2 కాబట్టి అతను యెహోవాకు ఇలా ప్రార్థించాడు: “యెహోవా, ఇలా జరుగుతుందని నా దేశంలో ఉన్నప్పుడే నాకు తెలుసు కదా. అందుకే నేను ముందే తర్షీషుకు పారిపోవాలని చూశాను;+ ఎందుకంటే నువ్వు కనికరం, కరుణ గల దేవుడివని, ఓర్పును, ఎంతో విశ్వసనీయ ప్రేమను చూపిస్తావని,+ మనసు మార్చుకుని విపత్తును తీసుకురావని నాకు తెలుసు.