9 పూర్వకాలం నాటి పాత సంగతుల్ని గుర్తుచేసుకోండి,
నేనే దేవుణ్ణి, నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు అని జ్ఞాపకముంచుకోండి.
నేనే దేవుణ్ణి, నాలాంటి వాళ్లు ఇంకెవ్వరూ లేరు.
10 మొదటి నుండి నేనే చివరికి ఏమౌతుందో చెప్తున్నాను,
ఎప్పటినుండో నేనే ఇంకా జరగని సంగతుల్ని చెప్తున్నాను.+
‘నా నిర్ణయం నిలుస్తుంది,+
నాకు ఏది ఇష్టమో అదంతా చేస్తాను’ అని నేను చెప్తున్నాను.+