కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన; తంతివాద్యాలతో పాడాలి. మాస్కిల్.* దావీదు కీర్తన.
2 నా ప్రార్థన విని నాకు జవాబివ్వు.+
ఆందోళన వల్ల నాకు మనశ్శాంతి కరువైంది,+
నేను ఎంతో కలవరపడుతున్నాను,
3 శత్రువు మాటల వల్ల,
దుష్టుని ఒత్తిడి వల్ల నేను వేదన పడుతున్నాను.
వాళ్లు నా మీద కష్టాల్ని కుమ్మరిస్తున్నారు,
కోపంతో నా మీద పగ పెంచుకుంటున్నారు.+
5 నేను భయంతో కంపిస్తున్నాను,
తీవ్రమైన భయంతో వణికిపోతున్నాను.
6 నేను ఇలా అంటూ ఉన్నాను: “నాకు పావురంలా రెక్కలుంటే,
ఎగిరిపోయి సురక్షితమైన చోట నివసించేవాణ్ణి.
7 దూరంగా ఎగిరిపోయి,+
ఎడారిలో నివాసం ఉండేవాణ్ణి.+ (సెలా)
8 పెనుగాలి నుండి, తుఫాను నుండి తప్పించుకుని,
సురక్షితమైన స్థలానికి పారిపోయేవాణ్ణి.”
9 యెహోవా, వాళ్లను గందరగోళంలో పడేసి వాళ్ల ఆలోచనల్ని* తారుమారు చేయి,+
ఎందుకంటే నగరంలో దౌర్జన్యం, గొడవలు నాకు కనిపించాయి.
10 అవి పగలూరాత్రీ దాని ప్రాకారాల మీద తిరుగుతున్నాయి;
నగరం ద్వేషంతో, కష్టాలతో నిండిపోయింది.+
11 దాని మధ్యలో నాశనం ఉంది;
అణచివేత, మోసం దాని సంతవీధిని ఎప్పుడూ విడిచివెళ్లవు.+
నా మీదికి లేచినవాడు నా విరోధి అయ్యుంటే,
నేను అతనికి కనిపించకుండా దాక్కునేవాణ్ణి.
14 మనం మధురమైన స్నేహాన్ని ఆస్వాదించేవాళ్లం;
జనసమూహంతో పాటు దేవుని మందిరంలోకి నడిచి వెళ్లేవాళ్లం.
15 నాశనం నా శత్రువుల్ని తరిమి పట్టుకోవాలి!+
వాళ్లు ప్రాణాలతోనే సమాధిలోకి* దిగిపోవాలి;
ఎందుకంటే వాళ్ల నివాసాల్లో, వాళ్ల హృదయాల్లో చెడు ఉంది.
16 నేనైతే దేవునికి మొరపెట్టుకుంటాను,
యెహోవా నన్ను కాపాడతాడు.+
18 నాతో పోరాడుతున్న వాళ్ల నుండి నన్ను రక్షించి,* నాకు ప్రశాంతతను దయచేస్తాడు,
ఎందుకంటే చాలామంది నా మీదికి వస్తున్నారు.+
వాళ్లు మారడానికి ఇష్టపడరు,
వాళ్లకు దేవుడంటే భయం లేదు.+
21 అతని మాటలు వెన్న కన్నా మెత్తగా ఉంటాయి,+
కానీ అతని హృదయం కలహంతో నిండిపోయింది.
అతని మాటలు నూనె కన్నా నునుపుగా ఉంటాయి,
కానీ అవి పదునైన కత్తులు.+
నీతిమంతుల్ని ఆయన ఎన్నడూ పడిపోనివ్వడు.*+
23 కానీ దేవా, నువ్వు దుష్టుల్ని లోతైన గోతిలో పడేస్తావు.+
రక్తపాతం సృష్టించినవాళ్లు, మోసగాళ్లు సగం కాలం కూడా బ్రతకరు.+
నేనైతే నీ మీదే నమ్మకం పెట్టుకుంటాను.