“రమ్ము!” అను ఆహ్వానమును నిర్భయముగా అందించుము
1 ప్రపంచ వ్యాప్తముగా వేగముగా ముందుకు వెళ్లుచున్న సంఘటనలు ఈ కాలములను “అంత్యదినములుగా” గుర్తించుచున్నవి. (2 తిమో. 3:1-5) నేరము పెరుగుట, ఆర్థిక ఆస్థిరత, జీవితమును బెదరించు వ్యాధులు వాటి వత్తిడిని ఇంకా అధికము చేయుచున్నవి. అయితే సంతోషదాయకముగా, అట్టి శ్రమలున్నను ప్రజలు తమపై నిత్యము ప్రభావము చూపగల ఒక ఆహ్వానమును అందించబడుచున్నారు. ఆత్మయు పెండ్లికుమార్తెయు “రమ్ము!” అని చెప్పుటలో కొనసాగుచున్నారు. మరియు ప్రతిచోట నున్న ప్రజలు వచ్చి జీవజలములను ఉచితముగా పుచ్చుకొనునట్లు బహిరంగ ఆహ్వానమును అందించుటలో ఇప్పుడు వారితో “ఒక గొప్పసమూహము” కలసియున్నారు.—ప్రక. 7:9; 22:17.
2 నేడు, నీతికొరకు దప్పిక గలవారు ఈ ఆహ్వానమునకు గొప్ప సంఖ్యలో జవాబిచ్చుచున్నారు. గత సంవత్సరము ప్రపంచవ్యాప్తముగా జరిగిన జిల్లా సమావేశములకు లక్షలకొలదిగా హాజరైరి. మరియు దగ్గరదగ్గర కోటిమంది జ్ఞాపకార్థమునకు హాజరయ్యారు. ఇంకా లక్షలకొలది ఇతరులు రాజ్య వర్తమానమును వినుటద్వారా యెహోవా ఏర్పాటు యెడల మెప్పును చూపుచున్నారు. కావున బహిరంగముగాను మరియు ఇంటింటను ఈ ఆహ్వానమును అందించుటలో మన సమయమును జ్ఞానయుక్తముగా ఉపయోగించుట ఎంత ప్రాముఖ్యము!—అ. కార్య. 5:42; ఎఫె. 5:15, 16.
నిర్భయముగా పాల్గొనుము
3 తొలిక్రైస్తవులు ఆసక్తితో కూడిన తమ ప్రకటన పనిని బట్టి హింసించబడిరి. (అ. కార్య. 16:19-21; 17:2-8) అయినను సువార్తను ప్రకటించుటకు వారు చేయు నిర్భయ ప్రయత్నములను విడువలేదు. ఆలాగే మనమును సువార్త ప్రకటించబడునట్లు చేయు మన ప్రయత్నములలో నిర్భయముగాను మరియు నిశ్చయమైన తీర్మానముతోను ఉండవలెను.
4 చివరకు నిషేధించబడియున్న దేశములలో అచ్చటి సహోదరులు తీవ్రహింసయందును, ఉద్యోగములు, గృహములు, చివరకు వారికిగల స్వాతంత్ర్యమును కోల్పోవు సాధ్యతలందును ప్రకటన పనిలో పూర్ణ హృదయముతో పాల్గొనుచున్నారు. వారి మంచి ఉదాహరణ ఇతరులను “రమ్ము” అని ఆహ్వానించుటలో కొనసాగునట్లు మనలను ప్రోత్సహించుటకు పనిచేయును.—2 థెస్స. 3:9.
5 సత్యమును నేర్చుకొన్న తరువాత 35 సంవత్సరములకు పైగా ఒక సహోదరి పయినీరుగా చేయవలెనను తన హృదయకోరికను కాపాడుకుంది. ఆమెకు 70 సంవత్సరముల వయస్సులో వ్యక్తిగత పరిస్థితులు మారగా ఆమె రెగ్యులర్ పయినీరుగా తయారయింది. ఆ వయస్సులో ఎక్కువ మంది ప్రజలు ఒక క్రొత్త వృత్తిని చేపట్టనప్పటికిని ఆమె మాత్రము అలా చేసింది. ఇప్పుడు కొన్ని సంవత్సరములు పూర్తికాల పరిచర్యను ఆనందించిన తరువాత ఆమె ఇట్లనుచున్నది, “దినదినము అది మెరుగవుచున్నది.” చేరుకొనుటకైన యెహోవా ఆహ్వానమును నిర్భయముగా అంగీకరించి ఎక్కువగా రాజ్య సేవలో పాల్గొనుచున్నందున ఆమె అనేకులకు ఆత్మీయ విశ్రాంతిని తెచ్చిపెట్టినది.
6 మొదటి శతాబ్దములో వలెనే ఈనాడు ప్రజలు ఈ ఆహ్వానమునకు జవాబిచ్చును. తమ తలంపును మార్చుకొనుచు, మనస్సును నూతనముగా చేసికొనుచు, దేవుని అగౌరవపరచు అలవాట్లను వదలివేయుచున్నారు. వారు సమర్పించుకొనిన సాక్షుల అంతర్జాతీయ సహోదరత్వములో భాగమగుచు ఇంకను యథార్థహృదయము గలవారితో “రమ్ము!” అని చెప్పుటలో ఆత్మతోను మరియు పెండ్లి కుమార్తెతోను ఏకమగుచున్నారు.
7 అనేక దేశములలో విస్తారముగా వృద్ధిచెందుతున్న రాజ్యపని మరియు బ్రాంచి ఆఫీసులలోని విస్తరణ కార్యక్రమము యెహోవా ఆశీర్వాదమునకు సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే ఈ పాత విధానమునకు కాలము వేగముగా గతించిపోవుచున్నది. కావున ఒకవేళ ఇతరులును వెంటనే జవాబిచ్చి వినినదానిపే పనిచేయులాగున “రమ్ము!” అని ఆహ్వానమును అందించుటలో నిర్భయమును మరియు ఆసక్తిని ఆహ్వానమును అందించుటలో నిర్భయమును మరియు ఆసక్తిని ప్రదర్శించుటకు ఇదే ఆనుకూల సమయము.—అ. కార్య. 20:26, 27; రోమీ. 12:1.