ఇయర్‌బుక్—ప్రోత్సాహకరమైన నిధి
1 యెహోవా అద్భుత కార్యాలకు సంబంధించిన రిపోర్టులు, అనుభవాలు ఎల్లప్పుడూ దేవుని ప్రజలకు సేద తీర్చేవిగా ఉంటున్నాయి. (యోబు 38:4, 7; సామె. 25:25; లూకా 7:22; అపొ. 15:31) అందుకే యెహోవాసాక్షుల ఇయర్‌బుక్ ఒక ప్రోత్సాహకరమైన నిధియైయుంది.
2 ప్రతి ఇయర్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల కార్యాలనుగూర్చి, వారు సాధించినవాటిని గూర్చి ఉత్తేజపరచే రిపోర్టులను అందిస్తుంది. విశ్వాసాన్ని బలపర్చే అనుభవాలు యెహోవా మార్గాన్ని, సంరక్షణను, ఆయన ప్రజలయొక్క ఆశీర్వాదాన్ని నొక్కిచెబుతాయి. అన్ని ఖండాల్లోను, అనేక సముద్ర ద్వీపాల్లోను ఉన్న ప్రజలకు బైబిలు సత్యాలను ప్రకటించడానికి కుటుంబాన్ని, స్నేహితులను, స్వస్థలాన్ని విడిచిన ధైర్యవంతులైన స్త్రీపురుషులను గూర్చి ఈ ఇయర్‌బుక్ చెబుతుంది.
3 దేవుని సేవను తాము వృద్ధిచేసుకొనేటట్లు ఈ ఇయర్‌బుక్ అనేకమంది పాఠకులను పురికొల్పింది. ఒక పాఠకురాలు ఇలా వ్రాసింది: “నేను దీన్ని తగినంత తొందరగా చదవలేను. ఇంతవరకూ నేను చదివింది చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఇతరులు తమకు వచ్చిన ఒత్తిళ్లలో కూడ వారు చేసిన సేవ నేను చూసినప్పుడు, నేను ప్రాంతీయ సేవలో ఇంకా ఎక్కువ చేయగలనని భావించేదాన్ని.”
4 ప్రతి సంవత్సరం అంటే 1927 నుండి, యెహోవాసాక్షుల ఇయర్‌బుక్ ప్రోత్సాహకరమైన రిపోర్టులు, అనుభవాలు కల్గియున్న నిజమైన ఒక నిధియైయుంది. ప్రోత్సాహానికి అద్భుత మూలమైన దీన్నుండి మీరు పూర్తిగా ప్రయోజనం పొందుతున్నారా? అలా చేయడానికి, మొట్టమొదట దాన్ని పొందిన వెంటనే మీరు ఈ ఇయర్‌బుక్‌ను తప్పక చదవండి. ఆ తర్వాత సంవత్సరమంతా, మీకును, మీ కుటుంబానికి కావల్సిన ప్రోత్సాహాన్ని పొందడానికి దానిలోని ప్రత్యేకమైన భాగాలను పునర్విమర్శ చేయండి.