1996 కొరకైన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నుండి ప్రయోజనం పొందండి—భాగం 1
1 “1996 కొరకైన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక”లో ఇవ్వబడిన ఉపదేశాల్ని మీరు చదివారా? కొన్ని మార్పుల్ని మీరు గుర్తించారా? జనవరి నుండి ఏప్రిల్ వరకూ ఆంగ్లభాషా పట్టికలో అసైన్మెంట్ నెం. 3, తర్కించుట (ఆంగ్లం) అనే పుస్తకం (ప్రాంతీయ భాషా పట్టికల్లో, చర్చనీయ బైబిలు అంశములు) ఆధారంగా ఇవ్వబడ్తుంది, మే నుండి డిశంబరు వరకూ క్రొత్తగా విడుదలైన జ్ఞానము అనే పుస్తకం ఆధారంగా ఇవ్వబడ్తుంది. అసైన్మెంట్ నెం. 4 ప్రతివారం ఓ వైవిధ్యమైన బైబిలు పాత్రను గూర్చిన ప్రసంగంగా ఆంగ్లభాషా పట్టికలో జాబితీకరించబడింది, అయితే ఇతర భాషల కొరకు తర్కించుట అనే పుస్తకం నుండి ఈ అసైన్మెంట్ పట్టిక వేయబడింది.
2 విద్యార్థి అసైన్మెంట్లు: అసైన్మెంట్ నెం. 3 ఓ సహోదరికి ఇవ్వబడ్తుంది. ఇది అంశములు లేక తర్కించుట అనే పుస్తకం ఆధారంగా ఇచ్చినప్పుడు, సన్నివేశంలో ఇంటింటి సాక్ష్యం లేక అనియత సాక్ష్యం చేరివుండాలి. జ్ఞానము పుస్తకంపై ఆధారపడినప్పుడు, దానిని ఓ పునర్దర్శనంగానో లేక ఓ గృహ బైబిలు పఠనంగానో అందించాలి. జ్ఞానము పుస్తకం గృహ బైబిలు పఠనాలు నిర్వహించడానికి విస్తృతంగా ఉపయోగింపబడ్తుంది గనుక ఇదెంతో సహాయకరమైనదిగా రుజువవ్వాలి.
3 సన్నివేశం ఓ గృహ బైబిలు పఠనమైతే సహోదరీలు ఇరువురూ కూర్చొనవచ్చు. క్లుప్తమైన పరిచయ వ్యాఖ్యానాలు చేసి సూటిగా పఠనం ప్రారంభించి, తరువాత ముద్రింపబడిన ప్రశ్నల్ని అడగండి. గృహస్థురాలి పాత్ర వాస్తవంగా ఉండాలి. ఎత్తి వ్రాయబడని లేఖనాల్ని సమయం అనుమతించబడినంత మేరకు చూడవచ్చు, చదవవచ్చు. ప్రశ్నలతోనూ ఉపయోగింపబడిన లేఖనాలపై తర్కించడం ద్వారానూ గృహస్థురాలిని స్వేచ్ఛగా మాట్లాడించేలా ఆ సహోదరి బోధనా కళను ఉపయోగించాలి.
4 తర్కించుట లేక జ్ఞానము పుస్తకాల్లో నియమింపబడిన భాగమందు ఐదు నిమిషాల్లో చర్చించలేనన్ని ఎత్తి వ్రాయబడిన లేఖనాలుంటే ఏమి చెయ్యాలి? ప్రధానమైన విషయాల్ని ఉన్నతపర్చే కీలకమైన వచనాల్ని ఎంపిక చేసుకోండి. లేఖనాలు కొన్నే ఉంటే, పాఠంలోని ముఖ్యమైన విషయాల్ని మరింత విస్తృతంగా చర్చించవచ్చు. అప్పుడప్పుడు, పుస్తకం నుండి ఓ పేరానో లేక ఓ వాక్యాన్నో చదివి తరువాత గృహస్థురాలితో చర్చించవచ్చు. అంశములు నుండి ఓ ప్రసంగాన్ని సిద్ధపడ్తున్నప్పుడు, ప్రతి విషయాన్నుండి కనీసమొక లేఖనాన్ని ఉపయోగించడం మంచిది.
5 జ్ఞానము పుస్తకంలోని ప్రతి అధ్యాయం చివరి పేరా చేరివున్న అసైన్మెంట్గల ప్రచారకురాలు, ఆ అధ్యాయం చివరవున్న “మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి” అనే పేరుగల బాక్సును క్లుప్తంగా పునర్విమర్శ చేయవచ్చు. నియమింపబడిన పేరాలతోపాటూ ఉన్న సమాచార బాక్సుల్ని కూడా సమయం అనుకూలించినంత వరకు చర్చించవచ్చు. ఓ సమాచార బాక్సు రెండు అసైన్మెంట్ల్ మధ్య వస్తే, మొదటి అసైన్మెంట్ చేస్తున్న సహోదరి దానిని పరిశీలించవచ్చు. ఈ పుస్తకంలోని చిత్రాలు, పరిశీలించాల్సిన సమాచారానికి అవి అన్వర్తించినప్పుడల్లా వాటిపై వ్యాఖ్యానించవచ్చు.
6 అసైన్మెంట్ నెం. 4 ఎంతో ఆసక్తిదాయకమైనదిగా, అభ్యాససిద్ధమైనదిగా ఉండాలి. మీ సంఘం ఆంగ్లభాషా పట్టికను అనుసరిస్తున్నట్లైతే, నియమింపబడిన బైబిలు పాత్రను గురించి అంతర్దృష్టి సంపుటి 1 చెబుతున్న దానిని జాగ్రత్తగా అధ్యయనం చేయండి. విషయాంశం చుట్టూ ప్రసంగాన్ని వివరించండి, బైబిలులోని నిజ జీవిత పాత్రపై మరియు మనం అనుకరించాలని అనుకొనే లేక విడనాడాలని అనుకొనే లక్షణాలు, స్వభావాలు లేక ఉద్దేశాలు చేరివున్న ఆ పాత్ర వ్యక్తిత్వంపై ప్రేక్షకులు కేంద్రీకరించేందుకు తోడ్పడే కీలకమైన బైబిలు వచనాల్ని ఎంపిక చేసుకోండి. బైబిలు పాత్రతో సూటిగా సంబంధంలేని లేఖనాలు మంచి లేక చెడులను గూర్చిన ఆయా స్వభావాల్ని యెహోవా ఎలా దృష్టిస్తాడో ఉన్నతపర్చినట్లైతే లేక ప్రసంగాంశానికి సంబంధించినట్లైతే వాటిని చేర్చవచ్చు. ఈ ప్రసంగం తర్కించుట అనే పుస్తకం నుండి ఇస్తున్నప్పుడు ప్రాంతీయ సేవలో ఉపయోగించడానికి అభ్యాససిద్ధమైన విషయాల్ని నొక్కి చెప్పాలి.
7 పాఠశాలలో ఇవ్వబడే తర్ఫీదు నుండి మనం పూర్తి ప్రయోజనాన్ని పొందితే, శ్రేష్ఠమైన “బోధనా కళను” చూపించే రీతిలో మనం సమర్థవంతంగా “వాక్యాన్ని ప్రకటించ”గల్గుతాం.—2 తిమో. 4:2, NW.