నిపుణతగల పనివారు దేవుని వాక్యమును సరిగా ఉపయోగించుట
1 క్రైస్తవపరిచారకులు “దేవుని జతపనివారని” సరియైన రీతిగా పిలువబడియున్నారు. (1 కొరిం. 3:9) అందువలన “దేవుని వాక్యమును సరిగా ఉపయోగించు” పనివారలముగా నైపుణ్యతను వృద్ధిచేసికొనుట మన గురియైయుండవలెను.—2 తిమో. 2:15.
2 ఈ క్రైస్తవపరిచర్యలో మనము నిపుణతగలవారమగునట్లు సహాయపడుటకై సొసైటి న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది హోలిస్క్రిప్చర్స్ అనేకమైన సాటిలేని అంశములను చొప్పించినది. వాటితో మీరు పరిచయము కలిగియున్నారా? మీ ప్రాంతీయ పరిచర్యలోను, మీ వ్యక్తిగత పఠనములోను ఆ అంశములను మీరు ఉపయోగించుదురా?
పలు విధముల జ్ఞానమునిచ్చు ఏర్పాటు
3 న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ది క్రిష్టియన్ గ్రీక్ స్క్రిప్చర్స్ 1950లో విడుదలైనప్పుడు అందుగల క్రాస్రెఫరెన్సులు, ఫుట్నోట్స్, అపెండిక్స్, సంబంధిత రెఫరెన్సులు సంఘకూటములకు సిద్ధపడుటలోను, సాధారణ వ్యక్తిగత పఠనములోను ఎంతో సహాయకరముగా కనుగొంటిమి. ఆ తరువాత 1984లో న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ రెఫరెన్సు బైబిలును పొందుటకు ఎంతగా పులకరించి పోతిమి. దేవుని వాక్యమును సరిగా ఉపయోగించు నిపుణతగల పనివారిగా తయారగు మన ప్రయత్నములో మనకు సహాయపడుటకు ఎంతటి ఉన్నతమైన ఏర్పాటు! పలువిధములైన జ్ఞానమునిచ్చు ఈ ఏర్పాటును పట్టుదలతో ఉపయోగించుటద్వారా మనలోను మరియు ఇతరులలోను స్థిరమైన ఆత్మీయలక్షణములను నిర్మించుటకు ముందెన్నటికంటెను మరి ఎక్కువగా యిప్పుడు సంసిద్ధులమై యున్నాము.—మత్త. 7:24; 1 తిమో. 4:16; హెబ్రీ. 5:14.
4 పరిచర్యలో పాల్గొనునప్పుడు కేథలిక్ చర్చి నిర్మింపబడియున్న బండ పేతురేయని మత్తయి 16:18ని ఎత్తిచూప ఒక యథార్థమైన కేథలిక్ వ్యక్తిని మీరు కలువవచ్చును. అప్పుడు, న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్లో ఆ లేఖనమును తెరచి “బండ” అను పదము మీద యివ్వబడిన అయిదు సంబంధిత లేఖనములను మీరు కనుగొనవచ్చును. ఆ లేఖనములు సంఘమునకు పునాదియైన ఆ బండ పేతరుగాక, క్రీస్తు అని చూపును. అదే లేఖనమును న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ రెఫరెన్సు బైబిలులో మీరు చూసిన, “బండ” అను పదముపైగల ఫుట్నోట్లోని ఆదిమ గ్రీకులో ఆ పదమునకుగల భావమును మీరు కనుగొనుగొందురు.
5 మన పరిచర్యలో ఎక్కువ సహాయకరముగా రుజువైన మరొక అంశము “బైబిలు టాపిక్స్ ఫర్ డిస్కసన్” అను భాగము. చాలా తరచుగా చేయబడుచున్న ప్రాంతములో పనిచేయుచున్నప్పుడు మన రాజ్యపరిచర్యలో చూపబడినదిగాక మరొక అంశమును ఉపయోగించి మీరు యిష్టపడవచ్చును. “భూమి” “రాజ్యము” “అంత్యదినములు” మొదలగు అంశములక్రింద యింటింటి సేవలో చెప్పు ప్రసంగమునందు, లేక పునర్దర్శనమందలి లేఖన చర్చయందు ఉపయోగించగల లేఖనములను మీరు కనుగొందురు.
గుర్తుంచుకొనుటకు సహాయకములు
6 బైబిలు చర్చ జరుగుచున్నప్పుడు ఫలాన లేఖనము ఎక్కడుందో మీకు గుర్తురాకపోయినట్లయిన, మీ బైబిలులో వెనుక ప్రక్కగల బైబిలు పదముల విషయ సూచిక వైపు త్రిప్పి, తగిన సహాయమును పొందవచ్చును. విలువకరమైన ఈ ఆంశమును మీరు ఉపయోగించుదురా?
7 ఐదవ పేజిలోని ముందు మాట న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఎక్కువ పాండిత్యపరమైన పుస్తకమనుటకు నమ్మదగిన ఆధారమునిచ్చుచున్నది. దైవనామము ఉపయోగించుట ఎట్లు తగియున్నదో అపెండిక్స్ స్పష్టమైన వివరణనిచ్చుచున్నది. మరియు లేఖనసంబంధముగా “గెహెన్నా” “హేడిస్,” “షియోల్,” అనగా యేమిటో రుజువు చేయుచున్నది. 1546-7 పేజీలలో గల “బైబిలు పుస్తకముల పట్టిక”ను గమనించుట ద్వారా ఏ పుస్తకమును ఎవరు వ్రాసినది, అది ఎక్కడ వ్రాయబడినది, ఎంత కాలనిడివిలో జరిగినవాటిని ఆ పుస్తకము తెల్పునది మనకు తెలియును.
8 “ప్రతిసత్కార్యమునకు సిద్ధపడుటకు” ఏది అవసరమో దానిని యెహోవా మనకు యిచ్చియున్నాడు. మనము అందించు బైబిలు సాహిత్యములతో పాటు న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ను ఉపయోగించుట ద్వారా మనకు అప్పగింపబడిన పనిని ఫలవంతముగా చేయగలము. (లూకా 6:47, 48) దేవుని వాక్యమును సరిగా ఉపయోగించుచు, నిపుణతగల పనివారలముగా మనము నిరూపించుకొనుకొలది యజమానుడు మనలను ‘బాగుగాచేసితి’వని అనగలడని నమ్మకముతో ఎదురుచూడగలము.—మత్త. 25:21.