శిష్యులను చేయుటకు మనకు సహాయపడు కూటములు
అక్టోబరు 8తో ఆరంభమగు వారము
పాట 154 (30)
10 ని: స్థానిక ప్రకటనలు. మరియు మన రాజ్య పరిచర్య నుండి ఎన్నుకొనబడిన ప్రకటనలు. ప్రాంతీయ సేవ నిమిత్తమై మీరు సిద్ధపడియున్నారా? ప్రాంతీయసేవా సంచికి అవసరమైన వాటిని ఎత్తి చూపుము. బైబిలు, రీజనింగ్ ప్రంది స్క్రిప్చ్‌ర్స్, గుడ్‌న్యూస్ ఫర్ ఆల్ నేషన్స్ అను చిన్న పుస్తకము, కరపత్రములు, పెన్సిల్, ప్రస్తుత అందింపు, మ్యాగజైనులు, ఇంటింటి సేవా రికార్డు మరియు ఇతరములు. మానసికంగా సిద్ధపడియుండుటకై అందించబోవు సాహిత్యములలోని ముఖ్యాంశములను పునర్విమర్శ చేసికొని వెళ్లుటయు అవసరము. మరియు గొఱ్ఱెలాంటి వారిని కనుగొనుటలో సహాయము మరియు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించుము.—ఫిలి. 4:6, 7.
20 ని: “సమస్తమునకు సృష్టికర్తయైన వానిని ఘనపరచుము.” ప్రశ్నాసమాధానముల చర్చ. పేరాగ్రాఫ్ 3, 4లను పరిశీలించునప్పుడు, ఫలవంతముగానున్న ప్రచారకుడు సంభాషణ అంశమును ప్రదర్శించి సాహిత్యమును అందించునట్లు చేయుము. తిరిగి దర్శించుటకు చేసికొనిన నిర్దిష్టమైన ఏర్పాటులను చూపించుము.
15 ని: మాదిరికరమైన అనేకమంది యువకులతో పెద్ద మాట్లాడుట. యంగ్పీపుల్ ఆస్క్ పుస్తకములోని, “షుడ్ ఐ క్విట్ స్కూల్” అను 17వ అధ్యాయము నుండి ముఖ్యాంశములను చర్చించి, వారి భవిష్యుత్తును దేవుని సంస్థతో నిర్మించుకొని రాజ్యాసక్తులను వెంబడించుటకు ఉపయోగకరమైన మరియు అభ్యాసయుక్తమైన పాఠ్య ప్రణాళికను ఎన్నుకొనుటలో తమ యౌవనులను నడిపించు అవసరతను తల్లిదండ్రులకు నొక్కి తెల్పుము.
పాట 225 (117) మరియు ముగింపు ప్రార్థన.
అక్టోబరు 15తో ఆరంభమగు వారము
పాట 71 (92)
5 ని: స్థానిక ప్రకటనలు. దైవ పరిపాలనా వార్తలు. సాయంకాల సాక్ష్యమునకు మద్దతునివ్వమని ప్రోత్సహిస్తూ ప్రాంతీయ సేవా ఏర్పాట్లనుగూర్చి గుర్తు చేయుము.
15 ని: “సువార్తనందించుట—పత్రికలతో” ప్రశ్నాసమాధానముల చర్చ. పేరాగ్రాఫ్ 8ని పరిశీలించునప్పుడు, పత్రికలో స్థానికముగా ఆసక్తిని కలిగించు శీర్షికను ఉన్నతపరుస్తూ, నిజమైన ఆసక్తిని చూపించు వ్యక్తితో పత్రికా మార్గమును ఎట్లు ఏర్పరచగలమో ప్రదర్శించుము.
15 ని: “కూటములనుండి ఎక్కువగా ప్రయోజనము పొందునట్లు పిల్లలకు సహాయము చేయుము.” ప్రశ్నాసమాధానములతో శీర్షికను పూర్తి చేయుట. పిల్లలను కూటములకు తెచ్చుట, వారితో పఠించుట, వారిని ప్రాంతమునకు తీసుకెళ్లుట యొక్క విలువను చూపించుము.
10 ని: “వృద్ధులైన వారిని మనము అభినందింతుము!” పెద్దచే ప్రసంగము. ది వాచ్‌టవర్ ఫిబ్రవరి 1, 1986 అపాయములనుగూర్చి 28-9 పై ఆధారపడిన ప్రసంగము. స్థానికముగా అన్వయింపుము. అట్టివారితో ప్రాంతమందు పనిచేయుట, వారిని మనతో కూడా తీసుకెళ్లుటకు నిదానముగా నడుచుటను ప్రత్యేకముగా వ్యాఖ్యానించవచ్చును. వారి నిమిత్తమై దుకాణమునకు వెళ్లుట, డాక్టరు యొద్దకు తీసుకెళ్లుట మొదలగు వాటిలో వారికి సహాయము చేయవచ్చును. వారి జ్ఞానము మరియు అనుభవము నుండియు ప్రయోజనము పొందవచ్చును.—యోబు 15:10; సామె. 16:31; 1 తిమో. 5:1, 2. (ప్రాంతీయ భాష; “వృద్ధులకు మరియు అంగవైకల్యము గలవారికి సహాయము చేయుము” కెయం 12/88.)
పాట 116 (108) మరియు ముగింపు ప్రార్థన.
అక్టోబరు 22తో ఆరంభమగు వారము
పాట 160 (88)
8 ని: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు మరియు చందా పంపినందుకు తెలుపబడిన కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తమైన పనికై యిచ్చు మద్దతునకు సంఘమును అభినందించుము.—సామె. 3:9.
20 ని: “బైబిలు పఠనములను ప్రారంభించుటకు మెలకువగా ఉండుము.” ప్రశ్నాసమాధానముల చర్చ. సంఘము కలిగియున్న బైబిలు పఠనముల సంఖ్యను తెల్పుము. పేరాగ్రాఫ్ 5ను చర్చించునప్పుడు మొదటి సారి కలిసినప్పుడే పఠనములను ఎట్లు ప్రారంభించవచ్చునో చూపుము. ఇంటివారు పరిణామమునందు పెద్దగా ఆసక్తిని చూపకపోయినను తగినటు వంటి ఒక కరపత్రమును సంతోషముగా అంగీకరించుటను చూపు ప్రదర్శనను ప్రారంభించుము. ప్రచారకుడు కరపత్రమునుండి ఒకటి లేక రెండు పేరాగ్రాఫ్‌లను పరిశీలించిన తరువాత, మరలా తిరిగి వచ్చుటకు నిర్దిష్టమైన ఏర్పాటును చేసుకొనును. తరువాత రీజనింగ్ పుస్తకములోని 12వ పేజీలో “హోమ్ బైబిలు స్టడీ” అను దాని క్రిందగల ఉపోద్ఘాతములలో ఒకదానిని ఉపయోగించి నేరుగా సమీపించుటను గూర్చిన ప్రదర్శనను చేయుము. సాయంకాల సమయములలో సాధారణముగా భర్తలును ఇంటియొద్దనే ఉందురు గనుక కుటుంబమంతటితో బైబిలు పఠనమును ప్రారంభించుటకు సాయంకాల సాక్ష్యము ఎట్లు అవకాశములను కలుగజేయునో వ్యాఖ్యానించుము.
17 ని: “బోధించునప్పుడు హృదయమును చేరుము.” వాచ్‌టవర్ ఆగస్టు 1, 1984 పేజీలు 13-17 నందలి నాలుగు ముఖ్యాంశములను చర్చించు ప్రసంగము. అభివృద్ధికరమైన బైబిలు పఠనములను చేయు అవసరతను గుణగ్రహించునట్లు ప్రేక్షకులకు సహాయము చేయుము. మరియు ఫలవంతముగా లేని బైబిలు పఠనములను ఎప్పుడు మానివేయ వచ్చునో వ్యాఖ్యానించుము (ప్రాంతీయ భాష: ఫిబ్రవరి వా. 89, “యేసు అడుగుజాడలలో నడుచు ఒక ప్రజ.”)
పాట 121 (95) మరియు ముగింపు ప్రార్థన.
అక్టోబరు 29తో ఆరంభమగు వారము
పాట 69 (75)
10 ని: స్థానిక ప్రకటనలు. శనివారపు పత్రిక పనిని ప్రోత్సహించుము. రెండు క్లుప్తమైన ప్రదర్శనలు. ఒకటి ఇంటివారు ఆసక్తిని చూపినట్లుగాను, మరొకటి ఇంటివారు పత్రికలపై ఆసక్తి చూపక కరపత్రములను చదువుటకు అంగీకరించును. ఆసక్తిని చూపినచోట ప్రచారకుడు ది వాచ్‌టవర్ యొక్క 2వ పేజీలోని, లేక అవేక్ యొక్క 4వ పేజీలోని ప్రపంచవ్యాప్తమైన బైబిలు విద్యాకార్యక్రమము అను వాక్యమును సూచించవచ్చును. లేక సారాంశముగా స్వచ్ఛంద విరాళములచే బలపరచబడిన ప్రపంచవ్యాప్త బైబిలు విద్యాకార్యక్రమములో తాను చేయునది ఒక భాగమని చెప్పవచ్చును. ఆ సంభాషణ ఉచిత గృహబైబిలు పఠనమును అందించుటకు మార్గమును తెరవవచ్చును.
20 ని: “మన పయినీర్లను మెచ్చుకొనుట” సేవా కాపరి ఇద్దరు లేక ముగ్గురు పయినీర్లతో సమాచారమును చర్చించును. వారు ఎట్లు ఇతరులను ప్రోత్సాహపరచినది, ప్రత్యేకించి స్థానికముగా వారినేమి ప్రోత్సాహపరచినది వారి నుండి రాబట్టుము. పయినీర్లను బలపరస్తున్నందుకు సంఘమును అభినందించుము.
15 ని: స్థానిక అవసరతలు. లేక ప్రిసైడింగ్ ఓవర్సీర్ జనవరి 1, 1983 ది వాచ్‌టవర్, పేజీలు 30-1 యందలి “కొశ్చన్స్ ఫ్రం అవర్ రీడర్స్”నందలి “సంఘములో బహిష్కరించబడిన బంధువులు గలవారికి మనమెట్లు సహాయము చేయగలము?” అనుదానిని చర్చించును. (ప్రాంతీయభాష; వా89 జనవరి “ఆయన అడుగు జాడలలో నడుచుటలోని సవాలు.”)
పాట 62 (34) మరియు ముగింపు ప్రార్థన.