పాట 33
మీ భారాన్ని యెహోవాపై వేయండి
1. నా మొర విని యెహోవా,
నాకు ఉత్తరమివ్వు.
నింపు నాలో నీ ధైర్యాన్ని;
నా భయాలు తీసెయ్యి.
(పల్లవి)
వేయండి మీ భారమంతా
యెహోవా తండ్రిపై నిత్యమూ.
తోడుంటాడు ఎల్లప్పుడూ,
నమ్మకస్థుడాయన.
2. గువ్వలాగే రెక్కలుంటే,
నేనెగిరిపోతాను,
కీడు చేసే వాళ్లనుండి
నే తప్పించుకుంటాను.
(పల్లవి)
వేయండి మీ భారమంతా
యెహోవా తండ్రిపై నిత్యమూ.
తోడుంటాడు ఎల్లప్పుడూ,
నమ్మకస్థుడాయన.
3. ప్రేమగల మన తండ్రి
ఎంతో శాంతినిస్తాడు.
నమ్మకంగా సహించేలా
సాయం చేస్తాడాయన.
(పల్లవి)
వేయండి మీ భారమంతా
యెహోవా తండ్రిపై నిత్యమూ.
తోడుంటాడు ఎల్లప్పుడూ,
నమ్మకస్థుడాయన.
(కీర్త. 22:5; 31:1-24 కూడా చూడండి.)