-
యిర్మీయా 33:25, 26పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
25 “యెహోవా ఇలా అంటున్నాడు: ‘పగలు, రాత్రి గురించిన నా ఒప్పందాన్ని,+ భూమ్యాకాశాల నియమాల్ని*+ నేను స్థిరపర్చాను అనే మాట ఎంత ఖచ్చితమో, 26 యాకోబు సంతానాన్ని,* నా సేవకుడైన దావీదు సంతానాన్ని* ఎప్పటికీ తిరస్కరించను అనే మాట కూడా అంతే ఖచ్చితం; అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల వంశస్థుల్ని* పరిపాలించడానికి అతని సంతానం* నుండి నేను పరిపాలకుల్ని తీసుకోకుండా ఉండను. ఎందుకంటే వాళ్లలో బందీలుగా వెళ్లిన వాళ్లను నేను సమకూరుస్తాను,+ వాళ్లమీద జాలిపడతాను.’ ”+
-