డిశంబరు కొరకు సేవా కూటములు
డిశంబరు 6తో ప్రారంభమగు వారం
పాట 205 (118)
10 నిమి: స్థానిక ప్రకటనలు, మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసిన ప్రకటనలు.
20 నిమి: “దేవుని కుమారుడైన యేసుక్రీస్తును గూర్చి నేర్చుకోవడానికి ఇతరులకు సహాయపడండి.” ప్రశ్నా సమాధానముల చర్చ. రెండవ పేరా నుండి (అనుభవమున్న ప్రచారకుని ద్వారా), నాల్గవ పేరా నుండి (యౌవన ప్రచారకుని ద్వారా) అందింపులను గూర్చిన ప్రదర్శన చూపండి. ఇంటింటిసేవలోను, తటస్థసాక్ష్యంలోను మహాగొప్ప మనిషి పుస్తకాన్ని అందించమని అందరినీ ప్రోత్సహించండి.
15 నిమి: “పత్రికలందించుటకు సమయాన్ని కేటాయించండి.” ప్రేక్షకులతో చర్చ, ప్రసంగం. మూడవ పేరాను చర్చించేటప్పుడు, సరిక్రొత్త పత్రికలలోని వేర్వేరు శీర్షికలను స్థానికంగా కలుసుకునే వేర్వేరు ప్రజలకు ఎలా అందించవచ్చునో ప్రదర్శించండి.
పాట 169 (28) ముగింపు ప్రార్థన.
డిశంబరు 13తో ప్రారంభమగు వారం
పాట 146 (80)
10 నిమి: స్థానిక ప్రకటనలు, అకౌంట్స్ రిపోర్టు, విరాళం ముట్టినట్లు చెప్పబడిన మాటలు. స్థానిక అవసరాలకు, సొసైటీ రాజ్యమందిర నిధి కొరకు, ప్రపంచ వ్యాప్తంగా సొసైటీ చేస్తున్న సేవకు ఉదారంగా యిచ్చిన మద్దతు నిమిత్తమై సంఘాన్ని మెచ్చుకోండి. ఈ వారాంతంలోని ప్రాంతీయ సేవలో పరిచయ వ్యాఖ్యానాలుగా ఉపయోగించగల ఒకటి లేదా రెండు సంభాషణ అంశాలనుగూర్చి తెల్పండి.
20 నిమి: “మీ బైబిలు విద్యార్థి హృదయాన్ని చేరుకోండి.” ప్రదర్శనలతో ప్రశ్నా సమాధానములు. బోధించే కళను సంఘంలోని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చేసుకొనుటలో పాటుపడాలనే విషయాన్ని నొక్కిచెప్పండి. మూడవ పేరాను పరిశీలించిన తర్వాత, నిరంతరము జీవించగలరు అనే పుస్తకమందలి మొదటి అధ్యాయంలోని 13, 14 పేరాలలోని లేఖనాలు, ప్రశ్నలను ఉపయోగించడం ద్వారా బైబిలు విద్యార్థితో ఎలా తర్కించాలో ప్రచారకుడు ప్రదర్శిస్తాడు.
15 నిమి: “ఇయర్‌బుక్—ప్రోత్సాహకరమైన నిధి.” ఇవ్వబడ్డ లేఖనాల అన్వయింపును ఉన్నతపరుస్తూ ఇచ్చే ఉత్సాహకరమైన ప్రసంగం. ది వాచ్‌టవర్ జనవరి 1, 1990, జనవరి 1, 1987, జనవరి 1, 1986 ఆంగ్ల సంచికల్లోని 32వ పేజీలలో ఉన్న శీర్షికల్లోని లేదా మీ భాషలోనున్న కావలికోట పత్రికల్లో తగిన అనుభవాలను ఉత్తేజపూరితంగా వివరించడానికి బాగా సిద్ధపడిన ప్రచారకులను ఏర్పాటుచేయండి.
పాట 165 (81) ముగింపు ప్రార్థన.
డిశంబరు 20తో ప్రారంభమగు వారం
పాట 189 (90)
15 నిమి: స్థానిక ప్రకటనలు. డిశంబరు 25న ప్రత్యేక సాక్ష్యమివ్వడానికి గల స్థానిక ఏర్పాట్లను వివరించండి.
20 నిమి: “డిశంబరులో బైబిలు పఠనాలను ప్రారంభించుట.” ప్రేక్షకులతో చర్చ. నాల్గవ పేరాను పరిశీలించేటప్పుడు, పునర్దర్శనంలో బైబిలు పఠనాన్ని ఎలా ప్రారంభించాలో ప్రదర్శించండి. సాధ్యమైతే, ప్రతినెలా ఒక బైబిలు పఠనం చేయాలని అందర్నీ ప్రోత్సహించండి.
10 నిమి: “క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం.” ప్రశ్నా సమాధానాల చర్చ. అలాంటి సభలకు హాజరగుటవల్ల కలిగే ప్రయోజనాలను వివరించి, రాబోయే సమావేశ ఉన్నతాంశాలను సూచించండి. తమ సభల తేదీలను ప్రకటించిన వెంటనే హాజరవడానికి ఏర్పాట్లు చేసుకోమని అందర్నీ ప్రోత్సహించండి.
పాట 61 (13) ముగింపు ప్రార్థన
డిశంబరు 27తో ప్రారంభమగు వారం
పాట 37 (94)
10 నిమి: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు. జనవరి 1న ప్రత్యేక సాక్ష్యమివ్వడానికి గల ఏర్పాట్లను ప్రకటించండి. జనవరిలో స్థానికంగా అందించే సాహిత్యాలను ఎలా ఉపయోగించాలో ప్రదర్శించండి.
20 నిమి: మాదకద్రవ్యాలు ఉపయోగించడంవల్ల జరిగే నష్టమేమిటి? పాఠశాలల్లో విస్తృతంగా ఉపయోగించబడుతున్న మాదకద్రవ్యాలను గూర్చి ఇద్దరు యౌవన ప్రచారకులు సంఘపెద్దతో చర్చిస్తారు. అప్పుడప్పుడు మాదకద్రవ్యాలను ఉపయోగించడం ఏమీ తప్పుకాదని కొందరు యౌవనులు అనుకుంటారని వారంటారు. తాను పాఠశాలకు వెళ్లినప్పటికి ఇప్పటికి, పరిస్థితులు చెడిపోయాయని సంఘపెద్ద అంగీకరిస్తాడు. బైబిల్లో ఇలాంటి పదార్థాలు వివరించబడలేదు కాని, రీజనింగ్ పుస్తకంలోని 106-12 పేజీలలో చక్కని సూచనలు కనుగొనవచ్చని ఆయన సూచిస్తాడు. యౌవనులు లేఖనాలను చదువుతారు, విషయాన్ని చర్చిస్తుండగా సంఘపెద్ద వారితో చక్కగా తర్కిస్తాడు. యౌవనులు వ్యక్తిగతంగా తోటిస్నేహితుల ఒత్తిడిని ఎలా ఎదుర్కొనాలో సహాయపడగల వివిధ మార్గాలనుగూర్చి తమ స్వంత సలహాలను ఇస్తారు.
15 నిమి: స్థానిక అవసరతలు లేదా కావలికోట ఆగష్టు 15, 1993, పక్షపత్రిక సంచికలందలి (ఇంగ్లీషుతో పాటు) 27-30 పేజీల్లో ఉన్న “క్రైస్తవులెట్లు వృద్ధులకు సహాయపడగలరు,” అనే అంశంమీద సంఘపెద్ద ప్రసంగిస్తాడు. ది వాచ్‌టవర్ మాసపత్రికగా ముద్రించబడుతున్న భాషలను ఉపయోగించే సంఘాల్లో ప్రసంగం, స్వభాషల్లోని మాసపత్రిక సంచికలనుండి అంటే అక్టోబరు 1, 1993 సంచికలోని “వేచివుండుటకు నేర్చుకొనుటలో గల సమస్య” అనే శీర్షికపై ఆధారపడవచ్చు. (ఈ శీర్షిక ఇంగ్లీషు మరియు పక్షపత్రిక అక్టోబరు 15, 1993 సంచికలలో 8-11 పేజీల్లో కలదు.)
పాట 120 (26) ముగింపు ప్రార్థన.