కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 23
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • మంచి కాపరులు, చెడ్డ కాపరులు (1-4)

      • “నీతి మొలక” పరిపాలనలో భద్రత (5-8)

      • అబద్ధ ప్రవక్తల్ని ఖండించడం (9-32)

      • యెహోవా “భారం” (33-40)

యిర్మీయా 23:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 10:21; యెహె 34:2

యిర్మీయా 23:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 34:5

యిర్మీయా 23:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 11:11; 35:10; యిర్మీ 31:8
  • +యెహె 34:14; మీకా 2:12
  • +ద్వితీ 30:3, 5; ఆమో 9:14

యిర్మీయా 23:4

అధస్సూచీలు

  • *

    లేదా “కాసే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 3:15; యోహా 21:15; అపొ 20:28

యిర్మీయా 23:5

అధస్సూచీలు

  • *

    లేదా “వారసుణ్ణి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 11:1; 53:2; యిర్మీ 33:15, 16; జెక 3:8; మత్త 2:23
  • +లూకా 1:32, 33
  • +యెష 9:7; 11:3, 4; 32:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 5/2017, పేజీ 2

యిర్మీయా 23:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 32:37; జెక 14:11
  • +యెష 54:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 5/2017, పేజీ 2

యిర్మీయా 23:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 43:5; జెఫ 3:20

యిర్మీయా 23:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 3:8, 9; 5:7; 13:27; యెహె 22:11
  • +యోవే 1:10

యిర్మీయా 23:11

అధస్సూచీలు

  • *

    లేదా “మతభ్రష్టులయ్యారు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 28:7; యిర్మీ 5:31; యెహె 22:25; జెఫ 3:4
  • +2ది 33:1, 5; యిర్మీ 7:11; యెహె 8:10, 11; 23:39

యిర్మీయా 23:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 16:46

యిర్మీయా 23:14

అధస్సూచీలు

  • *

    అక్ష., “చేతుల్ని బలపరుస్తున్నారు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 29:21, 23
  • +యిర్మీ 23:26
  • +యెష 3:9
  • +ఆది 18:20; ద్వితీ 32:32; యెష 1:10; యూదా 7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీలు 8-9

యిర్మీయా 23:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 8:14; 9:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 9

యిర్మీయా 23:16

అధస్సూచీలు

  • *

    లేదా “వ్యర్థమైన ఆశలతో నింపుతున్నారు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 27:9; 29:8
  • +విలా 2:14
  • +యిర్మీ 14:14; యెహె 13:3; 22:28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 9

యిర్మీయా 23:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 4:10; 6:13, 14; 8:11; యెహె 13:10
  • +మీకా 3:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 11

యిర్మీయా 23:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 25:32; 30:23, 24

యిర్మీయా 23:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 14:14; 27:15; 29:8, 9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 9

యిర్మీయా 23:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 25:4, 5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 11

యిర్మీయా 23:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 16:7, 13; సామె 15:3; ఆమో 9:2; హెబ్రీ 4:13
  • +కీర్త 139:7

యిర్మీయా 23:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 18:20; యిర్మీ 27:9; 29:21, 23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 10

యిర్మీయా 23:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 14:14

యిర్మీయా 23:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 3:7; 2రా 21:1, 3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    6/2019, పేజీ 4

    కావలికోట,

    3/1/1994, పేజీ 10

యిర్మీయా 23:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 5:14
  • +హెబ్రీ 4:12

యిర్మీయా 23:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 18:20; యిర్మీ 14:15; యెహె 13:2, 3

యిర్మీయా 23:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 13:7

యిర్మీయా 23:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +జెఫ 3:4
  • +యిర్మీ 7:8; విలా 2:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 10

యిర్మీయా 23:33

అధస్సూచీలు

  • *

    లేదా “భారమైన సందేశం.” మూలభాష పదానికి రెండు అర్థాలున్నాయి: “బరువైన దైవిక సందేశం” లేదా “ఏదైనా భారమైనది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 12:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2007, పేజీ 11

    3/1/1994, పేజీ 12

యిర్మీయా 23:34

అధస్సూచీలు

  • *

    లేదా “భారమైన సందేశం.”

యిర్మీయా 23:36

అధస్సూచీలు

  • *

    లేదా “భారమైన సందేశం.”

  • *

    లేదా “భారమైన సందేశం.”

యిర్మీయా 23:38

అధస్సూచీలు

  • *

    లేదా “భారమైన సందేశం.”

  • *

    లేదా “భారమైన సందేశం.”

  • *

    లేదా “భారమైన సందేశం.”

యిర్మీయా 23:40

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 24:9; 42:18; విలా 5:20; దాని 9:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీలు 12-13

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 23:1యిర్మీ 10:21; యెహె 34:2
యిర్మీ. 23:2యెహె 34:5
యిర్మీ. 23:3యెష 11:11; 35:10; యిర్మీ 31:8
యిర్మీ. 23:3యెహె 34:14; మీకా 2:12
యిర్మీ. 23:3ద్వితీ 30:3, 5; ఆమో 9:14
యిర్మీ. 23:4యిర్మీ 3:15; యోహా 21:15; అపొ 20:28
యిర్మీ. 23:5యెష 11:1; 53:2; యిర్మీ 33:15, 16; జెక 3:8; మత్త 2:23
యిర్మీ. 23:5లూకా 1:32, 33
యిర్మీ. 23:5యెష 9:7; 11:3, 4; 32:1
యిర్మీ. 23:6యిర్మీ 32:37; జెక 14:11
యిర్మీ. 23:6యెష 54:17
యిర్మీ. 23:8యెష 43:5; జెఫ 3:20
యిర్మీ. 23:10యిర్మీ 3:8, 9; 5:7; 13:27; యెహె 22:11
యిర్మీ. 23:10యోవే 1:10
యిర్మీ. 23:11యెష 28:7; యిర్మీ 5:31; యెహె 22:25; జెఫ 3:4
యిర్మీ. 23:112ది 33:1, 5; యిర్మీ 7:11; యెహె 8:10, 11; 23:39
యిర్మీ. 23:13యెహె 16:46
యిర్మీ. 23:14యిర్మీ 29:21, 23
యిర్మీ. 23:14యిర్మీ 23:26
యిర్మీ. 23:14యెష 3:9
యిర్మీ. 23:14ఆది 18:20; ద్వితీ 32:32; యెష 1:10; యూదా 7
యిర్మీ. 23:15యిర్మీ 8:14; 9:15
యిర్మీ. 23:16యిర్మీ 27:9; 29:8
యిర్మీ. 23:16విలా 2:14
యిర్మీ. 23:16యిర్మీ 14:14; యెహె 13:3; 22:28
యిర్మీ. 23:17యిర్మీ 4:10; 6:13, 14; 8:11; యెహె 13:10
యిర్మీ. 23:17మీకా 3:11
యిర్మీ. 23:19యిర్మీ 25:32; 30:23, 24
యిర్మీ. 23:21యిర్మీ 14:14; 27:15; 29:8, 9
యిర్మీ. 23:22యిర్మీ 25:4, 5
యిర్మీ. 23:24ఆది 16:7, 13; సామె 15:3; ఆమో 9:2; హెబ్రీ 4:13
యిర్మీ. 23:24కీర్త 139:7
యిర్మీ. 23:25ద్వితీ 18:20; యిర్మీ 27:9; 29:21, 23
యిర్మీ. 23:26యిర్మీ 14:14
యిర్మీ. 23:27న్యా 3:7; 2రా 21:1, 3
యిర్మీ. 23:29యిర్మీ 5:14
యిర్మీ. 23:29హెబ్రీ 4:12
యిర్మీ. 23:30ద్వితీ 18:20; యిర్మీ 14:15; యెహె 13:2, 3
యిర్మీ. 23:31యెహె 13:7
యిర్మీ. 23:32జెఫ 3:4
యిర్మీ. 23:32యిర్మీ 7:8; విలా 2:14
యిర్మీ. 23:33యిర్మీ 12:7
యిర్మీ. 23:40యిర్మీ 24:9; 42:18; విలా 5:20; దాని 9:16
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 23:1-40

యిర్మీయా

23 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “నా మందలోని గొర్రెల్ని నాశనం చేస్తూ, వాటిని చెదరగొడుతున్న కాపరులకు శ్రమ!”+

2 కాబట్టి తన ప్రజల్ని కాస్తున్న కాపరుల గురించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: “మీరు నా గొర్రెల్ని చెదరగొట్టారు; వాటిని వెళ్లగొడుతూ వచ్చారు, వాటిని పట్టించుకోలేదు.”+

“కాబట్టి మీ చెడ్డపనుల్ని బట్టి నేను మీ మీద దృష్టిపెడతాను” అని యెహోవా అంటున్నాడు.

3 “తర్వాత నేను నా గొర్రెల్లో మిగిలినవాటిని సమకూరుస్తాను, నేను వాటిని చెదరగొట్టిన దేశాలన్నిటి నుండి వాటిని సమకూర్చి+ తిరిగి వాటి పచ్చికబయళ్ల దగ్గరికి తీసుకొస్తాను.+ అవి పిల్లల్ని కని, వృద్ధి చెందుతాయి.+ 4 వాటిని నిజంగా సంరక్షించే* కాపరుల్ని నేను వాటిమీద నియమిస్తాను.+ అవి ఇక భయపడవు, బెదిరిపోవు, వాటిలో ఒక్కటి కూడా తప్పిపోదు” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

5 “ఇదిగో! నేను దావీదుకు నీతి మొలకను* పుట్టించే రోజులు రాబోతున్నాయి”+ అని యెహోవా అంటున్నాడు. “ఆయన రాజుగా పరిపాలిస్తాడు,+ లోతైన అవగాహన చూపిస్తాడు, దేశంలో నీతిన్యాయాలు జరిగిస్తాడు.+ 6 ఆయన రోజుల్లో యూదా రక్షించబడుతుంది, ఇశ్రాయేలు సురక్షితంగా నివసిస్తుంది.+ ఆయన, ‘యెహోవాయే మన నీతి’ అని పిలవబడతాడు.”+

7 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “అయితే ఒక కాలం రాబోతుంది. అప్పుడు ప్రజలు, ‘ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొచ్చిన యెహోవా జీవం తోడు!’ అని ఇక అనరు; 8 బదులుగా, ‘ఉత్తర దేశం నుండి, తాను ఏయే దేశాలకు వాళ్లను చెదరగొట్టాడో ఆ దేశాలన్నిటి నుండి ఇశ్రాయేలు ఇంటివాళ్ల వంశస్థుల్ని తిరిగి తీసుకొచ్చిన యెహోవా జీవం తోడు!’ అని అంటారు. వాళ్లు తమ స్వదేశంలో నివసిస్తారు.”+

9 ప్రవక్తల విషయానికొస్తే:

నా హృదయం విరిగిపోయింది.

నా ఎముకలన్నీ వణుకుతున్నాయి.

యెహోవా వల్ల, పవిత్రమైన ఆయన మాటల వల్ల

నేను మత్తుగా తాగినవాడిలా,

ద్రాక్షారసం వశంలో ఉన్నవాడిలా ఉన్నాను.

10 దేశం వ్యభిచారులతో నిండిపోయింది;+

శాపం వల్ల దేశం దుఃఖిస్తోంది,+

ఎడారిలోని పచ్చికబయళ్లు ఎండిపోయాయి.

వాళ్ల మార్గం చెడ్డది, వాళ్లు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.

11 “ప్రవక్తలూ, యాజకులూ అపవిత్రులయ్యారు.*+

చివరికి నా మందిరంలో కూడా వాళ్ల దుష్టత్వం కనిపిస్తోంది”+ అని యెహోవా అంటున్నాడు.

12 “కాబట్టి వాళ్ల మార్గం జారుడు నేలలా తయారౌతుంది, చీకటైపోతుంది;

వాళ్లు నెట్టేయబడి పడిపోతారు.

ఎందుకంటే, లెక్క అడిగే సంవత్సరంలో

నేను వాళ్లమీదికి విపత్తు తీసుకొస్తాను” అని యెహోవా అంటున్నాడు.

13 “సమరయ+ ప్రవక్తల్లో నేను అసహ్యమైనది చూశాను.

వాళ్లు బయలు ప్రేరేపణతో ప్రవచనాలు చెప్తున్నారు,

నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని పక్కదారి పట్టిస్తున్నారు.

14 యెరూషలేము ప్రవక్తల్లో నేను భయంకరమైన విషయాలు చూశాను.

వాళ్లు వ్యభిచారం చేస్తున్నారు,+ అబద్ధాలు చెప్తున్నారు;+

చెడ్డవాళ్లను ప్రోత్సహిస్తున్నారు,*

వాళ్లు తమ దుష్టత్వం నుండి పక్కకు తొలగట్లేదు.

వాళ్లంతా నాకు సొదొమలా ఉన్నారు,+

ఆమె నివాసులు గొమొర్రాలా ఉన్నారు.”+

15 కాబట్టి ఆ ప్రవక్తల గురించి సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా చెప్తున్నాడు:

“ఇదిగో నేను వాళ్లకు తినడానికి మాచిపత్రిని,

తాగడానికి విషం కలిపిన నీళ్లను ఇస్తున్నాను.+

ఎందుకంటే యెరూషలేము ప్రవక్తల వల్ల మతభ్రష్టత్వం దేశమంతటా వ్యాపించింది.”

16 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా చెప్తున్నాడు:

“మీకు ప్రవచనాలు చెప్తున్న ప్రవక్తల మాటలు వినకండి.+

వాళ్లు మిమ్మల్ని మోసం చేస్తున్నారు.*

వాళ్లు చెప్పే దర్శనాలు వాళ్ల హృదయాల్లో నుండి వచ్చినవి,+

యెహోవా నోటి నుండి వచ్చినవి కావు.+

17 నేనంటే గౌరవం లేనట్టు ప్రవర్తించేవాళ్లతో వాళ్లు పదేపదే ఇలా చెప్తున్నారు:

‘ “మీరు శాంతిని అనుభవిస్తారు” అని యెహోవా అన్నాడు.’+

తమ మొండి హృదయాన్ని అనుసరించే ప్రతీ ఒక్కరితో,

‘మీ మీదికి ఏ విపత్తూ రాదు’ అని చెప్తున్నారు.+

18 యెహోవా వాక్యాన్ని చూడడానికి, వినడానికి

ఆయన సన్నిహిత ప్రజల మధ్య నిలబడింది ఎవరు?

ఆయన వాక్యం మీద మనసుపెట్టింది ఎవరు? దాన్ని విన్నది ఎవరు?

19 ఇదిగో! యెహోవా ఆగ్రహం తుఫానులా విరుచుకుపడబోతుంది;

భీకరమైన సుడిగాలిలా అది దుష్టుల తలమీద విరుచుకుపడుతుంది.+

20 తన హృదయంలో అనుకున్నది నెరవేర్చే వరకు, దాన్ని పూర్తిచేసే వరకు

యెహోవా కోపం వెనక్కి తిరగదు.

చివరి రోజుల్లో మీరు దీన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటారు.

21 ఆ ప్రవక్తలు నేను పంపకపోయినా పరుగెత్తుకుంటూ వచ్చారు.

నేను వాళ్లతో మాట్లాడకపోయినా ప్రవచించారు.+

22 ఒకవేళ వాళ్లు నా సన్నిహితుల మధ్య నిలబడివుంటే,

నా ప్రజలకు నా మాటలు వినిపించి,

తమ చెడు మార్గాలు, చెడు పనులు విడిచిపెట్టేలా చేసేవాళ్లు.”+

23 “నేను దగ్గర్లో మాత్రమే దేవుణ్ణా? దూరంలో కాదా?” అని యెహోవా అంటున్నాడు.

24 “నాకు కనబడకుండా రహస్య స్థలంలో ఎవరైనా దాక్కోగలరా?”+ అని యెహోవా అంటున్నాడు.

“ఆకాశంలో గానీ భూమ్మీద గానీ నేను చూడలేనిదంటూ ఏదైనా ఉందా?”+ అని యెహోవా అంటున్నాడు.

25 “నా పేరున అబద్ధాలు ప్రవచిస్తున్న ప్రవక్తలు ‘నాకో కల వచ్చింది! నాకో కల వచ్చింది!’ అని అనడం నేను విన్నాను.+ 26 అబద్ధాల్ని ప్రవచించాలనే ఆలోచన ఇంకా ఎంతకాలం ఆ ప్రవక్తల హృదయాల్లో ఉంటుంది? వాళ్లు తమ హృదయంలో ఉన్న మోసాన్ని ప్రవచించే ప్రవక్తలు.+ 27 నా ప్రజలు నా పేరును మర్చిపోయేలా చేయడానికి ఆ ప్రవక్తలు తమ కలల్ని ఒకరికొకరు వివరించుకుంటున్నారు. వాళ్ల తండ్రులు కూడా బయలు వల్ల నా పేరును అలాగే మర్చిపోయారు.+ 28 కల కన్న ప్రవక్త ఆ కలను చెప్పవచ్చు, అయితే నా మాట కలిగివున్న వ్యక్తి నా మాటను ఉన్నదున్నట్టు చెప్పాలి.”

“గడ్డికి, ధాన్యానికి ఏమి పోలిక?” అని యెహోవా అంటున్నాడు.

29 “నా మాట అగ్ని లాంటిది కాదా?+ బండను పగలగొట్టే సుత్తి లాంటిది కాదా?”+ అని యెహోవా అంటున్నాడు.

30 “నా మాటల్ని ఒకరి దగ్గర నుండి ఒకరు దొంగిలించే ప్రవక్తలకు నేను వ్యతిరేకంగా ఉన్నాను” అని యెహోవా అంటున్నాడు.+

31 “తమ సొంత మాటలు చెప్పి, ‘ఆయన ఇలా అంటున్నాడు!’ అనే ప్రవక్తలకు+ నేను వ్యతిరేకంగా ఉన్నాను” అని యెహోవా అంటున్నాడు.

32 “అబద్ధ కలలు కని, వాటిని వివరించి, అబద్ధాలు చెప్తూ గొప్పలు చెప్పుకుంటూ నా ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రవక్తలకు+ నేను వ్యతిరేకంగా ఉన్నాను” అని యెహోవా అంటున్నాడు.

“నేను వాళ్లను పంపలేదు, వాళ్లకు ఆజ్ఞాపించలేదు. కాబట్టి వాళ్ల వల్ల ఈ ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు”+ అని యెహోవా అంటున్నాడు.

33 “ఈ ప్రజలు గానీ ఒక ప్రవక్త గానీ యాజకుడు గానీ ‘యెహోవా భారం* ఏమిటి?’ అని నిన్ను అడిగినప్పుడు, ‘ “మీరే ఆ భారం! నేను మిమ్మల్ని ఎత్తి పారేస్తాను”+ అని యెహోవా అంటున్నాడు’ అని నువ్వు వాళ్లతో చెప్పాలి. 34 ఏ ప్రవక్తయినా, యాజకుడైనా, ప్రజల్లో ఎవరైనా, ‘ఇదే యెహోవా భారం!’* అని అంటే, నేను ఆ వ్యక్తి మీదికి, అతని ఇంటివాళ్ల మీదికి నా దృష్టి మళ్లిస్తాను. 35 మీలో ప్రతీ ఒక్కరు మీ పొరుగువానితో, మీ సహోదరునితో, ‘యెహోవా ఏమని జవాబిచ్చాడు? యెహోవా ఏమన్నాడు?’ అని అంటున్నారు. 36 అయితే యెహోవా భారం* అనే మాట ఇంకెప్పుడూ మీరు అనకూడదు, ఎందుకంటే ఒక వ్యక్తి మాటే అతని భారం.* మీరు జీవంగల దేవుడూ సైన్యాలకు అధిపతీ మన దేవుడూ అయిన యెహోవా మాటల్ని మార్చారు.

37 “నువ్వు ఆ ప్రవక్తతో ఇలా అనాలి: ‘యెహోవా నీకు ఏమని జవాబిచ్చాడు? యెహోవా ఏమన్నాడు? 38 ఒకవేళ మీరు “యెహోవా భారం!”* అని అంటూ ఉంటే, యెహోవా ఇలా అంటున్నాడు: “ ‘ “యెహోవా భారం!”* అని మీరు అనకూడదు’ అని నేను చెప్పిన తర్వాత కూడా మీరు ‘ఈ మాటే యెహోవా భారం!’* అని అంటున్నారు కాబట్టి 39 ఇదిగో! నేను మిమ్మల్ని, మీకూ మీ పూర్వీకులకూ నేను ఇచ్చిన ఈ నగరాన్ని నా ముందు నుండి ఎత్తి పారేస్తాను. 40 మీ మీదికి శాశ్వతమైన తలవంపును, శాశ్వతమైన అవమానాన్ని తీసుకొస్తాను, అది ఎప్పటికీ మరవబడదు.” ’ ”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి