ప్రత్యేక సమావేశములు యెహోవాను ఘనపరచును
1 సాంవత్సరిక సమావేశములు ఆనందదాయకమైన క్రైస్తవ సహవాసముతో పాటు యెహోవాసాక్షులకు ఆత్మీయ విశ్రాంతిని మరియు ప్రోత్సాహమును కలుగజేయును. యెహోవా ప్రజలయొక్క పెద్ద సమావేశములు యెహోవా నామమును బయలుపరచి రాజ్యసువార్తను చాటించుటలో ప్రభావవంతమైన మార్గముగా పనిచేయును.
2 సహోదరులందరి ప్రయోజనార్థమై క్రమమైన జిల్లా సమావేశములు భూమియందంతట ప్రతి సంవత్సరము ఏర్పాటు చేయబడుచున్నవి. ఆ తరువాత కొన్ని సమయములందు కొన్ని ప్రాంతములలో ప్రత్యేక సమావేశములు జరుగును. ఇది సంస్థయొక్క అంతర్జాతీయ తీరును చూపించుటకు మరియు గొప్ప సాక్ష్యమునిచ్చుటకు అవకాశమును దయచేయును. 1989లో పోలెండునందు మూడు ప్రత్యేక సమావేశములు జరిగినవి. ఆ ప్రత్యేక సమావేశములను గూర్చిన సమాచారములు ఎంత పులకరింపజేయునవిగా యున్నవి!
ఎన్నుకొనబడిన ప్రతినిధి ఏర్పాటు
3 ఈ ప్రత్యేక సమావేశములో ఒకదానికి హాజరు కావలెనను కోరికను వేలకొలది సహోదరులు కలిగియున్నారు. తగిన సమయమందు ఎక్కువమంది సహోదరులు వీటిలో ఒకదానికి హాజరగుట సాధ్యము కావచ్చును. ఏమైనను ప్రత్యేక సమావేశముల ఉద్దేశ్యమును నెరవేర్చుటకు మరియు సమస్తమును క్రమముగా జరుగుటకు ఒక ఖచ్చితమైన సమావేశమునకు హాజరగుటకు సూచించబడిన ప్రతి బ్రాంచీలు పరిమిత సంఖ్యలో సభ్యులను ఎన్నుకొనుటకు ఏర్పాటు చేయబడినది. ఇది స్థానిక సహోదరులకు ప్రోత్సాహకరముగా మరియు చూచువారందరికి సాక్ష్యము ప్రభావవంతముగా నుండుటకు అంతర్జాతీయ సహోదరత్వమును సమపాలులో ప్రదర్శించును. అవును, దీనినిబట్టి దరఖాస్తు చేయువారందరు, లేక సంఘ సేవాకమిటీచే సిఫారసు చేయబడు వారందరు ఎంపిక చేయబడనందుకు నిరుత్సాహపడవచ్చును, అయితే అట్టి ఏర్పాటుయందలి ప్రాముఖ్య కారణములను అందరు అర్థము చేసుకుంటారని మేము నమ్ముతాము.
4 మంచి సాక్ష్యము యివ్వబడుటకై ప్రత్యేక సమావేశముల కొరకు సూచించబడిన ఏర్పాటులతో ప్రతి ఒక్కరు సహకరించవలెనని సొసైటి కోరుచున్నది. ప్రతినిధులుగా తాము ఎంపిక చేయబడక పోయినప్పటికి కొంతమంది సహోదరులు ప్రత్యేక సమావేశమునకు హాజరగుటకు తమ స్వంత ఏర్పాట్లను చేసికొన్నట్లయిన అది సమస్యలను సృష్టించును. ఎంపిక చేయబడిన దేశములనుండి ప్రత్యేక సమావేశమునకు వెళ్లు సంఖ్య సొసైటిచే నిర్ణయించబడుతుంది. సమావేశ సౌకర్య విషయంలో గుంపు అధికము కాకుండునట్లు ఇది అవసరము. సౌకర్యములు పరిమితికి మించి ఉపయోగించుకొనబడినట్లయిన, సమావేశము మృదువుగా సాగుటను ఇది ఆటంకపరచి స్థానిక అధికారులపై మంచి అభిప్రాయమును ముద్రించదు.
5 ఎంపిక చేయబడిన ప్రతినిధులు సమావేశమునకు హాజరగుటలో తమ ఉద్దేశ్యము రాజ్య ఆసక్తులను వృద్ధి చేయుటయను దానిని మనస్సునందుంచుకొనవలెను. ఈ ఉద్దేశ్యము ప్రతినిధులందరు తమ స్వంత ఏర్పాట్లను చేసికొనక ప్రయాణపు మరియు ఇతర ఏర్పాట్లందు సొసైటి వలన ఏర్పరచబడిన ఏర్పాట్లతో సహకరించినట్లయిన అతి సులభంగా నెరవేర్చబడును.
6 ఈ సంవత్సరము ప్రత్యేక సమావేశములు జర్మనీలోని బెర్లిన్నందు, బ్రెజిల్‌లోని సేవోపాల్నందు జరిగినవి. డిశంబరులో ఒక ప్రత్యేక సమావేశము అర్జెంటైనాలోని బుయినోస్ ఎయిర్స్లో జరుగును. 1991 జనవరిలో ప్రత్యేక సమావేశములు తూర్పు దూర ప్రాంతములో జరుగును. ఆ మూడు ప్రాంతములు ఏవనగా ఫిలిప్ఫైన్స్ నందలి మనిలా, తైవాన్‌లోని టాయ్పేయ్, థాయ్‌లాండ్ లోని బాంకాక్. ఈ సమావేశములకు ప్రతినిధులు ఇప్పటికే ఎంపిక చేయబడ్డారు. (ఈ సమయములో ఈ ఏర్పాటునందు ఇండియా చేర్చబడలేదు.) ఎంపిక చేయబడిన ప్రతినిధులందరు ఇతర దేశముల నుండి హాజరగు ప్రతినిధులతోపాటు మంచి సాక్ష్యమునిచ్చుటకు సకల ప్రయత్నములు చేస్తారని ఆశించబడుతుంది.
7 ప్రత్యేక సమావేశములకు ప్రతినిధులుగా ఎంపిక చేయబడినను లేక స్థానిక సమావేశములకు హాజరగుచున్నను, మన ప్రార్థనలు మరియు ప్రతిదిన ప్రవర్తన మన పూర్ణాత్మతో కూడిన భక్తి, మరియు మనము చేయు ప్రతిదానియందు యెహోవాను ఘనపరచవలెనను యథార్థమైన కోరికను సాక్ష్యమిచ్చును గాక!