సరియైన మాట్లాడదగు అంశాలను ఎన్నుకొనుము
1 ప్రజలు ది వాచ్‌టవర్ మరియు అవేక్! పత్రికలను క్రమంగా చదువునట్లు ప్రోత్సహించుటకు మనమేమి చేయగలము? ఇతరులకు మనమా పత్రికలను సిఫారసు చేసినప్పుడు మాట్లాడుటకు మనకు ఆసక్తికరమైన అంశాలుండాలి. మన ప్రాంతమందలి ప్రజలను మనం బాగుగా తెలుసుకొన్నవారమై, మనం పత్రికలను చదివేటప్పుడు వారిని మనస్సు నందుంచుకుంటే, వారి ఆసక్తిని చూరగొనే మాట్లాడదగు అంశాల కొరకు మనం చూడగలం.
2 సాధారణ శ్రద్ధగల విషయాన్ని సులభంగా తెలిసికోవడానికి వీలుగా కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఒకే సంస్కృతి నుండి వచ్చినవారై ఉండవచ్చు. అయితే మరికొన్ని ప్రాంతాలలో, అనేక సంస్కృతుల ప్రజలను మనం కనుగొనవచ్చు. మన మనస్సులో అనేక రకాల మాట్లాడదగు అంశాలను కలిగివుంటే, మనం కలుసుకునే ప్రతి వ్యక్తికి సరిగ్గా సరిపోవు అంశాన్ని మనం ఎంచుకోవచ్చును.
3 కొత్తవి చేతికందిన వెంటనే త్వరపడి పాత పత్రికలను తీసిపారవేయకండి. ఒక సహోదరుడు గృహస్థునికి ది వాచ్‌టవర్ యొక్క మూడు నాలుగు సంచికలు తీసి చూపించి అతడు చదవాలని కోరుకునే దాన్ని అతన్నే తీసుకోనిస్తాడు. మనం అందించగల పత్రికలకంటె మనకు ఎక్కువ పత్రికలు వస్తున్నాయని మనం కనుగొంటే, మన ఆర్డరును సవరించుటకు మన మాలోచించాలి.
4 అన్ని సమయాల్లో సరియైన మాట్లాడదగు అంశాలను ఉపయోగించుట ద్వారా, ఇతరులు మన పత్రికలను చదువునట్లు, బహుశ జీవమార్గమున పయనించుటకు వారు ఆరంభించునట్లు మనం వారిని ప్రోత్సహించవచ్చును. (మత్త. 7:14) ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయిన, యెహోవా ఆశీర్వాదాల కొరకు మనం నిశ్చయంగా ఎదురుచూడగలము.