సువార్తనందించుట—ప్రార్థన పూర్వకముగా
1 అపొస్తలుడైన పౌలు ప్రోత్సాహకరంగా ఫిలిప్పీయులకు ఇలా వ్రాశాడు, “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.” (ఫిలి. 4:13) మనము కూడా సువార్తను ధైర్యముగా అందించు బలమునకై పూర్తిగా యెహోవాపై ఆధారపడవలసియున్నాము. దీనిని మనమెట్లు చేయగలము?
2 “మనము విసుకక నిత్యము ప్రార్థన చేయు” అవసరతను యేసు నొక్కి తెలియజేశాడు. (లూకా 18:1) “యెడతెగక ప్రార్థన చేయుడి” అని పౌలు ఉద్బోధించెను. (1 థెస్స. 5:17) అవును, ప్రార్థననుండి బలము వచ్చును. ప్రార్థనాపూర్వకముగా మనము సువార్తను అందించవలసియున్నాము. ఇతరులకు సాక్ష్యమిచ్చు అవకాశములకొరకు, ఇంటింటి పనిలో జ్ఞానము మరియు వివేచనకొరకు, బైబిలు విద్యార్థుల హృదయము చేరుకొనుటలో విజయముకొరకు మనము ప్రార్థించవచ్చును. అంతమురాకముందు రాజ్య సువార్తను ప్రకటించు అత్యవసర పరిస్థితియున్నందున ప్రపంచవ్యాప్తముగా రాజ్యాసక్తుల విస్తరణకొరకు కూడా మనము ప్రార్థించవలసియున్నాము. (మత్త. 24:14) ఆత్మీయ సంబంధమైన కునుకుపాటును తీసివేసుకొని యెహోవా సంకల్పములను గూర్చి మాట్లాడు ఆధిక్యత యెడల మెప్పును పెంచుకొనుటకు మనము ‘మెలకువగా ఉండవలెను.’—కొలొ. 4:2; డబ్ల్యు62 పే. 497.
బైబిలు పఠనములయందు
3 ఒక బైబిలు పఠనమును చేయునప్పుడు ప్రార్థన ఎందుకు అంత ప్రాముఖ్యము? బైబిలు పఠనమును ప్రార్థనతో ప్రారంభించుట మనలను సరియైన మానసిక తీరును కలిగియుండునట్లు చేయును. మరియు చెప్పబడబోవు దానియొక్క ప్రాముఖ్యతను గుర్తించుటకు అది విద్యార్థికి సహాయపడును. నడిపింపుకొరకై యెహోవావైపు చూచుటను ఆయన నేర్చుకొనును. విద్యార్థి మన మాదిరి ద్వారా ఎట్లు ప్రార్థించవలెనో కూడా నేర్చుకొనును.—లూకా 11:1.
4 గృహ బైబిలు పఠనములలో చేయు ప్రార్థనలయందు మనము చేర్చగల కొన్ని తగిన విషయములేమి? యేసు యొక్క మాదిరి ప్రార్థన మరియు ఫిలిప్పీయుల నిమిత్తము పౌలు చేసిన ప్రార్థన శ్రేష్టమైన మాదిరులు. (మత్త. 6:9-13; ఫిలి. 1:9-11) మన ప్రార్థనలు దీర్ఘముగా నుండనవసరము లేదు. అయితే అవి ఒక నిర్దిష్టమైన విషయములతో వ్యవహరించవలెను. ఆయన యొక్క అసంఖ్యాకమైన మంచిపనుల నిమిత్తమై యెహోవాకు స్తుతిగా తగినరీతిలో వ్యక్తపరచు వాటిని చేర్చుట ప్రాముఖ్యము. ఆయనయొక్క గొప్పతనము, ఔన్నత్యము, మరియు పరిపూర్ణ లక్షణములను గుర్తింపును మనము తెలియజేయవచ్చును. (కీర్త. 145:3-5) బైబిలు విద్యార్థిని పేరుతో ప్రస్తావించుట, బహుశా ఆయన పరిస్థితులను తెలియజేయుట, ఆయన ఆత్మీయ అభివృద్ధిని పొందవలెనని ప్రార్థించుట ప్రయోజనకరము. ఆయన అభివృద్ధి చెందుకొలది, కూటములకు హాజరగుట మరియు తాను నేర్చుకొనుచున్న వాటిని ఇతరులతో పంచుకొనుటయందు తానుచేయు ప్రయత్నములపై యెహోవా ఆశీర్వాదములకొరకై ప్రార్థించవచ్చును. ప్రపంచవ్యాప్తమైన ప్రకటనపనియందును యెహోవా ఆశీర్వాదములకై విన్నపము చేయుము.
మన సహోదరులు సహోదరీల కొరకు
5 యెహోవా ప్రజలందరు మన తోటి పనివారు. (1 కొరిం. 3:9) కాబట్టి సువార్తను ప్రకటించుపనిలో లౌకిక అధికారులు జోక్యము కలుగజేసికొన చూచునప్పుడు “రాజుల కొరకు మరియు అధికారులకొరకు” ప్రార్థన చేయు మనము నడిపింపబడతాము. ఎందు నిమిత్తము? “మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము.” (1 తిమో. 2:1, 2) నిజముగా అట్టి ప్రార్థనలు ప్రపంచమంతటనున్న మన సహోదరుల నిమిత్తమైయున్నవి. అధికారులు మన పనియెడల దయాపూర్వక మనస్సు కలిగియుందురని మనము ప్రార్థింతుము.
6 ప్రార్థనద్వారా కష్టపరిస్థితులయందు ప్రకటించు మన సహోదరులు, ఆత్మీయముగా అనారోగ్యముగాయున్నవారు పరిచర్యలో పూర్తిగా భాగము వహించునట్లు బలము పొందవలెనని మనము కోరవచ్చును. (2 థెస్స. 3:1, 2) “మన మధ్య ప్రయాస పడుచున్న” సంఘపెద్దలను గూర్చి, ప్రయాణకాపరులను గూర్చి మరియు గవర్నింగ్ బాడీని గూర్చి ప్రార్థించుటయు మంచిది.—1 థెస్స. 5:12.
7 అన్ని సమయములలో మన చింతలను మనము యెహోవా మీద వేయవలసియున్నాము. (కీర్త. 55:22; 1 పేతు. 5:7) ఆయన చిత్తమునకు అణుగుణ్యముగా మనమేది అడిగినను ఆయన వింటాడను అభయమివ్వబడియున్నాము. (1 యోహా. 5:14) కాబట్టి పరిచర్యను సంపూర్ణముగా నెరవేర్చుటలో యెహోవా సహాయము నిమిత్తమై మనము ప్రార్థించినట్లయిన ఆయన విని మన మార్గమును విజయవంతము చేయునని మనము నమ్మవలయును.—2 తిమో. 4:5.