నుండి పఠనాన్ని ప్రారంభించవచ్చును.
7 సత్యాన్ని నిజంగా-వెదికే వ్యక్తితో బైబిలు పఠనాన్ని నిర్వహించడం ఎంత సంతృప్తికరంగా ఉంటుంది! మనం కనుగొనే ఆసక్తిని పెంపొందించు పద్ధతులను గూర్చి ఇవ్వబడిన సలహాలను అన్వయించుట ద్వారా ఫలదాయకమైన పరిచర్యతో మనం ఆశీర్వదించబడుదుము.