కీర్తనలు
ఆకాశం నుండి యెహోవాను స్తుతించండి;+
ఎత్తైన స్థలాల్లో ఆయన్ని స్తుతించండి.
2 ఆయన దూతలారా, మీరంతా ఆయన్ని స్తుతించండి.+
ఆయన సర్వ సైన్యమా,+ ఆయన్ని స్తుతించు.
3 సూర్యచంద్రులారా, ఆయన్ని స్తుతించండి.
మెరిసే తారలారా, మీరంతా ఆయన్ని స్తుతించండి.+
4 ఆకాశ మహాకాశాల్లారా, ఆకాశం పైనున్న జలాల్లారా,
ఆయన్ని స్తుతించండి.
5 అవి యెహోవా పేరును స్తుతించాలి,
ఎందుకంటే ఆయన ఆజ్ఞాపించినప్పుడు అవి సృష్టించబడ్డాయి.+
7 భూమ్మీద నుండి యెహోవాను స్తుతించండి,
గొప్పగొప్ప సముద్రప్రాణులారా, సమస్త అగాధ జలాల్లారా,
8 మెరుపులారా, వడగండ్లారా; మంచూ, దట్టమైన మేఘాల్లారా,
ఆయన మాటను పాటించే తుఫానూ,+
9 పర్వతాల్లారా, సమస్తమైన కొండల్లారా,+
పండ్ల చెట్లారా, సమస్తమైన దేవదారు వృక్షాల్లారా,+
10 అడవి జంతువుల్లారా,+ సమస్త సాధు జంతువుల్లారా,
పాకే ప్రాణుల్లారా, ఎగిరే పక్షుల్లారా,
11 భూరాజుల్లారా, సమస్త దేశాల్లారా,
అధిపతుల్లారా, భూమ్మీదున్న సమస్త న్యాయముర్తుల్లారా,+
వృద్ధులారా, పిల్లలారా, మీరంతా ఆయన్ని స్తుతించండి.
ఆయన వైభవం భూమ్యాకాశాలకు పైన ఉంది.+
14 తన విశ్వసనీయులందరికీ,
అంటే తనకు సన్నిహితంగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు కీర్తి వచ్చేలా
ఆయన తన ప్రజల బలాన్ని* హెచ్చిస్తాడు.