కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/98 పేజీ 7
  • “యెహోవా నాకు సహాయుడు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “యెహోవా నాకు సహాయుడు”
  • మన రాజ్య పరిచర్య—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరిశుద్ధాత్మను నేను నా వ్యక్తిగత సహాయకుడిగా చేసుకున్నానా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • ప్రేమవల్ల ధైర్యం బలపడుతుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • మంచి ధైర్యముతో ఉండండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ‘నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి!’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1998
km 2/98 పేజీ 7

“యెహోవా నాకు సహాయుడు”

1 యేసు తన మొదటి శిష్యుల్ని ఆదేశించినప్పుడు, ఆయన వారితో ఇలా అన్నాడు: “ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను.” (మత్త. 10:16) అది వాళ్లు భయకంపితులై ప్రకటించకుండా ఉండేలా చేసిందా? లేదు. అటు తర్వాత అపొస్తలుడైన పౌలు, “ప్రభువు [“యెహోవా,” NW] నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము” అని తన తోటి క్రైస్తవులకు చెప్పినప్పుడు ఆయన వ్యక్తం చేసిన దృక్పథాన్ని వాళ్లు అనుసరించారు. (హెబ్రీ. 13:6) యేసు నామము విషయమై అవమానింపబడేందుకు పాత్రులని యెంచబడినందుకు వాళ్లు సంతోషించారు, వాళ్లు ప్రతిదినమూ సువార్తను మానక బోధించడంలోనూ, ప్రకటించడంలోనూ కొనసాగారు.—అపొ. 5:41, 42.

2 నేడు ప్రపంచవ్యాప్త ప్రకటనాపని దాని చివరి దశల్లో ఉంది. యేసు ప్రవచించినట్లుగానే, మనం సకల జనములచేత ద్వేషించబడుతున్నాము. (మత్త. 24:9) మన ప్రకటనాపని వ్యతిరేకించబడి, అపహాస్యం చేయబడింది, భూమిపైని కొన్ని దేశాల్లో ప్రకటనాపని నిషేధించబడింది కూడా. మనలో విశ్వాసం కొరవడితే, మనం భయపడిపోవచ్చు. అయినా, యెహోవా మనకు సహాయుడు అని తెలుసుకోవడం మనల్ని ఊరడించి, పట్టుదల కల్గివుండేలా మనల్ని బలపరుస్తుంది.

3 ధైర్యమనేది దృఢంగానూ, సాహసవంతంగానూ పరాక్రమంతోనూ ఉండడమనే లక్షణం. అది భయపడడానికీ, పిరికితనానికీ, భీరత్వానికీ వ్యతిరేకమైన లక్షణం. యేసు శిష్యులు సహించేందుకు ఎల్లవేళలా ధైర్యాన్ని కల్గివుండ వలసి వచ్చింది. దేవునితో శత్రుత్వం కల్గివున్న లోక దృక్పథాల మూలంగా, చర్యల మూలంగా మనం ధైర్యం కోల్పోకుండా జాగ్రత్త వహించాలంటే అది అత్యవసరం. ప్రపంచ విజేతయైన యేసు ఉన్నత మాదిరిని గూర్చి మనం ఆలోచించడం ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో కదా! (యోహా. 16:33) తీవ్రమైన శ్రమల్ని ఎదుర్కొంటున్నప్పటికీ “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను” అని ధైర్యంగా ప్రకటించిన అపొస్తలులను కూడా జ్ఞాపకం చేసుకోండి.—అపొ. 5:29.

4 మనం వెనక్కి తీయువారం కాము: మన పని విషయంలో అనుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి మనం కృషి చేయాలి. (హెబ్రీ. 10:39) సర్వ మానవాళి ఎడల ఆయనకుగల ప్రేమా దయల వ్యక్తీకరణగా యెహోవా మనల్ని పంపిస్తున్నాడనే విషయాన్ని ఎల్లవేళలా మనస్సులో ఉంచుకోవాలి. ఉపయుక్తమైన సంకల్పాన్ని నెరవేర్చని దానిని చేయమని ఆయన తన సేవకుల్ని ఎన్నడూ అడుగడు. చేయమని మనకు నియమించబడిన ప్రతీదీ, చివరకు దేవుడ్ని ప్రేమించేవారి మంచికే పరిణమిస్తుంది.—రోమా. 8:28.

5 మన నియమిత ప్రాంతంలోని గొఱ్ఱెల్లాంటి వారిని అన్వేషిస్తూ ఉండడానికి మనకు అనుకూల దృక్పథం సహాయపడుతుంది. ప్రజలు చూపించే ఉదాసీన వైఖరిని వారి నిరాశా, నిస్పృహల వ్యక్తీకరణగా మనం దృష్టించగలం. సానుభూతి చూపించేందుకూ, సహనం కల్గివుండేందుకూ మన ప్రేమ మనల్ని కదిలించాలి. మనం సాహిత్యాన్నిచ్చిన ప్రతిసారీ, లేకపోతే ఏ మాత్రపు ఆసక్తైనా ఉందని కనుగొన్న ప్రతిసారీ, త్వరగా పునర్దర్శనాల్ని చేసి, మరింత ఆసక్తిని పెంపొందించాలన్నదే మన లక్ష్యమై ఉండాలి. బైబిలు పఠనాన్ని ప్రారంభించగల మన సామర్థ్యాన్నిగానీ లేక దాన్ని ప్రతిభావంతంగా నిర్వహించగల సామర్థ్యాన్నిగానీ మనం సందేహించాల్సిన అవసరంలేదు. బదులుగా, యెహోవా మనకు తప్పక సహాయం చేస్తాడనే దృఢనమ్మకంతో ఆయన మద్దతునూ, నడిపింపునూ మనం ఎడతెగకుండా, ప్రార్థనాపూర్వకంగా వెదకాలి.

6 యెహోవా ఆ పని సంపూర్ణమయ్యేలా చూస్తాడని మనం దృఢంగా నమ్ముతున్నాం. (పోల్చండి ఫిలిప్పీయులు 1:6.) మన సహాయకునిగా ఆయనయందు మనముంచిన నమ్మకం మనల్ని బలపరుస్తుంది గనుక మనం “మేలుచేయుట యందు విసుకక” ఉందాం.—గల. 6:9.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి