యెహోవా సాక్షులుగా మన రాజ్యపరిచర్యను నెరవేర్చుట
1 యెహోవాసాక్షులముగా మనకు భూమిపై అత్యంత గొప్ప ఆధిక్యత ఉన్నది. దేవుళ్లుగా ఆరాధించబడు వారినందరిని పరీక్షలో పెట్టు విశ్వన్యాయసభ వివాదాంశమునందు మనము యెహోవాకు ప్రాతినిధ్యము వహించుచున్నాము. (యెషయా. 41:1, 23; 43:12) మన నిరీక్షణను గూర్చి మనము యోగ్యమైన రీతిగా హేతువును చూపి సమర్థించుకొనునట్లు సహాయపడుటకై బాగుగా కూర్చబడియున్న ఒక ప్రచురణ గ్రంథాలయమును యెహోవా మనకు అనుగ్రహించియున్నాడు. (1 పేతు. 3:15) మనకు కావలసిన సమాచారమును కనుగొనుటకు ది వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ ఒక ప్రాముఖ్యమైన కీలకమైయున్నది. దానియొక్క కొన్ని ముఖ్యమైన భాగములతో పరిచయము కలిగియుండుట యనునది దానినుపయోగించుటలో ఎక్కువ నైపుణ్యమును కలిగియుండుటకు మనకు సహాయపడును.
2 అందులోని ముఖ్య శీర్షికయగు “యెహోవా” అను దానితో మనమందరము బాగుగా పరిచయము కలిగియుండవలెను. 1986-1989 ఇండెక్స్‌లోని ఆ శీర్షిక క్రింద, యెహోవా తాత్కాలికముగా చెడును ఎందుకు అనుమతించాడో వివరించు సంబంధిత విషయములను మీరు కనుగొనగలరా? అంతేగాక 1930-1985 ఇండెక్స్లోను మరియు ప్రస్తుత ఇండెక్స్‌లోని ఆ శీర్షికలో మధ్యగా ఉంచబడిన “నామము” అను శీర్షికను మీరు కనుగొందురు. ఇందులో యెహోవా అను నామమును గూర్చి ప్రచురించబడిన సంబంధిత విషయములన్నియు ఇందులో సమకూర్చబడియున్నవి.
3 ఎక్కువ ప్రాముఖ్యతగల మరొక శీర్షిక ఏమనగా “యెహోవాసాక్షులు” అనునది. ఒక సంస్థగా యెహోవాసాక్షులనుగూర్చి తెలిపిన సమాచార భాగములన్నిటిని ఒకచోట అది సమకూర్చెను. అత్యున్నతంగా పురోభివృద్ధి చెందిన విద్య, శవపరీక్ష, ఆత్మరక్షణకై చంపుట, ప్రజాసంక్షేమ విషయములకు సహాయపడుట మొదలగు విషయములందు అధికార యుక్తముగా మన అభిప్రాయమేమో మీకు తెలియునా? అటువంటి వాటికి సంబంధించిన ప్రశ్నలకు “వాటి యెడలగల దృక్పథము—.” అనబడు దానియొక్క ఉపశీర్షిక క్రింద సంబంధిత విషయములను నీవు కనుగొందువు. మరియు దానితోపాటు అనేక దేశములలోని యెహోవా సాక్షుల ఆధునిక చరిత్ర, మరియు మధ్యగా ఉంచబడిన “ఇతరుల వాఙ్మూలములు” అను శీర్షికక్రింద యెహోవాసాక్షులను గూర్చి ఇతరులుచేసిన వ్యాఖ్యానముల పట్టిక కనుగొనబడును.
4 అనేక ముఖ్యశీర్షికలను ఉపయోగించుటద్వారా ఆధునిక కాలములలో యెహోవా ప్రజలు తమ రాజ్యపరిచర్యను ఎలా నెరవేర్చారను దానిని కనుగొనవచ్చును. “తేదీలు” అను శీర్షిక కలదు. సిద్ధాంతములు, ప్రవచనము మరియు ప్రవచన రూపాలపైన మన గ్రహింపుయొక్క ప్రాముఖ్య వివరణలు క్రమపద్ధతిలో సంవత్సరమువారిగా ఇవ్వబడియున్నవి. “ప్రవచన గుర్తింపుయొక్క తారీఖులు” దాదాపు వాటి వెంటనే ఇవ్వబడినవి. ఇవన్నియు ప్రవచనములు లేక ప్రవచన రూపాలు నెరవేరుటకు ప్రారంభమయిన లేక నెరవేరిన సంవత్సరములైయున్నవి.
5 యెహోవా యొక్క నమ్మకమైన సేవకుల జీవిత కథలు మనకు ప్రోత్సాహమునకు మరియు ఉపదేశమునకు మూలమైయున్నవి. అవి మన పిల్లలలోను మరియు బైబిలు విద్యార్థులలోను భవిష్యుత్తుకొరకై స్థిరమైన పునాదిని వేయుటకు మనకు సహాయపడగలవు. ఈ జీవిత కథలు వారి వ్యక్తిగత పేర్ల ద్వారా చూపబడుటను మరియు “యెహోవాసాక్షుల జీవిత కథలు” అను శీర్షిక క్రింద ఇవ్వబడుటను మీరు కనుగొందురు.
6 యెహోవా ప్రజలకు సాటిలేని ఒక ప్రత్యేక సంగతేమనగా యెహోవాచే అంగీకరించబడిన వారికి గల రెండు గమ్యములు అను లేఖనానుసార బోధయైయున్నది. అవేమనగా ఒకటి పరలోక సంబంధమైనది. మరొకటి భూసంబంధమైనది. “పరలోకసంబంధమైన పిలుపు” పొందిన వారికి సంబంధించిన విషయములను మనము కనుగొనగల ప్రధాన శీర్షిక “దేవుని సంఘము” అనునది. (హెబ్రీ. 3:1; అ. కార్య. 20:28; 1 తిమో. 3:15) ఇతర శీర్షికలేమనగా “శేషము” “1,44,000.” తదుపరి భూమిపై నిత్యజీవ నిరీక్షణ గలవారికి సంబంధముగా తెలియజేయుటకు “గొప్పసమూహము,” “వేరే గొర్రెలు” అను రెండు శీర్షికలు ప్రాముఖ్యమైనవి.—ప్రక. 7:9; యోహా. 10:16.
7 మనము యౌవనులమైనను లేక వృద్ధులమైనను యెహోవాసాక్షులలో ఒకరిగా ఉండు ఆధిక్యత జీవితము యొక్క ప్రతి భాగమును మిళితము చేయునదైయున్నది. మన రాజ్య పరిచర్యలో భవిష్యత్తు నందు రాబోవు శీర్షికలు మన పరిచర్యలో, సంఘములో, కుటుంబములో, మరియు ప్రాంతములో ఇండెక్స్ మనకెట్లు సహాయపడగలదో చూపును.