వినువారు మాత్రమేగాక చేసేవారై ఉండండి
1 వినువారు మాత్రమేగాక వాక్య ప్రకారం చేసేవారై ఉండండనే బైబిలు ఉద్బోధనను, నేడు నిజ క్రైస్తవులు హృదయంలోకి తీసుకుంటారు. (యాకో. 1:22, NW) క్రైస్తవులమని చెప్పుకుంటున్నా దేవున్ని పెదవులతో మాత్రమే సేవించేవారికి, మరీ భిన్నంగా వారినిది ఉంచుతోంది. (యెష. 29:13) దేవుని చిత్తప్రకారంగా చేయువారు మాత్రమే రక్షించబడతారని యేసు స్పష్టంగా తెలియజేశాడు.—మత్త. 7:21
2 దైవిక క్రియలులేని ఆరాధన అర్థరహితం. (యాకో. 2:26) కాబట్టి ‘నా విశ్వాసం యథార్థమైందని నా క్రియలెలా రుజువు చేస్తాయ్? నేను విశ్వసిస్తున్న దానికి అనుగుణంగా నేను నిజంగా జీవిస్తున్నానని ఏది చూపుతుంది? నేను యేసును మరింత పూర్తిగా ఎలా అనుకరించగలను?’ అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఈ ప్రశ్నలకు ఇచ్చే యథార్థమైన జవాబులు మనమే పురోభివృద్ధిని చేసుకున్నాం లేక దేవుని చిత్తాన్ని చేయడంలో ఇంకా మనమేం పురోభివృద్ధి చేసుకోవాల్సింది ఉందో తెలుసుకోవడానికి మనకు సహాయపడతాయి.
3 యేసును అనుసరించేవారిగా, “దినమెల్ల మేము దేవునియందు అతిశయపడుచున్నాము. నీ నామమునుబట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము” అని కీర్తనల గ్రంథకర్త వ్యక్తపర్చినలాంటి ప్రథమ లక్ష్యాన్నే మనం మన జీవితాల్లో కల్గివుండాలి. (కీర్త. 44:8) అనుదినమూ మనం చేసే అన్నివిషయాల్లోనూ వ్యక్తపర్చబడే జీవిత విధానమే క్రైస్తవత్వం. యెహోవాను స్తుతించాలనే మన హృదయపూర్వకమైన కోరికను మన కార్యకలాపాలన్నింటిలోనూ మనం చూపిస్తుండగా మనమెంత సంతృప్తిని పొందగలమో కదా!—ఫిలి. 1:11.
4 యెహోవాకు స్తుతుల్ని చెల్లించడంలో ఓ నీతియుక్తమైన జీవితాన్ని జీవించడంకన్నా ఎక్కువే చేరివుంది: దేవుడు కోరేది కేవలం శ్రేష్ఠమైన ప్రవర్తనే అయితే మనం మన వ్యక్తిత్వాన్ని పరిశుభ్రపర్చుకోవడంపైనే కేంద్రీకరించవచ్చు. కాని మన ఆరాధనలో యెహోవా గుణాతిశయాల్ని అంతటా ప్రచురం చేయడం, ఆయన నామాన్ని బహిరంగంగా ప్రకటించడం కూడా చేరివున్నాయి!—హెబ్రీ. 13:15; 1 పేతు. 2:9.
5 మనం చేసే అతి ప్రాముఖ్యమైన పనుల్లో సువార్తను బహిరంగంగా ప్రకటించడం ఒకటైవుంది. సువార్తను వినువారికి అది నిత్యజీవమనే విషయాన్ని యేసు ఎరిగినందున, ఈ పనిని చేసేందుకు ఆయన తనను తాను అంకితం చేసుకున్నాడు. (యోహా. 17:3) నేడు, “వాక్యపరిచర్య” అంతే ప్రాముఖ్యతను కల్గివుంది; ప్రజలు రక్షించబడడానికి ఉన్న ఏకైక మార్గమదే. (అపొ. 6:4; రోమా. 10:13) విస్తృతమైన ప్రయోజనాల్ని గ్రహించడం ద్వారా “అత్యావశ్యకంగా వాక్యాన్ని ప్రకటించమని,” పౌలు మనకు ఉద్బోధించిన కారణాన్ని మనం ప్రశంసించగలం.—2 తిమో. 4:2, NW.
6 యెహోవాను స్తుతించడమనేది ఎంతమేరకు మన జీవితాలను ఆక్రమించుకోవాలి? అది దినమంతా తన మనస్సులో ఉందని కీర్తనల గ్రంథకర్త తెలియజేశాడు. మనమూ అలాగే భావించడం లేదా? అవును, మనం ఇతరుల్ని కలిసే ప్రతి సందర్భాన్ని యెహోవా నామాన్ని గూర్చి మాట్లాడేందుకు ఓ అనుకూలమైన సందర్భంగా పరిగణిస్తాం. మన సంభాషణను ఆత్మీయ విషయాలవైపు నడిపించడానికి తగిన అవకాశాల కొరకు మనం ఎదురు చూస్తాం. సంఘంచే సంస్థీకరించబడిన ప్రాంతీయ సేవా కార్యక్రమాల్లో క్రమంగా భాగం వహించేందుకు కూడా మనం పాటుపడతాం. మన జీవితంలో ప్రతిరోజూ ప్రకటనా పనినే మొదటిదిగా ఉంచుకొనేందుకు పయినీరు సేవ మనకు తోడ్పడ్తుంది గనుక పరిస్థితులు అనుమతించినవారు దాని గురించి గంభీరంగా తలంచవచ్చు. దేవుని చిత్తాన్ని పట్టుదలతో చేస్తూ ఉండడం ద్వారా మనం ధన్యులమౌతామని దేవుని వాక్యం మనకు అభయమిస్తోంది.—యాకో. 1:25.