19 అప్పుడు మీకాయా ఇలా అన్నాడు: “యెహోవా చెప్పే మాట వినండి: యెహోవా తన సింహాసనం మీద కూర్చొనివుండడం,+ పరలోక సైన్యమంతా ఆయన కుడిపక్కన, ఎడమపక్కన నిలబడివుండడం నేను చూశాను.+
13 ఉన్నట్టుండి, పరలోక సైన్యంలోని చాలామంది దేవదూతలు+ ఆ దేవదూతతో పాటు కనిపించి దేవుణ్ణి ఇలా స్తుతిస్తూ ఉన్నారు: 14 “అత్యున్నత స్థలాల్లో దేవునికి మహిమ, భూమ్మీద ఆయనకు ఇష్టమైన* మనుషులకు శాంతి కలగాలి.”