కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 34
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నిర్గమకాండం విషయసూచిక

      • కొత్త రాతి పలకలు తయారుచేయడం (1-4)

      • మోషే యెహోవా మహిమను చూస్తాడు (5-9)

      • ఒప్పందం వివరాలు మళ్లీ చెప్పడం (10-28)

      • మోషే ముఖం కాంతులు విరజిమ్మింది (29-35)

నిర్గమకాండం 34:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 10:1
  • +నిర్గ 32:19; ద్వితీ 9:17
  • +ద్వితీ 9:10

నిర్గమకాండం 34:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 19:20; 24:12

నిర్గమకాండం 34:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 19:12, 13

నిర్గమకాండం 34:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 7:38
  • +నిర్గ 6:3; 33:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 10/2020, పేజీ 3

నిర్గమకాండం 34:6

అధస్సూచీలు

  • *

    లేదా “దయ.”

  • *

    లేదా “కోప్పడే విషయంలో నిదానించే.”

  • *

    లేదా “ప్రేమపూర్వక దయను.”

  • *

    లేదా “నమ్మకమైనవాడు; ఎల్లప్పుడూ మాట నిలబెట్టుకుంటాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 6:36
  • +నిర్గ 22:27; 2ది 30:9; నెహె 9:17; కీర్త 86:15; యోవే 2:13
  • +సం 14:18; 2పే 3:9
  • +యిర్మీ 31:3; విలా 3:22; మీకా 7:18
  • +కీర్త 31:5; రోమా 2:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 276-278

    కావలికోట (అధ్యయన),

    11/2021, పేజీలు 2-3

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 7

    కావలికోట (అధ్యయన),

    9/2017, పేజీ 8

    కావలికోట,

    10/1/2009, పేజీ 28

    5/15/2005, పేజీలు 23-25

    1/15/2002, పేజీలు 13-15, 17-18

    10/1/1998, పేజీలు 8, 11

    2/1/1991, పేజీ 4

    జ్ఞానము, పేజీలు 28-30

నిర్గమకాండం 34:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 103:12; యెష 55:7; ఎఫె 4:32; 1యో 1:9
  • +ద్వితీ 32:35; 2పే 2:4; యూదా 14, 15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 114-117

    కావలికోట,

    10/1/2009, పేజీ 28

    5/15/2005, పేజీలు 23-25

    1/15/2002, పేజీలు 13, 15, 17-18

    2/1/1991, పేజీలు 4, 6-7

    జ్ఞానము, పేజీలు 28-30

నిర్గమకాండం 34:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 33:14
  • +నిర్గ 33:3

నిర్గమకాండం 34:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 7:23

నిర్గమకాండం 34:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 7:1

నిర్గమకాండం 34:13

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

నిర్గమకాండం 34:14

అధస్సూచీలు

  • *

    అక్ష., “యెహోవా ఆయన పేరు.”

  • *

    లేదా “ప్రత్యర్థుల్ని సహించని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 10:14
  • +యెహో 24:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 125

    కొత్త లోక అనువాదం, పేజీలు 1849-1850

    కావలికోట,

    10/15/2002, పేజీ 28

    9/15/1995, పేజీలు 8-9

నిర్గమకాండం 34:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 10:20
  • +సం 25:2; 2కొ 6:14

నిర్గమకాండం 34:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 9:2
  • +1రా 11:2; నెహె 13:26

నిర్గమకాండం 34:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 32:8

నిర్గమకాండం 34:18

అధస్సూచీలు

  • *

    అనుబంధం B15 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 23:6
  • +నిర్గ 23:15

నిర్గమకాండం 34:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 13:2; లూకా 2:23

నిర్గమకాండం 34:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 13:15; సం 18:15, 16

నిర్గమకాండం 34:21

అధస్సూచీలు

  • *

    లేదా “విశ్రాంతి రోజును ఆచరిస్తారు.”

నిర్గమకాండం 34:22

అధస్సూచీలు

  • *

    పర్ణశాలల (గుడారాల) పండుగ అని కూడా అనేవాళ్లు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:16; లేవీ 23:34

నిర్గమకాండం 34:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 16:16

నిర్గమకాండం 34:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 34:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/1998, పేజీ 20

నిర్గమకాండం 34:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:18
  • +నిర్గ 12:10; సం 9:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/1991, పేజీ 22

నిర్గమకాండం 34:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 18:8, 12; ద్వితీ 26:2; సామె 3:9
  • +నిర్గ 23:19; ద్వితీ 14:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2004, పేజీ 27

నిర్గమకాండం 34:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 24:4; ద్వితీ 31:9, 11
  • +నిర్గ 24:8; ద్వితీ 4:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 179-181

    కావలికోట,

    6/15/2012, పేజీ 26

నిర్గమకాండం 34:28

అధస్సూచీలు

  • *

    యెహోవాను సూచిస్తుందని స్పష్టమౌతోంది.

  • *

    అక్ష., “ఆ పది మాటల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 9:18
  • +నిర్గ 31:18; ద్వితీ 10:2

నిర్గమకాండం 34:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 32:15

నిర్గమకాండం 34:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 3:7

నిర్గమకాండం 34:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 24:3; ద్వితీ 1:3

నిర్గమకాండం 34:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 3:13

నిర్గమకాండం 34:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 3:16
  • +ద్వితీ 27:10

నిర్గమకాండం 34:35

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఆయనతో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 3:7, 13

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నిర్గ. 34:1ద్వితీ 10:1
నిర్గ. 34:1నిర్గ 32:19; ద్వితీ 9:17
నిర్గ. 34:1ద్వితీ 9:10
నిర్గ. 34:2నిర్గ 19:20; 24:12
నిర్గ. 34:3నిర్గ 19:12, 13
నిర్గ. 34:5అపొ 7:38
నిర్గ. 34:5నిర్గ 6:3; 33:19
నిర్గ. 34:6లూకా 6:36
నిర్గ. 34:6నిర్గ 22:27; 2ది 30:9; నెహె 9:17; కీర్త 86:15; యోవే 2:13
నిర్గ. 34:6సం 14:18; 2పే 3:9
నిర్గ. 34:6యిర్మీ 31:3; విలా 3:22; మీకా 7:18
నిర్గ. 34:6కీర్త 31:5; రోమా 2:2
నిర్గ. 34:7కీర్త 103:12; యెష 55:7; ఎఫె 4:32; 1యో 1:9
నిర్గ. 34:7ద్వితీ 32:35; 2పే 2:4; యూదా 14, 15
నిర్గ. 34:9నిర్గ 33:14
నిర్గ. 34:9నిర్గ 33:3
నిర్గ. 34:102స 7:23
నిర్గ. 34:11ద్వితీ 7:1
నిర్గ. 34:141కొ 10:14
నిర్గ. 34:14యెహో 24:19
నిర్గ. 34:151కొ 10:20
నిర్గ. 34:15సం 25:2; 2కొ 6:14
నిర్గ. 34:16ఎజ్రా 9:2
నిర్గ. 34:161రా 11:2; నెహె 13:26
నిర్గ. 34:17నిర్గ 32:8
నిర్గ. 34:18లేవీ 23:6
నిర్గ. 34:18నిర్గ 23:15
నిర్గ. 34:19నిర్గ 13:2; లూకా 2:23
నిర్గ. 34:20నిర్గ 13:15; సం 18:15, 16
నిర్గ. 34:22నిర్గ 23:16; లేవీ 23:34
నిర్గ. 34:23ద్వితీ 16:16
నిర్గ. 34:24నిర్గ 34:11
నిర్గ. 34:25నిర్గ 23:18
నిర్గ. 34:25నిర్గ 12:10; సం 9:12
నిర్గ. 34:26సం 18:8, 12; ద్వితీ 26:2; సామె 3:9
నిర్గ. 34:26నిర్గ 23:19; ద్వితీ 14:21
నిర్గ. 34:27నిర్గ 24:4; ద్వితీ 31:9, 11
నిర్గ. 34:27నిర్గ 24:8; ద్వితీ 4:13
నిర్గ. 34:28ద్వితీ 9:18
నిర్గ. 34:28నిర్గ 31:18; ద్వితీ 10:2
నిర్గ. 34:29నిర్గ 32:15
నిర్గ. 34:302కొ 3:7
నిర్గ. 34:32నిర్గ 24:3; ద్వితీ 1:3
నిర్గ. 34:332కొ 3:13
నిర్గ. 34:342కొ 3:16
నిర్గ. 34:34ద్వితీ 27:10
నిర్గ. 34:352కొ 3:7, 13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నిర్గమకాండం 34:1-35

నిర్గమకాండం

34 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నీ కోసం మొదటి పలకల లాంటి రెండు రాతి పలకల్ని చెక్కు.+ నువ్వు పగలగొట్టిన ఆ మొదటి రాతి పలకల+ మీదున్న మాటల్ని నేను వాటిమీద రాస్తాను.+ 2 ఉదయం కోసం సిద్ధంగా ఉండు, ఎందుకంటే ఉదయం నువ్వు సీనాయి పర్వతం మీదికి ఎక్కి అక్కడ దాని శిఖరం పైన నా ముందు నిలబడతావు.+ 3 అయితే నీతోపాటు ఎవరూ పైకి ఎక్కకూడదు. నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఆ పర్వతం మీద ఎక్కడా కనిపించకూడదు. కనీసం మందలు, పశువులు కూడా ఆ పర్వతం ముందు మేయకూడదు.”+

4 కాబట్టి మోషే మొదటి రాతి పలకల లాంటి రెండు రాతి పలకల్ని చెక్కి, పొద్దున్నే లేచి యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టే సీనాయి పర్వతం మీదికి ఎక్కాడు; అతను ఆ రెండు రాతి పలకల్ని తన చేతిలో పట్టుకొని వెళ్లాడు. 5 అప్పుడు యెహోవా మేఘంలో దిగివచ్చి,+ అతనితోపాటు అక్కడ నిలబడి, యెహోవా అనే తన పేరును ప్రకటించాడు.+ 6 యెహోవా అతని ముందు నుండి దాటివెళ్తూ ఇలా ప్రకటించాడు: “యెహోవా, యెహోవా, ఆయన కరుణ,+ కనికరం*+ గల దేవుడు; ఓర్పును,*+ అపారమైన విశ్వసనీయ ప్రేమను*+ చూపించే దేవుడు; ఎంతో సత్యవంతుడు;*+ 7 ఆయన వేలమంది పట్ల విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడు; తప్పుల్ని, అపరాధాల్ని, పాపాల్ని మన్నిస్తాడు;+ అయితే దోషిని శిక్షించకుండా అస్సలు విడిచిపెట్టడు;+ మూడునాలుగు తరాల వరకు తండ్రుల దోషశిక్షను కుమారుల మీదికి, మనవళ్ల మీదికి రప్పిస్తాడు.”

8 మోషే వెంటనే వంగి నేలమీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. 9 తర్వాత అతను ఇలా అన్నాడు: “యెహోవా, ఇప్పుడు నీ దృష్టిలో నేను అనుగ్రహం పొందివుంటే, యెహోవా, దయచేసి నువ్వు కూడా మా మధ్యవుండి మాతోపాటు రా;+ మేము తలబిరుసు ప్రజలమే,+ అయితే మా తప్పుల్ని, పాపాల్ని క్షమించి మమ్మల్ని నీ సొత్తుగా చేసుకో.” 10 దానికి ఆయనిలా అన్నాడు: “ఇదిగో, నేను ఒక ఒప్పందం చేస్తున్నాను: భూమంతట గానీ, దేశాలన్నిటి మధ్య గానీ ఎప్పుడూ జరగని అద్భుతమైన పనుల్ని నేను నీ ప్రజలందరి ముందు చేస్తాను;+ నువ్వు ఎవరి మధ్యైతే నివసిస్తున్నావో ఆ ప్రజలందరూ యెహోవా చేసే పనిని చూస్తారు; నేను నీ కోసం చేసే పని సంభ్రమాశ్చర్యాలు పుట్టిస్తుంది.

11 “ఈ రోజు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న దాని మీద మనసుపెట్టు. ఇదిగో నేను మీ ముందు నుండి అమోరీయుల్ని, కనానీయుల్ని, హిత్తీయుల్ని, పెరిజ్జీయుల్ని, హివ్వీయుల్ని, యెబూసీయుల్ని వెళ్లగొడుతున్నాను.+ 12 మీరు ఏ దేశానికి వెళ్తున్నారో ఆ దేశ ప్రజలతో ఒప్పందం చేసుకోకుండా జాగ్రత్తపడండి, లేదంటే అది మీకు ఉచ్చుగా తయారయ్యే అవకాశముంది. 13 అయితే మీరు వాళ్ల బలిపీఠాల్ని కూలగొట్టాలి, వాళ్ల పూజా స్తంభాల్ని పగలగొట్టాలి, వాళ్లు నిలబెట్టిన పూజా కర్రల్ని* విరగ్గొట్టాలి. 14 నువ్వు వేరే దేవుడికి వంగి నమస్కారం చేయకూడదు,+ ఎందుకంటే యెహోవా అంటేనే* సంపూర్ణ భక్తిని కోరుకునే* వ్యక్తి. అవును, ఆయన సంపూర్ణ భక్తిని కోరుకునే దేవుడు.+ 15 ఆ దేశ నివాసులతో ఒప్పందం చేసుకోకుండా జాగ్రత్తపడు. ఎందుకంటే వాళ్లు తమ దేవుళ్లను పూజించడం ద్వారా వ్యభిచారం చేసి, వాటికి బలులు అర్పించినప్పుడు,+ ఎవరో ఒకరు నిన్ను కూడా పిలుస్తారు, అప్పుడు నువ్వు ఆ బలి అర్పించినదాన్ని తింటావు.+ 16 తర్వాత నువ్వు వాళ్ల కూతుళ్లను నీ కుమారులకిచ్చి పెళ్లిచేస్తావు.+ వాళ్ల కూతుళ్లు తమ దేవుళ్లను పూజించడం ద్వారా వాటితో వ్యభిచరించి, నీ కుమారుల్ని కూడా ఆ దేవుళ్లను పూజించేలా, అలా వాటితో వ్యభిచరించేలా చేస్తారు.+

17 “నువ్వు పోతపోసిన దేవుళ్లను తయారు చేయకూడదు.+

18 “మీరు పులవని రొట్టెల పండుగ ఆచరించాలి.+ నేను మీకు ముందే ఆజ్ఞాపించినట్టు మీరు పులవని రొట్టెలు తింటారు. అబీబు* నెలలో నియమిత సమయంలో ఏడురోజుల పాటు మీరు అలా చేయండి.+ ఎందుకంటే, ఐగుప్తు నుండి మీరు బయటికి వచ్చింది అబీబు నెలలోనే.

19 “మొదట పుట్టిన ప్రతీ మగ సంతానం నాదే;+ నీ పశువులన్నిట్లో ప్రతీ మగ సంతానం నాదే, అది ఎద్దే గానీ, గొర్రే గానీ. 20 మొదట పుట్టే గాడిద పిల్లను గొర్రెతో విడిపించాలి. ఒకవేళ దాన్ని విడిపించకపోతే దాని మెడను విరగ్గొట్టాలి. నీ కుమారుల్లో కూడా మొదట పుట్టిన ప్రతీ ఒక్కర్ని విడిపించాలి.+ ఎవ్వరూ నా ముందు వట్టి చేతులతో కనిపించకూడదు.

21 “ఆరు రోజులు మీరు పని చేయాలి, అయితే ఏడో రోజున మీరు విశ్రాంతి తీసుకుంటారు.* అది దున్నే కాలమైనా సరే, కోత కాలమైనా సరే మీరు విశ్రాంతి తీసుకుంటారు.

22 “గోధుమల కోతలోని మొదటి ధాన్యం గింజలతో మీరు వారాల పండుగను ఆచరిస్తారు; అలాగే సంవత్సరం చివర్లో, సమకూర్చే పండుగను* కూడా ఆచరిస్తారు.+

23 “సంవత్సరంలో మూడుసార్లు మీలోని పురుషులంతా నిజమైన ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ముందు కనిపించాలి.+ 24 ఎందుకంటే నేను మీ ముందు నుండి జనాల్ని వెళ్లగొట్టి+ మీ ప్రాంతాన్ని విస్తరింపజేస్తాను; సంవత్సరంలో మూడుసార్లు యెహోవా ముఖం చూడడానికి మీరు వెళ్తున్నప్పుడు ఎవ్వరూ మీ భూమిని ఆశించరు.

25 “నాకు అర్పించే బలుల రక్తంలో పులిసిందేదీ కలపకూడదు.+ పస్కా పండుగప్పుడు అర్పించే బలిని తెల్లారేవరకు ఉండనియ్యకూడదు.+

26 “నీ భూమిలో మొదట పండిన ఫలాల్లో శ్రేష్ఠమైనవాటిని నీ దేవుడైన యెహోవా మందిరానికి తీసుకురావాలి.+

“మేకపిల్లను దాని తల్లి పాలలో ఉడకబెట్టకూడదు.”+

27 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: “ఈ మాటల్ని నువ్వు రాసిపెట్టాలి,+ ఎందుకంటే ఈ మాటల ప్రకారమే నేను నీతో, అలాగే ఇశ్రాయేలీయులతో ఒప్పందం చేస్తున్నాను.”+ 28 అతను అక్కడ యెహోవాతో 40 పగళ్లు, 40 రాత్రులు ఉన్నాడు. అతను ఆహారం తినలేదు, నీళ్లు తాగలేదు.+ ఆయన* ఆ రాతి పలకల మీద ఆ ఒప్పంద మాటల్ని, అంటే ఆ పది ఆజ్ఞల్ని* రాశాడు.+

29 తర్వాత మోషే సీనాయి పర్వతం నుండి కిందికి దిగివచ్చాడు, సాక్ష్యంగా ఉండే ఆ రెండు రాతి పలకలు అతని చేతిలో ఉన్నాయి.+ మోషే పర్వతం నుండి కిందికి దిగివచ్చినప్పుడు, అతను అప్పటివరకూ దేవునితో మాట్లాడుతూ ఉండడంవల్ల అతని ముఖచర్మం కాంతులు విరజిమ్మింది; కానీ మోషేకు ఆ విషయం తెలియలేదు. 30 అహరోను, ఇశ్రాయేలీయులు మోషేను చూసినప్పుడు, అతని ముఖచర్మం కాంతులు విరజిమ్మడం గమనించి అతని దగ్గరికి వెళ్లడానికి భయపడ్డారు.+

31 అయితే మోషే వాళ్లను తన దగ్గరికి రమ్మని పిలిచాడు. దాంతో అహరోను, అలాగే ఆ ప్రజల ప్రధానులందరూ మోషే దగ్గరికి వచ్చారు; అతను వాళ్లతో మాట్లాడాడు. 32 తర్వాత ఇశ్రాయేలీయులందరూ అతని దగ్గరికి వచ్చారు, అప్పుడతను సీనాయి పర్వతం మీద యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ వాళ్లకు అందజేశాడు.+ 33 వాళ్లతో మాట్లాడడం అయిపోగానే మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునేవాడు.+ 34 అయితే మోషే యెహోవాతో మాట్లాడడానికి ఆయన ముందుకు వెళ్లేటప్పుడు ఆ ముసుగు తీసేసేవాడు; అక్కడి నుండి బయటికి వచ్చేవరకు ముసుగు వేసుకునేవాడు కాదు.+ అతను బయటికి వచ్చాక, తాను అందుకున్న ఆజ్ఞల్ని ఇశ్రాయేలీయులకు తెలియజేసేవాడు.+ 35 మోషే ముఖచర్మం కాంతులు విరజిమ్మడం ఇశ్రాయేలీయులు చూసేవాళ్లు; మోషే తిరిగి దేవునితో* మాట్లాడడానికి లోపలికి వెళ్లేవరకు తన ముఖం మీద ముసుగు వేసుకునేవాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి