కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • es25 పేజీలు 108-118
  • నవంబరు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నవంబరు
  • ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2025
  • ఉపశీర్షికలు
  • శనివారం, నవంబరు 1
  • ఆదివారం, నవంబరు 2
  • సోమవారం, నవంబరు 3
  • మంగళవారం, నవంబరు 4
  • బుధవారం, నవంబరు 5
  • గురువారం, నవంబరు 6
  • శుక్రవారం, నవంబరు 7
  • శనివారం, నవంబరు 8
  • ఆదివారం, నవంబరు 9
  • సోమవారం, నవంబరు 10
  • మంగళవారం, నవంబరు 11
  • బుధవారం, నవంబరు 12
  • గురువారం, నవంబరు 13
  • శుక్రవారం, నవంబరు 14
  • శనివారం, నవంబరు 15
  • ఆదివారం, నవంబరు 16
  • సోమవారం, నవంబరు 17
  • మంగళవారం, నవంబరు 18
  • బుధవారం, నవంబరు 19
  • గురువారం, నవంబరు 20
  • శుక్రవారం, నవంబరు 21
  • శనివారం, నవంబరు 22
  • ఆదివారం, నవంబరు 23
  • సోమవారం, నవంబరు 24
  • మంగళవారం, నవంబరు 25
  • బుధవారం, నవంబరు 26
  • గురువారం, నవంబరు 27
  • శుక్రవారం, నవంబరు 28
  • శనివారం, నవంబరు 29
  • ఆదివారం, నవంబరు 30
ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2025
es25 పేజీలు 108-118

నవంబరు

శనివారం, నవంబరు 1

“పిల్లలు, చంటిబిడ్డలు నిన్ను స్తుతించేలా చేశావు.”—మత్త. 21:16.

మీటింగ్స్‌లో ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఇంకా ఏం చేయవచ్చు? మీరు తల్లిదండ్రులైతే, మీ పిల్లల వయసుకు తగ్గట్టు కామెంట్‌ ప్రిపేర్‌ అయ్యేలా సహాయం చేయండి. అయితే, కొన్నిసార్లు భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు లేదా నైతిక విషయాలు లాంటి పెద్దపెద్ద అంశాల గురించి చర్చిస్తుండవచ్చు. అలాంటప్పుడు, పిల్లలకు ఒకటో రెండో పేరాలకు కామెంట్‌ చెప్పే అవకాశం ఉండవచ్చు. అలాగే చెయ్యెత్తిన ప్రతీసారి వాళ్లను ఎందుకు అడగకపోవచ్చో అర్థమయ్యేలా పిల్లలకు చెప్పండి. అలా చెప్తే వేరేవాళ్లను అడిగినప్పుడు వాళ్లు చిన్నబుచ్చుకోకుండా ఉంటారు. (1 తిమో. 6:18) యెహోవాను ఘనపర్చే, తోటి క్రైస్తవుల్ని ప్రోత్సహించే కామెంట్స్‌ మనందరం ప్రిపేర్‌ అవ్వొచ్చు. (సామె. 25:11) అయితే, అప్పుడప్పుడు మన సొంత అనుభవాన్ని చెప్పడం తప్పుకాదు. కానీ మన గురించే ఎక్కువగా చెప్పకుండా జాగ్రత్తపడాలి. (సామె. 27:2; 2 కొరిం. 10:18) దానికి బదులు మన కామెంట్స్‌ యెహోవా, ఆయన వాక్యం, ఆయన ప్రజల చుట్టూ తిరిగితే బాగుంటుంది.—ప్రక. 4:11. w23.04 24-25 ¶17-18

ఆదివారం, నవంబరు 2

“ఇతరుల్లా మనం నిద్రపోకుండా మెలకువగా ఉందాం, మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకుందాం.”—1 థెస్స. 5:6.

మనం మెలకువగా ఉండాలన్నా, మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకోవాలన్నా ప్రేమ చాలా ముఖ్యం. (మత్త. 22:37-39) మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టి, ప్రీచింగ్‌లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని సహిస్తాం. (2 తిమో. 1:7, 8) అంతేకాదు, యెహోవాను ఆరాధించని వాళ్లను కూడా ప్రేమిస్తాం కాబట్టి, మనం ప్రీచింగ్‌ చేస్తూనే ఉంటాం. ఆఖరికి టెలిఫోన్‌ ద్వారా, ఉత్తరాల ద్వారా కూడా అలా చేస్తాం. మన ఇరుగుపొరుగువాళ్లు ఏదోకరోజు మారి, సరైనది చేయడం మొదలుపెడతారనే ఆశను మనం ఎప్పుడూ వదులుకోం. (యెహె. 18:27, 28) మనం మన తోటి బ్రదర్స్‌, సిస్టర్స్‌ని కూడా ప్రేమిస్తాం. “ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు బలపర్చుకుంటూ” ఉండడం ద్వారా మనం అలా ప్రేమ చూపిస్తాం. (1 థెస్స. 5:11) యుద్ధంలో సైనికులు ఒకరికొకరు మద్దతిచ్చుకున్నట్టే, మనం కూడా ఒకరినొకరం ప్రోత్సహించుకుంటాం. మనం కావాలని ఎప్పుడూ మన బ్రదర్స్‌, సిస్టర్స్‌ని నొప్పించం లేదా హాని చేసినవాళ్లకు తిరిగి హాని చేయం. (1 థెస్స. 5:13, 15) అంతేకాదు, సంఘంలో నాయకత్వం వహిస్తున్న బ్రదర్స్‌ని గౌరవించడం ద్వారా కూడా మనం ప్రేమను చూపించవచ్చు.—1 థెస్స. 5:12. w23.06 10 ¶6; 11 ¶10-11

సోమవారం, నవంబరు 3

“[యెహోవా] ఏమైనా చెప్తే, దాన్ని చేయకుండా ఉంటాడా?”—సంఖ్యా. 23:19.

యేసు చేసిన ప్రాణ త్యాగం గురించి ధ్యానించడం ద్వారా మన విశ్వాసాన్ని బలపర్చుకోవచ్చు. యెహోవా చెప్పిన మాటలన్నీ ఖచ్చితంగా నిజమౌతాయని ఆ త్యాగం భరోసా ఇస్తుంది. యెహోవా ఆ త్యాగాన్ని ఎందుకు చేశాడో, అది ఎందుకు అంత పెద్ద త్యాగమో జాగ్రత్తగా ఆలోచించండి. అలా చేసినప్పుడు యెహోవా మాటిచ్చిన శాశ్వత జీవితం ఖచ్చితంగా వస్తుందనే మన విశ్వాసం బలపడుతుంది. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే యెహోవా ఎంత పెద్ద త్యాగం చేశాడో ఆలోచించండి. ఆయన తన ఒక్కగానొక్క కుమారుణ్ణి, తనకు ఎంతో చేదోడువాదోడుగా ఉన్న కుమారుణ్ణి, పరిపూర్ణ మనిషిగా పరలోకం నుండి భూమ్మీదకు పంపించాడు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు మనిషి పడ్డ ప్రతీ కష్టాన్ని పడ్డాడు. అలాగే ఆయన అష్టకష్టాలుపడి, చివరికి బాధాకరంగా చనిపోయాడు. అవన్నీ అనుమతించడం ద్వారా యెహోవా ఎంత పెద్ద త్యాగం చేశాడో కదా! మనం కొంతకాలం సంతోషంగా ఉండి, ఆ తర్వాత ఆవిరైపోయే జీవితం కోసం మన ప్రియ పరలోక తండ్రి అంత త్యాగం చేసుంటాడా? కాదు కదా. (యోహా. 3:16; 1 పేతు. 1:18, 19) యెహోవా అంత పెద్ద త్యాగం చేశాడంటే, కొత్త లోకంలో మనకు ఖచ్చితంగా ఆయుష్షు నిండిపోని జీవితాన్ని ఇస్తాడు. w23.04 27 ¶8-9

మంగళవారం, నవంబరు 4

“మరణమా, నీ విషపు కొండ్లు ఎక్కడ?”—హోషే. 13:14.

చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికించాలనే కోరిక యెహోవాకు ఉందా? నిస్సందేహంగా. ఎందుకంటే, పునరుత్థానం గురించి ఆయన బైబిల్లో రాయించాడు. (యెష. 26:19; ప్రక. 20:11-13) నిజానికి యెహోవా ఏదైనా మాటిచ్చాడంటే నూటికినూరు శాతం దాన్ని నిలబెట్టుకుంటాడు. (యెహో. 23:14) యెహోవా చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికించాలని పరితపిస్తున్నాడు. యోబు చెప్పిన మాటల గురించి ఆలోచించండి. ఒకవేళ అతను చనిపోయినా తనను మళ్లీ బ్రతికించాలని యెహోవా బలంగా కోరుకుంటున్నాడని అతను నమ్మాడు. (యోబు 14:14, 15) చనిపోయిన తన ఆరాధకులందర్నీ తిరిగి బ్రతికించాలని యెహోవా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. వాళ్లందర్నీ బ్రతికించి, వాళ్లకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ఇవ్వాలని ఆయన ఆరాటపడుతున్నాడు. మరి యెహోవా గురించి తెలుసుకునే అవకాశం దొరక్కముందే చనిపోయిన కోటానుకోట్ల మంది సంగతేంటి? మన దేవుడు ఎంత ప్రేమగలవాడంటే, వాళ్లను కూడా లేపాలని ఆయన ఎదురుచూస్తున్నాడు. (అపొ. 24:15) వాళ్లు కూడా ఆయనకు స్నేహితులై, భూమ్మీద ఎప్పటికీ జీవించే అవకాశం వాళ్లకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు.—యోహా. 3:16. w23.04 9 ¶5-6

బుధవారం, నవంబరు 5

“దేవుణ్ణి బట్టి మేము బలం పొందుతాం.”—కీర్త. 108:13.

భవిష్యత్తు మీదున్న ఆశను మీరెలా బలపర్చుకోవచ్చు? ఉదాహరణకు, మీరు భూమ్మీద శాశ్వతకాలం జీవించాలనే ఆశతో ఉంటే, పరదైసు గురించి బైబిలు ఏం చెప్తుందో చదివి, దానిగురించి బాగా ఆలోచించండి. (యెష. 25:8; 32:16-18) కొత్తలోకంలో మీరున్నట్టు, అక్కడ జీవిస్తున్నట్టు ఊహించుకోండి. మన మనసంతా కొత్తలోకం గురించిన ఆలోచనతో నిండి ఉంటే మన సమస్యలు ‘కొంతకాలమే ఉంటాయని, అవి చాలా చిన్నవి’ అని అనిపిస్తాయి. (2 కొరిం. 4:17) అలా యెహోవా మనకు ఇచ్చిన నిరీక్షణ ద్వారా మనం బలాన్ని పొందుతాం. మనకు కావల్సిన బలాన్ని ఇవ్వడానికి యెహోవా ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు చేసిపెట్టాడు. కాబట్టి ఒక నియామకాన్ని చేయడానికి, ఏదైనా కష్టాన్ని తట్టుకోవడానికి, మన సంతోషాన్ని కాపాడుకోవడానికి కావల్సిన సహాయం కోసం ప్రార్థనలో యెహోవాను అడగండి. వ్యక్తిగత అధ్యయనం చేసి, ఆయన నిర్దేశం కోసం వెదకండి. తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌ ఇచ్చే ప్రోత్సాహాన్ని తీసుకోండి. భవిష్యత్తు మీద మీ హృదయంలో నాటుకున్న ఆశకు నీళ్లు పోస్తూ ఉండండి. అప్పుడు “మీరు ఓర్పుతో, సంతోషంతో అన్నిటినీ సహించేలా దేవుని గొప్పశక్తి మీకు కావాల్సిన బలాన్ని” ఇస్తుంది.—కొలొ. 1:11. w23.10 17 ¶19-20

గురువారం, నవంబరు 6

“ప్రతీ విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పండి.”—1 థెస్స. 5:18.

ప్రార్థనలో యెహోవాకు థ్యాంక్స్‌ చెప్పడానికి చాలా కారణాలున్నాయి. మన దగ్గరున్న మంచివాటన్నిటికీ ఆయనకు థ్యాంక్స్‌ చెప్పవచ్చు. ఎంతైనా మన దగ్గరున్న మంచివన్నీ ఆయన ఇచ్చినవే కదా! (యాకో. 1:17) ఉదాహరణకు భూమిని, ఈ విశ్వంలో ఉన్న వింతలు-విశేషాలు అన్నిటినీ అందంగా చెక్కినందుకు మనం థ్యాంక్స్‌ చెప్పవచ్చు. వీటితోపాటు జీవాన్ని, కుటుంబాన్ని, స్నేహితుల్ని, బ్రతకడానికి ఒక ఆశను ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్‌ చెప్పవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా, ఆయనతో ఒక మంచి స్నేహాన్ని కలిగి ఉండేలా సహాయం చేసినందుకు థ్యాంక్స్‌ చెప్పవచ్చు. మనం యెహోవాకు వేటినిబట్టి థ్యాంక్స్‌ చెప్పాలో సమయం తీసుకుని ఆలోచించాలి. ఎందుకంటే, కృతజ్ఞత కనుమరుగైన లోకంలో మనం జీవిస్తున్నాం. ప్రజలు ఎంతసేపూ తమకు ఏం కావాలో ఆలోచిస్తున్నారే గానీ, తమకు ఉన్నవాటిని బట్టి థ్యాంక్స్‌ చెప్పట్లేదు. ఒకవేళ మనం ఈ లోక మైకంలో పడిపోతే, మన ప్రార్థనలు కూడా కోరికల చిట్టాలా మిగిలిపోతాయి. అలా జరగకూడదంటే, యెహోవా మనకోసం ఏం చేశాడో ఆలోచిస్తూ థ్యాంక్స్‌ చెప్తూ ఉండాలి.—లూకా 6:45. w23.05 4 ¶8-9

శుక్రవారం, నవంబరు 7

“ఏమాత్రం సందేహించకుండా విశ్వాసంతో అడుగుతూ ఉండాలి.”—యాకో. 1:6.

ఒక ప్రేమగల తండ్రిగా మనం బాధపడుతుంటే యెహోవా చూసి తట్టుకోలేడు. (యెష. 63:9) అలాగని మనకొచ్చే ప్రతీ కష్టానికి ఆయన అడ్డుపడడు. మనకొచ్చే కష్టాల్ని నదులతో, అగ్నిజ్వాలలతో బైబిలు పోలుస్తుంది. (యెష. 43:2) అయితే, మనం వాటన్నిటిని దాటడానికి యెహోవా సహాయం చేస్తానని మాటిస్తున్నాడు. అంతేకాదు, మన కష్టాల వల్ల మనకు శాశ్వతంగా హాని జరిగేలా ఆయన అనుమతించడు. వాటిని తట్టుకోవడానికి కావల్సిన శక్తిని తన పవిత్రశక్తి ద్వారా మనకు ఇస్తాడు. (లూకా 11:13; ఫిలి. 4:13) దానివల్ల యెహోవాకు నమ్మకంగా ఉండడానికి, మన కష్టాల్ని తట్టుకోవడానికి సరిగ్గా అవసరమైనవి యెహోవా ఇస్తాడు. మనం ఆయన్ని నమ్మాలని యెహోవా ఆశిస్తున్నాడు. (హెబ్రీ. 11:6) కొన్నిసార్లు మన కష్టాలు మనల్ని ఊపిరాడకుండా చేయవచ్చు. ఇక వాటిని ఎవ్వరూ తీర్చలేరని మనకు అనిపించవచ్చు. యెహోవా అయినా దీన్ని తీర్చగలడా అనే సందేహం కూడా రావచ్చు. కానీ దేవుని పవిత్రశక్తి సహాయంతో మనం “ప్రాకారం” కూడా ‘దూకగలం’ అని బైబిలు అభయమిస్తుంది. (కీర్త. 18:29) కాబట్టి మన కష్టాల్ని ఎవ్వరూ తీర్చలేరని కుమిలిపోయే బదులు, యెహోవా మన ప్రార్థనలకు జవాబిస్తాడనే పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఆయనకు ప్రార్థన చేయాలి.—యాకో. 1:6, 7. w23.11 22 ¶8-9

శనివారం, నవంబరు 8

“[ప్రేమ] జ్వాలలు అగ్ని జ్వాలలు, అది యెహోవా పుట్టించే జ్వాల. ఉప్పొంగే జలాలు ప్రేమను ఆర్పలేవు, నదీ ప్రవాహాలు దాన్ని ముంచేయలేవు.”—పరమ. 8:6, 7.

నిజమైన ప్రేమను ఎంత రమణీయంగా వర్ణించారో కదా! భార్యాభర్తలు ఒకరిమీద ఒకరు చూపించుకునే ప్రేమ ఎప్పటికీ కరిగిపోకుండా ఉండడం సాధ్యమే అని ఆ మాటలు పెళ్లయిన వాళ్లలో ఆశను పుట్టిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎప్పటికీ ఉంటుందా లేదా అనేది వాళ్ల చేతుల్లోనే ఉంది. ఉదాహరణకు, ఒక చలిమంటకు ఎప్పటికీ వెలిగే సామర్థ్యం ఉంది. కానీ అది ఎప్పటికీ వెలుగుతూ ఉండాలంటే కట్టెలు వేస్తూ ఉండాలి. దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఆ మంట ఆరిపోయే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్యున్న ప్రేమ కూడా ఎప్పటికీ ఉండొచ్చు. కానీ ఆ ప్రేమ ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్లదే. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, పిల్లల్ని పెంచడం వంటివాటిలో తలమునకలవ్వడం వల్ల తమ మధ్యున్న ప్రేమ చల్లారిపోతుందని భార్యాభర్తలకు అనిపించవచ్చు. అందుకే, “యెహోవా పుట్టించే జ్వాల” ఆరిపోకుండా ఉండడానికి భార్యాభర్తలు యెహోవాతో తమకున్న బంధాన్ని బలపర్చుకుంటూ ఉండాలి. w23.05 20-21 ¶1-3

ఆదివారం, నవంబరు 9

“భయపడకు.”—దాని. 10:19.

మనం ఎలా ధైర్యాన్ని పెంచుకోవచ్చు? మన తల్లిదండ్రులు ధైర్యంగా ఉండమని మనకు చెప్తుండొచ్చు. కానీ వాళ్లు ఆస్తిని వారసత్వంగా ఇచ్చినట్టు ధైర్యాన్ని ఇవ్వలేరు. ధైర్యాన్ని పెంచుకోవడం ఒక కొత్త కళ నేర్చుకోవడం లాంటిది. ఆ కళలో ఆరితేరిపోవాలంటే దాన్ని నేర్పిస్తున్నవాళ్లను బాగా గమనిస్తూ, వాళ్లు చేసినట్టే చేయాలి. అదేవిధంగా మనం ధైర్యాన్ని పెంచుకోవాలంటే, ఆ లక్షణాన్ని చూపిస్తున్న వాళ్లను బాగా గమనిస్తూ, వాళ్లు చేసినట్టే చేయాలి. దానియేలులాగే మనం కూడా దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకుని ఉండాలి. మన మనసులో ఉన్నదంతా యెహోవాతో చెప్తూ, ఆయనతో ఎక్కువసార్లు మాట్లాడుతూ, ఆయనతో విడిపోని బంధాన్ని ఏర్పర్చుకోవాలి. ఆయన ఎప్పుడూ మన వెన్నంటే ఉన్నాడనే నమ్మకాన్ని చూపించాలి. అలా చేస్తే, మన విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉంటాం. ధైర్యం చూపిస్తే చాలా సందర్భాల్లో ఇతరులు మనల్ని గౌరవిస్తారు. అంతేకాదు సరైన హృదయస్థితి ఉన్నవాళ్లు యెహోవావైపు ఆకర్షింపబడవచ్చు. కాబట్టి మనం ధైర్యాన్ని పెంచుకోవడానికి మంచి కారణాలే ఉన్నాయి. w23.08 2 ¶2; 4 ¶8-9

సోమవారం, నవంబరు 10

‘అన్నిటినీ పరీక్షించండి.’—1 థెస్స. 5:21.

“పరీక్షించి” అనే పదాన్ని గ్రీకులో బంగారం, వెండి లాంటి లోహాలు అసలైనవో కావో తెలుసుకునే సందర్భంలో ఉపయోగించేవాళ్లు. అదేవిధంగా, మన కంటపడ్డ లేదా చెవినపడ్డ విషయం నిజమో కాదో పరీక్షించి తెలుసుకోవాలి. మహాశ్రమ దగ్గరపడుతుండగా మనకు ఈ సలహా చాలా ప్రాముఖ్యం. వేరేవాళ్లు చెప్పేవాటిని అమాయకంగా నమ్మే బదులు మన ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించి, మన కంటపడ్డ లేదా చెవినపడ్డ విషయం బైబిలు చెప్పేవాటితో, యెహోవా సంస్థ చెప్పేవాటితో సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవాలి. అలా చేసినప్పుడు సాతాను చేసే ప్రచారానికి మనం పడిపోము. (సామె. 14:15; 1 తిమో. 4:1) ఒక గుంపుగా యెహోవా సేవకులు మహాశ్రమను దాటుతారు. కానీ, మనలో ఒక్కొక్కరికి రేపేమి జరుగుతుందో తెలీదు. (యాకో. 4:14) అయితే, మనం బ్రతికున్నప్పుడే మహాశ్రమ వచ్చినా లేదా మహాశ్రమ రాకముందే చనిపోయినా, నమ్మకంగా ఉంటే శాశ్వత జీవితం అనే బహుమానాన్ని పొందుతాం. కాబట్టి మనందరం, మనకున్న అద్భుతమైన నిరీక్షణ మీద మనసుపెట్టి, యెహోవా రోజు కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉందాం! w23.06 13 ¶15-16

మంగళవారం, నవంబరు 11

‘ఆయన తన సేవకులకు తన రహస్యాన్ని తెలియజేశాడు.’—ఆమో. 3:7.

కొన్ని బైబిలు ప్రవచనాలు ఎలా నెరవేరతాయో మనకు తెలీదు. (దాని. 12:8, 9) అయితే ఒక ప్రవచనం మనకు అర్థం కానంత మాత్రాన అది నిజమవ్వదని కాదు. గతంలోలాగే యెహోవా మనం తెలుసుకోవాల్సిన వాటిని సరైన సమయంలో మనకు తెలియజేస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అనే ప్రకటన జరుగుతుంది. (1 థెస్స. 5:3) తర్వాత ఈ లోక రాజకీయ శక్తులు అబద్ధమతం మీద దాడిచేసి, దాన్ని నాశనం చేస్తాయి. (ప్రక. 17:16, 17) ఆ తర్వాత అవి దేవుని ప్రజల మీద దాడి చేస్తాయి. (యెహె. 38:18, 19) ఈ సంఘటనలన్నీ చివరి యుద్ధమైన హార్‌మెగిద్దోన్‌కు నడిపిస్తాయి. (ప్రక. 16:14, 16) ఇవన్నీ అతి త్వరలోనే జరుగుతాయి అనే నమ్మకంతో మనం ఉండవచ్చు. అప్పటివరకు బైబిలు ప్రవచనాల మీద మనసుపెట్టడం ద్వారా, అలా మనసుపెట్టేలా ఇతరులకు సహాయం చేయడం ద్వారా మన ప్రేమగల పరలోక తండ్రి మీద కృతజ్ఞత ఉందని చూపిస్తూ ఉందాం. w23.08 13 ¶19-20

బుధవారం, నవంబరు 12

“మనం ఒకరినొకరం ప్రేమిస్తూనే ఉందాం; ఎందుకంటే ప్రేమకు మూలం దేవుడు.”—1 యోహా. 4:7.

అపొస్తలుడైన పౌలు విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు, “వీటిలో అన్నిటికన్నా గొప్పది ప్రేమే” అని అన్నాడు. (1 కొరిం. 13:13) ఆయన ఎందుకలా అన్నాడు? ఎందుకంటే భవిష్యత్తులో, కొత్తలోకం గురించి దేవుడిచ్చిన మాట మీద విశ్వాసం, నిరీక్షణ ఉంచాల్సిన అవసరం ఇక ఉండదు. అవి అప్పటికే మన కళ్లముందు జరిగిపోయి ఉంటాయి. కానీ ప్రేమ అలాకాదు. అప్పుడు కూడా మనం యెహోవా మీద, మనుషుల మీద ప్రేమ చూపిస్తూనే ఉండాలి. నిజం చెప్పాలంటే, వాళ్లమీద ఉన్న ఆ ప్రేమ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. అంతేకాదు, ప్రేమ నిజక్రైస్తవుల గుర్తింపు. యేసు తన అపొస్తలులతో ఇలా చెప్పాడు: “మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది.” (యోహా. 13:35) ఇంకో కారణం ఏంటంటే, ప్రేమ మనల్ని ఐక్యం చేస్తుంది. అందుకే పౌలు, ప్రేమ “పూర్తిస్థాయిలో ఐక్యం చేస్తుంది” అని అన్నాడు. (కొలొ. 3:14) అంతేకాదు, మనం ఒకరిమీద ఒకరం ప్రేమ చూపించుకుంటే దేవుని మీద ప్రేమ ఉందని చూపిస్తాం. అపొస్తలుడైన యోహాను తన తోటి క్రైస్తవులకు ఇలా రాశాడు: “దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి తన సహోదరుణ్ణి కూడా ప్రేమించాలి.”—1 యోహా. 4:21. w23.11 8 ¶1, 3

గురువారం, నవంబరు 13

‘ప్రతీ బరువును వదిలేయండి.’—హెబ్రీ. 12:1.

క్రైస్తవుల జీవితాన్ని బైబిలు ఒక పరుగుపందెంతో పోలుస్తుంది. పరుగుపందాన్ని విజయవంతంగా పూర్తి చేసేవాళ్లు శాశ్వత జీవితం అనే బహుమానాన్ని దక్కించుకుంటారు. (2 తిమో. 4:7, 8) మనం ఆ పరుగుపందెంలో పరుగెత్తుతూ ఉండడానికి ఎడతెగక ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం గెలుపు గీతకు కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నాం. మనం ఆ పందెంలో గెలుపును సొంతం చేసుకోవడానికి ఏం చేయాలో అపొస్తలుడైన పౌలు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “ప్రతీ బరువును . . . వదిలేసి, మన ముందున్న పరుగుపందెంలో ఓపిగ్గా పరుగెత్తుదాం.” అంటే, మనం ఇక ఏ బరువును మోయకూడదని ఆయన ఉద్దేశమా? కాదు. బదులుగా అనవసరమైన బరువుల్ని దించేసుకోమని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే అవి మనం పరుగుపందెంలో వెనకపడేలా లేదా అలసిపోయేలా చేయవచ్చు. కాబట్టి అలాంటి బరువుల్ని మనం వెంటనే గుర్తించి, వాటిని దించేసుకోవాలి. అదే సమయంలో మనం మోయాల్సిన బరువుల్ని దించేయకూడదు. అలా దించేస్తే, మనం ఆ పరుగుపందెంలో ఉండే అర్హత కోల్పోతాం.—2 తిమో. 2:5. w23.08 26 ¶1-2

శుక్రవారం, నవంబరు 14

“మీరు పైకి కనిపించే అలంకరణ మీద . . . దృష్టిపెట్టకండి.”—1 పేతు. 3:3.

సహేతుకత ఉంటే వేరేవాళ్ల అభిప్రాయాల్ని లేదా ఇష్టాల్ని గౌరవిస్తాం. ఉదాహరణకు, కొంతమంది సిస్టర్స్‌కి మేకప్‌ వేసుకోవడం అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకొంతమందికి ఇష్టంలేకపోవచ్చు. కొంతమంది క్రైస్తవులు కాస్త మందు తాగాలనుకోవచ్చు, ఇంకొంతమంది అస్సలు తాగాలనుకోకపోవచ్చు. మనందరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం, దానికోసం రకరకాల ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలనుకుంటాం. అయితే, మన అభిప్రాయాన్ని వేరేవాళ్ల మీద రుద్దడానికి ప్రయత్నిస్తే, సంఘంలో వాళ్లను అభ్యంతర పెట్టే అవకాశం ఉంది, విభజనలు సృష్టించే ప్రమాదం ఉంది. (1 కొరిం. 8:9; 10:23, 24) ఉదాహరణకు, మనం ఇలాగే బట్టలు వేసుకోవాలని యెహోవా చెప్పలేదు కానీ కొన్ని సూత్రాల్ని ఇచ్చాడు. మనం దేవునికి మహిమ తీసుకొచ్చేలా, సహేతుకత, అణకువ, “మంచి వివేచన” ఉట్టిపడే బట్టల్ని వేసుకోవాలి. (1 తిమో. 2:9, 10) కాబట్టి ఇతరుల దృష్టి అనవసరంగా మనవైపుకు వచ్చే బట్టల్ని మనం వేసుకోం. అయితే బట్టలు, హేర్‌స్టయిల్స్‌ విషయంలో సంఘ పెద్దలు అనవసరమైన రూల్స్‌ పెట్టకుండా బైబిలు సూత్రాలు వాళ్లకు సహాయం చేస్తాయి. w23.07 23-24 ¶13-14

శనివారం, నవంబరు 15

“నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, మంచి ఆహారాన్ని తినండి, అప్పుడు మీరు నిజంగా పుష్టికరమైన వాటిని తిని ఎంతో సంతోషిస్తారు.”—యెష. 55:2.

మన భవిష్యత్తు ఎలా సుఖసంతోషాలతో నిండివుంటుందో యెహోవా చెప్తున్నాడు. పెద్దగా అరుస్తున్న “మూర్ఖురాలు” ఇచ్చే ఆహ్వానాన్ని తీసుకున్నవాళ్లు, అనైతిక విషయాల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. వాళ్లు చేసే పనులు, వాళ్లను ‘సమాధి లోతుల్లోకి’ నెట్టేస్తున్నాయి. (సామె. 9:13, 17, 18) “నిజమైన తెలివి” ఇచ్చే ఆహ్వానాన్ని తీసుకున్నవాళ్ల భవిష్యత్తు చాలా వేరుగా ఉంటుంది. (సామె. 9:1) మనం యెహోవా ప్రేమించే వాటిని ప్రేమిస్తూ, అసహ్యించుకునే వాటిని అసహ్యించుకోవడం నేర్చుకుంటున్నాం. (కీర్త. 97:10) అంతేకాదు, “నిజమైన తెలివి” నుండి ప్రయోజనం పొందమని వేరేవాళ్లను కూడా సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. మనం ఒక విధంగా, “ఎత్తైన స్థలాల్లో” నిలబడి చాటించే సేవకుల్లా ఇలా చెప్తున్నాం: “అనుభవంలేని వాళ్లంతా ఇక్కడికి రావాలి.” ఆ ఆహ్వానాన్ని తీసుకుని స్పందించే వాళ్లకు అలాగే మనకు, ఇప్పుడే కాదు ఎప్పటికీ ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు, “అవగాహనా మార్గంలో ముందుకు” సాగుతుండగా శాశ్వతకాలం జీవించే అవకాశం దొరుకుతుంది.—సామె. 9:3, 4, 6. w23.06 24 ¶17-18

ఆదివారం, నవంబరు 16

“కోప్పడే విషయంలో నిదానించేవాడు బలశాలి కన్నా బలవంతుడు, తన కోపాన్ని అదుపు చేసుకునేవాడు నగరాన్ని జయించేవాడి కన్నా శక్తిమంతుడు.”—సామె. 16:32.

మీతో పనిచేసే వ్యక్తి లేదా క్లాస్‌మేట్‌ మీ నమ్మకాల గురించి ప్రశ్నిస్తే మీకెలా అనిపిస్తుంది? కంగారుగా అనిపిస్తుందా? మనలో చాలామందికి అలా అనిపించవచ్చు. వాళ్లు అలా అడగడం వల్ల వాళ్ల ఆలోచన ఏంటో లేదా వాళ్ల నమ్మకాలు ఏంటో అర్థం చేసుకుంటాం. అలాగే వాళ్లతో మంచివార్త చెప్పే అవకాశం దొరుకుతుంది. అయితే కొన్నిసార్లు మనతో వాదించడానికి కూడా కొంతమంది ప్రశ్నలు అడగవచ్చు. అలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు మనం ఆశ్చర్యపోం. ఎందుకంటే బహుశా కొంతమంది మన నమ్మకాల గురించి వాళ్లకు తప్పుగా చెప్పుంటారు. (అపొ. 28:22) దానికితోడు మనం “చివరి రోజుల్లో” జీవిస్తున్నాం కాబట్టి చాలామంది ‘మొండివాళ్లుగా, క్రూరులుగా’ ఉంటున్నారు. (2 తిమో. 3:1, 3) ‘నా నమ్మకాల గురించి ఎవరైనా వాదిస్తే నేనెలా మృదువుగా ఉండగలను?’ అని మీకు అనిపించవచ్చు. మరి మీకేది సహాయం చేస్తుంది? ఒక్కమాటలో చెప్పాలంటే, సౌమ్యత అనే లక్షణం. సౌమ్యంగా ఉండే వ్యక్తి కోపం తెప్పించే పరిస్థితిలో కూడా లేదా చిరాకుగా ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాడు. w23.09 14 ¶1-2

సోమవారం, నవంబరు 17

“నువ్వు వాళ్లను భూమంతటా అధిపతులుగా నియమిస్తావు.”—కీర్త. 45:16.

కొన్నిసార్లు, డబ్బును ప్రేమించే, దేవుని నియమాల్ని పక్కన పెట్టేసే లాంటి పనులు చేయకుండా ఉండమని సంస్థ మనకు సలహా ఇస్తుంది. అది పాటించడం మనకే మంచిది. (యెష. 48:17, 18; 1 తిమో. 6:9, 10) మహాశ్రమ సమయంలో, వెయ్యేండ్ల పరిపాలనలో కూడా యెహోవా మనల్ని నడిపించడానికి మనుషుల్ని ఉపయోగిస్తాడు. మరప్పుడు వాళ్లు చెప్పేది వింటామా? దానికి జవాబు, యెహోవా ఇచ్చే నిర్దేశానికి మనం ఇప్పుడు ఎలా స్పందిస్తాం అనే దానిమీద ఆధారపడివుంటుంది. కాబట్టి యెహోవా ఇచ్చే నిర్దేశాన్ని, ఆఖరికి మన ప్రాణాల మీద కాపలాగా ఉంచిన సహోదరుల నిర్దేశాన్ని కూడా పాటిస్తూ ఉందాం. (యెష. 32:1, 2; హెబ్రీ. 13:17) అలా చేసినప్పుడు, మనమీద ఆధ్యాత్మికంగా ఒక్క గీత కూడా పడకుండా కొత్తలోకంలో శాశ్వత జీవితమనే మన గమ్యానికి తీసుకెళ్లే మన గైడ్‌ యెహోవా మీద పూర్తి నమ్మకాన్ని చూపిస్తాం! w24.02 25 ¶17-18

మంగళవారం, నవంబరు 18

“దేవుని అపారదయ వల్లే మీరు రక్షణ పొందారు.”—ఎఫె. 2:5.

అపొస్తలుడైన పౌలు యెహోవా సేవను ఎంతో ఆనందించాడు. కానీ అన్నిసార్లు అది పూలబాటలా లేదు. ఆయనకు చాలా ఎత్తుపల్లాలు కూడా ఎదురయ్యాయి. పౌలు తరచూ దూర ప్రయాణాలు చేసేవాడు. అప్పట్లో ఆ ప్రయాణాలు ముప్పుతో కూడినవి. అలా ప్రయాణిస్తున్నప్పుడు పౌలు కొన్నిసార్లు “నదుల్లో, దొంగల చేతుల్లో, . . . ప్రమాదాలు ఎదుర్కొన్నాడు.” ఇంకొన్నిసార్లయితే శత్రువులు ఆయన్ని కొట్టారు. (2 కొరిం. 11:23-27) అంతేకాదు, కొన్నిసార్లు ఏ క్రైస్తవులకు సహాయం చేయడానికి పౌలు అంత కష్టపడ్డాడో వాళ్లే ఆయనకు కృతజ్ఞత చూపించలేదు, అవసరంలో తోడుగా నిలబడలేదు. (2 కొరిం. 10:10; ఫిలి. 4:15) మరి పౌలు యెహోవా సేవను కొనసాగించడానికి ఏది సహాయం చేసింది? ఆయన లేఖనాల నుండి అలాగే తన సొంత అనుభవం నుండి యెహోవా గురించి ఎంతో నేర్చుకున్నాడు. దాంతో యెహోవా దేవుడు తనను ప్రేమిస్తున్నాడనే నమ్మకం పౌలుకు కుదిరింది. (రోమా. 8:38, 39; ఎఫె. 2:4, 5) అలా పౌలు కూడా యెహోవాను ఎంతో ప్రేమించాడు. ఆయన ‘పవిత్రులకు సేవచేశాడు, ఇంకా సేవ చేస్తూనే’ ఉండడం ద్వారా యెహోవా మీద తనకున్న ప్రేమను చూపించాడు.—హెబ్రీ. 6:10. w23.07 9 ¶5-6

బుధవారం, నవంబరు 19

“పై అధికారాలకు లోబడివుండాలి.”—రోమా. 13:1.

ప్రభుత్వాలు ఉండడం మంచిదని, ఆ ప్రభుత్వాలు పెట్టే నియమాల్లో కొన్నింటినైనా పాటించడం సరైనదని చాలామంది ప్రజలు ఒప్పుకుంటారు. కానీ, ప్రభుత్వం పెట్టే నియమాలు నచ్చకపోయినా లేదా అన్యాయంగా అనిపించినా లోబడడానికి చాలామందికి మనసు రాదు. ప్రభుత్వాలు సాతాను చెప్పుచేతల్లో ఉన్నాయని, వాటివల్ల మనకు ఇబ్బందులు ఎదురౌతాయని, ఆ ప్రభుత్వాలు త్వరలోనే నాశనమౌతాయని బైబిలు చెప్తుంది. (కీర్త. 110:5, 6; ప్రసం. 8:9; లూకా 4:5, 6) మరోవైపు, “అధికారాన్ని ఎదిరించే వ్యక్తి దేవుని ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాడు” అని కూడా బైబిలు చెప్తుంది. అయితే, ఈ ప్రపంచం గందరగోళంగా తయారవ్వకూడదని యెహోవా ఈ ప్రభుత్వాల్ని ఉండనిస్తున్నాడు. కాబట్టి ప్రభుత్వాలకు “ఏమి ఇవ్వాలో అది ఇచ్చేయాలి.” అంటే ట్యాక్స్‌లు కట్టాలి, ప్రభుత్వ అధికారులకు గౌరవమర్యాదలు ఇవ్వాలి, లోబడాలి. (రోమా. 13:1-7) కొన్నిసార్లు, ప్రభుత్వం పెట్టే నియమాలు మనకు ఇబ్బందిగా, అన్యాయంగా, దోచుకున్నట్టుగా అనిపించవచ్చు. అయినా సరే, మనం వాటికి లోబడతాం. ఎందుకంటే వాళ్లకు లోబడితే, మనం యెహోవాకు లోబడినట్టే. కాబట్టి, యెహోవా ఆజ్ఞలకు అడ్డురానంతవరకు మనం ప్రభుత్వాలకు లోబడుతూనే ఉండాలి!—అపొ. 5:29. w23.10 8 ¶9-10

గురువారం, నవంబరు 20

“యెహోవా పవిత్రశక్తి సమ్సోనును శక్తిమంతుణ్ణి చేసింది.”—న్యాయా. 15:14.

సమ్సోను పుట్టేనాటికి ఇశ్రాయేలు దేశాన్ని ఫిలిష్తీయులు పరిపాలిస్తున్నారు. (న్యాయా. 13:1) వాళ్లు చాలా క్రూరంగా ఉంటూ ఇశ్రాయేలీయుల్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. అయితే, “ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయుల్ని” రక్షించడానికి యెహోవా సమ్సోనును ఎంచుకున్నాడు. (న్యాయా. 13:5) ఆ పని పూర్తి చేయాలంటే సమ్సోను యెహోవా మీద ఆధారపడాలి. ఒకసారి ఫిలిష్తీయుల సైన్యం లేహీలో సమ్సోనును పట్టుకోవడానికి మకాం వేసింది. బహుశా అది యూదాలో ఒక ప్రాంతం అయ్యుంటుంది. అయితే, యూదా ప్రజలు ఫిలిష్తీయులకు భయపడిపోయి సమ్సోనును వాళ్లకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. తన సొంత ప్రజలే సమ్సోనును రెండు కొత్త తాళ్లతో బంధించి, ఫిలిష్తీయుల దగ్గరికి తీసుకొచ్చారు. (న్యాయా. 15:9-13) “అప్పుడు యెహోవా పవిత్రశక్తి సమ్సోనును శక్తిమంతుణ్ణి చేసింది.” దాంతో సమ్సోను ఆ తాళ్లను దారాల్లా తెంపేసుకున్నాడు. తర్వాత అతనికి అక్కడ “మగ గాడిద పచ్చి దవడ ఎముక ఒకటి కనిపించింది.” అతను దాన్ని తీసుకుని, వెయ్యిమంది ఫిలిష్తీయుల్ని చంపేశాడు.—న్యాయా. 15:14-16. w23.09 2 ¶3-4

శుక్రవారం, నవంబరు 21

“ఇది మన ప్రభువైన క్రీస్తుయేసుకు సంబంధించి దేవుడు అనుకున్న నిత్య సంకల్పానికి అనుగుణంగా ఉంది.”—ఎఫె. 3:11.

యెహోవా బైబిల్లో తన ‘నిత్య సంకల్పాన్ని’ క్రమక్రమంగా చెప్తూ వచ్చాడు. ఆయన ఆరు నూరైనా నూరు ఆరైనా తన సంకల్పాన్ని సాధిస్తాడు. ఎందుకంటే ఆయన “ప్రతీది తన సంకల్పం కోసం తయారుచేశాడు.” (సామె. 16:4) అంతేకాదు, ఆయన చేసినవన్నీ ఎప్పటికీ నిలిచివుంటాయి. ఇంతకీ యెహోవా సంకల్పం ఏంటి? ఆయన దాన్ని సాధించడానికి ఎలాంటి సర్దుబాట్లు చేసుకున్నాడు? దేవుడు మనుషుల విషయంలో తన సంకల్పం ఏంటో ఆదాముహవ్వలకు చెప్పాడు. వాళ్లు ‘పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యి, భూమిని నింపాలని, దాన్ని లోబర్చుకోవాలని, భూమ్మీద కదిలే ప్రతీ జీవిని ఏలాలని’ ఆయన చెప్పాడు. (ఆది. 1:28) కానీ, ఆదాముహవ్వలు ఎదురు తిరిగినప్పుడు మనుషులందరికీ పాపం చుట్టుకుంది. అంతమాత్రాన యెహోవా సంకల్పం అక్కడితో ఆగిపోలేదు. దాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ఇంకో మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయన వెంటనే మనుషుల విషయంలో, భూమి విషయంలో తన మొట్టమొదటి సంకల్పాన్ని నెరవేర్చడానికి ఒక రాజ్యాన్ని పరలోకంలో స్థాపించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.—మత్త. 25:34. w23.10 20 ¶6-7

శనివారం, నవంబరు 22

“యెహోవా నాకు సహాయం చేసుండకపోతే, నేను త్వరగా నశించిపోయేవాణ్ణి.”—కీర్త. 94:17.

పట్టుదలతో ముందుకు సాగడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడు. అయితే ఒకే బలహీనతతో చాలాకాలంగా పోరాడుతూ ఉంటే అలా ముందుకు సాగడం అంత ఈజీ కాకపోవచ్చు. బహుశా, అపొస్తలుడైన పేతురుతో పోలిస్తే మన బలహీనతలు ఇంకా పెద్దవై ఉండొచ్చు. అయినాసరే, మనం ఆశ వదులుకోకుండా పట్టుదల చూపించడానికి యెహోవా సహాయం చేస్తాడు. (కీర్త. 94:18, 19) ఈ అనుభవాన్ని పరిశీలించండి. ఒక బ్రదర్‌ సత్యం తెలుసుకోక ముందు చాలా సంవత్సరాలపాటు స్వలింగ సంపర్కునిగా ఉండేవాడు. కానీ అలాంటి జీవితాన్ని పూర్తిగా వదిలేసి బైబిలుకు తగ్గట్టు బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. అయినాసరే, కొన్నిసార్లు తప్పుడు కోరికలు ఆయనకు వస్తూనే ఉండేవి. మరి వాటితో పోరాడుతూ ముందుకెళ్లడానికి ఆయనకు ఏం సహాయం చేసింది? ఆయన ఇలా అంటున్నాడు: ‘యెహోవా నాకు సహాయం చేస్తున్నాడు. పవిత్రశక్తి సహాయంతో దేవునికి నచ్చినట్టు జీవించడం నేర్చుకున్నాను. అందుకే యెహోవా నన్ను కూడా తన సేవలో ఉపయోగించుకుంటున్నాడు. నాకు బలహీనతలు ఉన్నాసరే ఆయన నన్ను వదిలేయలేదు.’ w23.09 23 ¶12

ఆదివారం, నవంబరు 23

“వినయం, యెహోవా పట్ల భయభక్తులు ఉంటే ఐశ్వర్యం, ఘనత, జీవం వస్తాయి.”—సామె. 22:4.

యౌవన సహోదరుల్లారా, క్రైస్తవులుగా పరిణతి సాధించడం దానంతటికి అదే జరిగేది కాదు. దానికోసం కృషి చేయాలి. మంచివాళ్లను ఆదర్శంగా తీసుకోండి, మీ ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుకోండి, నమ్మకస్థులుగా ఉండండి, మీ జీవితంలో ఉపయోగపడే నైపుణ్యాల్ని సంపాదించుకోండి, భవిష్యత్తులో పొందబోయే బాధ్యతల కోసం సిద్ధపడండి. ఇవన్నీ విన్నాక, ఇవి చేయడం మీవల్ల కాదని మీకనిపించవచ్చు. కానీ మీరు చేయగలరు! యెహోవా మీకు సహాయం చేయాలని ఎంతో ఎదురుచూస్తున్నాడు. (యెష. 41:10, 13) అంతేకాదు, సంఘంలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌ కూడా మీకు సహాయం చేస్తారు. మీరు పరిణతి సాధించినప్పుడు మీ జీవితం సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. యౌవన సహోదరుల్లారా మీరంటే మాకు చాలా ఇష్టం. పరిణతి సాధించడానికి మీరు చేస్తున్న ప్రతీ పనిని యెహోవా దీవించాలని మేము ఆశిస్తున్నాం! w23.12 29 ¶19-20

సోమవారం, నవంబరు 24

‘తప్పును పట్టించుకోకుండా ఉండండి.’—సామె. 19:11.

ఒక సందర్భంలో మీరు కొంతమంది బ్రదర్స్‌సిస్టర్స్‌తో కలిసి ఒక గ్రూప్‌ ఫోటో దిగారు అనుకోండి. ఒకటి బాగోకపోతే ఇంకోటైనా బాగుంటుంది కదా అని రెండుమూడు ఫోటోలు దిగారు. అయితే, అందులో ఒక ఫోటోలో ఒక బ్రదర్‌ నవ్వట్లేదని మీరు గమనించారు. కాబట్టి ఆ ఫోటోను డిలీట్‌ చేసేసి, ఆ బ్రదర్‌తో సహా అందరూ నవ్వుతున్న ఫోటోను మీ దగ్గర ఉంచుకుంటారు. సాధారణంగా మనందరికి మన బ్రదర్స్‌సిస్టర్స్‌తో గడిపిన ఎన్నో మధుర క్షణాలు గుర్తుంటాయి. కానీ ఏదోక సందర్భంలో ఒక బ్రదరో సిస్టరో మనల్ని నొప్పిస్తే, వాటిని గుర్తుపెట్టుకుంటామా లేక సరిగ్గా రాని ఫోటోలా డిలీట్‌ చేసేస్తామా? (ఎఫె. 4:32) అవును, డిలీట్‌ చేసేయాలి! ఎందుకంటే వాళ్లతో గడిపిన మధుర క్షణాలు మనకెన్నో ఉన్నాయి. అవి మనకు ఎంతో విలువైనవి కాబట్టి వాటినే గుర్తుంచుకోవాలి. w23.11 12-13 ¶16-17

మంగళవారం, నవంబరు 25

‘స్త్రీలు దైవభక్తిగల స్త్రీలకు తగినట్టు గౌరవప్రదమైన బట్టలతో తమను తాము అలంకరించుకోవాలి.’—1 తిమో. 2:9, 10.

ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదాలు, క్రైస్తవ స్త్రీలు పద్ధతిగా, ఇతరులకు అభ్యంతరం కలిగించని బట్టలు వేసుకోవాలని సూచిస్తున్నాయి. ఈ సలహాను పాటిస్తున్న ప్రియ సహోదరీల్లారా, మిమ్మల్ని చూసి మేమెంతో గర్వపడుతున్నాం! పరిణతి సాధించడానికి సహోదరీలకు ఉండాల్సిన ఇంకొక లక్షణం వివేచన. వివేచన అంటే ఏంటి? తప్పొప్పుల్ని గుర్తించి, సరైనది చేసే సామర్థ్యం. అబీగయీలు ఉదాహరణ గమనించండి. ఆమె భర్త ఒక చెడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఇంట్లో వాళ్లందరి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు వెంటనే అబీగయీలు ఒక చర్య తీసుకుంది. ఆమె అలా మంచి వివేచన చూపించడం వల్ల అందరి ప్రాణాలు కాపాడగలిగింది. (1 సమూ. 25:14-23, 32-35) వివేచన ఉంటే ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో తెలుస్తుంది. అలాగే, ఇతరుల విషయాల్లో మరీ ఎక్కువ జోక్యం చేసుకోకుండానే వాళ్ల మీద ఎలా శ్రద్ధ చూపించాలో తెలుస్తుంది.—1 థెస్స. 4:11. w23.12 20 ¶8-9

బుధవారం, నవంబరు 26

“దేవుని మహిమను పొందే నిరీక్షణ మనకు ఉంది కాబట్టి మనం సంతోషిద్దాం.”—రోమా. 5:2.

అపొస్తలుడైన పౌలు ఈ మాటల్ని రోములో ఉన్న సంఘానికి రాశాడు. అక్కడున్న బ్రదర్స్‌సిస్టర్స్‌ యెహోవా గురించి, యేసు గురించి నేర్చుకున్నారు. అంతేకాదు, వాళ్లు నేర్చుకున్న వాటిమీద విశ్వాసం చూపించి క్రైస్తవులుగా మారారు. అందుకే, దేవుడు వాళ్ల విశ్వాసాన్నిబట్టి వాళ్లను “నీతిమంతులుగా” ఎంచాడు, అలాగే పవిత్రశక్తితో అభిషేకించాడు. (రోమా. 5:1) దాంతో వాళ్లు ఖచ్చితంగా నిజమయ్యే అద్భుతమైన నిరీక్షణ పొందారు. పౌలు ఆ తర్వాత ఎఫెసులోని అభిషిక్త క్రైస్తవులకు దేవుడిచ్చిన నిరీక్షణ గురించి రాశాడు. వాళ్లు “పవిత్రులకు స్వాస్థ్యంగా” ఇచ్చిన నిరీక్షణను పొందుతారు. (ఎఫె. 1:18) అంతేకాదు, కొలొస్సయి సంఘంలోనివాళ్లు ఎదురుచూస్తున్నది ఎక్కడ పొందుతారో కూడా పౌలు చెప్పాడు. ఆయన దాన్ని “పరలోకంలో మీకోసం సిద్ధంగా ఉన్నవాటి మీద మీకున్న నిరీక్షణ” అని పిలిచాడు. (కొలొ. 1:4, 5) కాబట్టి ఆ అభిషిక్త క్రైస్తవులకు ఉన్న నిరీక్షణ ఏంటంటే, పరలోకంలో శాశ్వతంగా జీవించడానికి పునరుత్థానమై, క్రీస్తుతోపాటు పరిపాలించడం.—1 థెస్స. 4:13-17; ప్రక. 20:6. w23.12 9 ¶4-5

గురువారం, నవంబరు 27

“మానవ అవగాహనకు మించిన దేవుని శాంతి క్రీస్తుయేసు ద్వారా మీ హృదయాలకు, మీ మనసులకు కాపలా ఉంటుంది.”—ఫిలి. 4:7.

“కాపలా” అనే పదం మిలిటరీ వాళ్లకు ఉపయోగించే పదం నుండి వచ్చింది. ఒక నగరం మీద దాడి జరగకుండా కాపలా కాసే సైనికుల్ని సూచించడానికి ఆ పదం వాడేవాళ్లు. ఆ నగరాన్ని కాపలా కాయడానికి సైనికులు ఉన్నారనే ధైర్యంతో అందులో ఉన్న ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయేవాళ్లు. అదేవిధంగా, దేవుని శాంతి మన హృదయాలకు, మనసులకు కాపలా ఉన్నప్పుడు మనం సురక్షితంగా ఉన్నామని తెలుసుకుని ప్రశాంతంగా ఉండగలుగుతాం. (కీర్త. 4:8) నిజమే, మనం ప్రార్థన చేసిన వెంటనే మన పరిస్థితులు మారకపోవచ్చు. కానీ హన్నాలా కొంతవరకు ప్రశాంతంగా ఉండగలుగుతాం. (1 సమూ. 1:16-18) అలా ఉన్నప్పుడు సరిగ్గా ఆలోచించి, తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మనమేం చేయవచ్చు? మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మిమ్మల్ని కాపాడమని యెహోవాను పిలవండి. అదెలా చేయవచ్చు? దేవుని శాంతి మీకుందని అనిపించేంత వరకు ప్రార్థిస్తూనే ఉండండి. (లూకా 11:9; 1 థెస్స. 5:17) మీకు కష్టాలు వచ్చినప్పుడు పట్టుదలగా ప్రార్థిస్తే మీ హృదయాలకు, మనసులకు కాపలా ఉండే దేవుని శాంతిని రుచి చూస్తారు.—రోమా. 12:12. w24.01 21 ¶5-6

శుక్రవారం, నవంబరు 28

“పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి.”—మత్త. 6:9.

తన తండ్రి పేరును పవిత్రపర్చడానికి యేసు అన్నిరకాల హింసను, అవమానాన్ని, అబద్ధ ఆరోపణల్ని సహించాడు. యేసు అన్ని విషయాల్లో తన తండ్రికి లోబడ్డాడు కాబట్టి దేనికీ తల దించుకోవాల్సిన అవసరం లేదని ఆయనకు తెలుసు. (హెబ్రీ. 12:2) తన చివరి గడియల్లో సాతాను నేరుగా దాడి చేస్తున్నాడని కూడా యేసుకు తెలుసు. (లూకా 22:2-4; 23:33, 34) యేసు ఎలాగైనా తన యథార్థతను కోల్పోతాడని సాతాను కొండంత ఆశతో ఉన్నాడు. కానీ పాపం, అతని ఆశలు అడియాశలు అయ్యాయి! సాతాను అబద్ధాలకోరు అని, ఎన్ని పరీక్షలు వచ్చినా దేవుని నమ్మకమైన సేవకులు యథార్థతను కోల్పోరని యేసు తిరుగులేని విధంగా నిరూపించాడు! మీ రాజును మీరు సంతోషపెట్టాలని అనుకుంటున్నారా? అయితే, యెహోవా పేరును స్తుతిస్తూ, ఆయన ఎలాంటి వ్యక్తో అందరికీ చాటి చెప్తూ ఉండండి. అలా చేసినప్పుడు మీరు యేసు అడుగులో అడుగు వేసినట్టే! (1 పేతు. 2:21) అప్పుడు యేసులాగే మీరు కూడా యెహోవాను సంతోషపెడతారు, దేవుని శత్రువైన సాతాను ఒక సిగ్గులేని అబద్ధికుడని నిరూపిస్తారు! w24.02 11-12 ¶11-13

శనివారం, నవంబరు 29

“యెహోవా నాకు చేసిన మంచి అంతటికీ నేను ఆయనకు ఏమి ఇవ్వను?”—కీర్త. 116:12.

గడిచిన ఐదేళ్లలో, పది లక్షలకంటే ఎక్కువమంది బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షులయ్యారు. యెహోవాకు సమర్పించుకున్నప్పుడు మీరు యేసుక్రీస్తు శిష్యులు అవ్వాలని నిర్ణయించుకుంటారు. యెహోవా ఇష్టాన్ని చేయడమే మీ జీవితంగా చేసుకుంటారు. అయితే, సమర్పించుకోవడంలో భాగంగా మీరు ఏది కూడా చేయాలి? యేసు ఇలా చెప్పాడు: “ఒక వ్యక్తి నా శిష్యుడు అవ్వాలనుకుంటే, అతను ఇక తన కోసం తాను జీవించకుండా” ఉండాలి. (మత్త. 16:24) యెహోవాకు సమర్పించుకున్న సేవకులుగా మీరు ఆయన ఇష్టానికి అడ్డొచ్చే దేన్ని చేయకూడదు. (2 కొరిం. 5:14, 15) అంటే లైంగిక పాపం లాంటి “శరీర కార్యాలు” చేయకూడదు. (గల. 5:19-21; 1 కొరిం. 6:18) ఇలాంటి నియమాలు మీ జీవితాన్ని కట్టిపడేస్తాయా? ఒకవేళ మీరు యెహోవాను ప్రేమిస్తే, ఆయన చెప్పేవన్నీ మీ మంచికోసమే అని మీరు నమ్మితే, మీకు అస్సలు అలా అనిపించదు.—కీర్త. 119:97; యెష. 48:17, 18. w24.03 2 ¶1; 3 ¶4

ఆదివారం, నవంబరు 30

“నిన్ను చూసి నేను సంతోషిస్తున్నాను.”—లూకా 3:22.

యెహోవా ఎవర్ని చూసైతే సంతోషిస్తాడో వాళ్లకు తన పవిత్రశక్తిని ఇస్తాడు. (మత్త. 12:18) కాబట్టి ఇలా ప్రశ్నించుకోండి: ‘నా జీవితంలో నేను పవిత్రశక్తి పుట్టించే కొన్ని లక్షణాలైనా చూపించానా?’ ఇంతకుముందుకన్నా యెహోవా గురించి తెలుసుకున్న తర్వాత మీరు వేరేవాళ్లతో ఓర్పుగా ఉంటున్నారా? నిజానికి పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని చూపించడం ఎంత నేర్చుకుంటే, యెహోవా ఆమోదం మనకుందని అంత రుజువు చూడవచ్చు. యెహోవా ఎవర్ని చూసైతే సంతోషిస్తాడో వాళ్లకు విమోచన క్రయధన విలువను అన్వయిస్తాడు. (1 తిమో. 2:5, 6) అయితే, మనకు విమోచన క్రయధనం మీద విశ్వాసం ఉండి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా యెహోవా మనల్ని చూసి సంతోషించట్లేదేమో అనే అనుమానం ఉంటే, అప్పుడేంటి? మనల్ని మనం నమ్ముకోవడం కన్నా యెహోవాను నమ్మడం తెలివైన పని అని గుర్తుంచుకోండి. విమోచన క్రయధనం మీద విశ్వాసం ఉంచేవాళ్లు తన దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు, అలాగే వాళ్లను దీవిస్తాను అని యెహోవా మాటిస్తున్నాడు.—కీర్త. 5:12; రోమా. 3:26. w24.03 30 ¶15; 31 ¶17

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి