రక్తము నీ ప్రాణమును ఎలా కాపాడగలదు? బ్రోషూరు పఠనము కొరకు ప్రశ్నలు
పఠనములో కొన్నిచోట్ల, 27-31 పుటలయందలి అనుబంధంలోని విషయములు సూచింపబడినవి. సమయము అనుమతించుకొలది సూచింపబడిన అనుబంధమందలి పేరాలు చదువబడుచుండగా, వాటిమీది వ్యాఖ్యానములను కూడ పఠనములో చేర్చవచ్చును.
మొదటి వారము
పుట 2
1-4. రక్తము ప్రాణమును ఎలా కాపాడునని ఆలోచించుట ఎందుకు సమయోచితమై యున్నది? (పుట 27, పేరాలు 1-3 చూడుము.)
పుట 3
1, 2. రక్తముతో జీవితము సంబంధము కలిగియున్నదను అభిప్రాయము ఎందుకు సహజమై యున్నది?
3, 4. రక్తమునుగూర్చి దేవుడు చెప్పుదానిని తెలిసికొనుటకు మనము ఎందుకు ఆసక్తికలిగి యుండవలెను?
5. ఏ కారణముచేత మనము ఆదికాండము 9:3-6 యెడల శ్రద్ధచూపవలెను, మరియు ఆ అంశముయొక్క ప్రాముఖ్యత ఏమిటి?
6. ఇశ్రాయేలీయులు రక్తము విషయమై ఎటువంటి బాధ్యతల క్రింద ఉండిరి?
పుట 4
1, 2. దేవుని నియమములు ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఏ విధముగా సహాయపడెను, అయితే ఇశ్రాయేలీయులు రక్తమును విసర్జించుటకు ఏ ముఖ్య కారణము కలదు?
3. అత్యవసర పరిస్థితులలో రక్తముపైగల నియమమును ఏ విధముగా యోచించవలెను?
పుట 5
1, 2. రక్తముపైగల నియమము విషయములో, యేసు ఏ మాదరినినుంచెను?
3, 4. (ఎ) క్రైస్తవులనుగూర్చి మరియు రక్తమునుగూర్చి అపొస్తలుల సభ ఏమని తీర్మానించెను? (బి) రక్తమును విసర్జించుట కేవలము తాత్కాలికమైన ఆజ్ఞనా కాదాయని మనకెట్లు తెలియును?
5. యేసు అపొస్తలుల ప్రకారము రక్తమును విసర్జించుట ఎంత ప్రాముఖ్యమైయున్నది?
6, 7. రక్తమునుగూర్చిన తీర్మానము ఒక శాశ్వతమైన అవసరతయని ఇంకా ఏ రుజువులు చూపించుచున్నవి?
పుట 6
1, 2. క్రైస్తవులకంటె ముందున్న కాలములో వైద్యశాస్త్ర సంబంధముగా రక్తము ఎలా ఉపయోగింపబడియున్నది?
3. మొదటి శతాబ్ద క్రైస్తవులు రోమన్ల కాలములో వైద్యశాస్త్ర సంబంధముగా ఉపయోగించుటకు ఏ విధముగా ప్రతిస్పందించిరి?
4-6. (ఎ) రక్తమార్పడియొక్క వాడుక ఎట్లు మొదలయ్యెను? (బి) దేవుని నియమము ప్రకారము రక్తనాళములద్వారా రక్తమార్పిడి జరిగించుట ఎందుకు తప్పైయున్నది?
7. యెహోవా సాక్షులు రక్తమార్పిడిని ఎందుకు నిరాకరింతురు? (పుట 27, పేరాలు 4-6, మరియు పుట 28, పేరా 1.)
పుట 7
1. క్రైస్తవులు రక్తమార్పిడిని విసర్జించుటకు ప్రాథమిక కారణము మతపరమైనదైనను, రక్తచికిత్సయొక్క వైద్య సంబంధమైన వివిధ ఆకృతులను మనమెందుకు పరిశీలించవలెను?
రెండవ వారము
పుట 7
2, 3. ఆధునిక వైద్యశాస్త్రములో రక్తమార్పిడి ఎటువంటి స్థానమును కలిగియున్నది?
4, 5. రక్తమార్పిడి అపాయకరమా అని ఆలోచించుట ఎందుకు కారణయుక్తమైనది?
పుట 8
1. మనము రక్తమార్పిడిని గురించి వివేకముతో ఏమి అడుగుదుము?
2, 3. రక్తమును వర్గీకరించుట, ఒకదానికొకటి కలిపి చూచుట క్లిష్టమైనదే కాకుండ కావలసినంత సంతృప్తికరముగా ఎందుకు లేదు?
4, 5. రక్తమార్పిడి ఏ విధముగా రోగనిరోధక సమస్యలను తీసికొనిరాగలదు?
6, 7. క్యాన్సరు శస్త్రచికిత్స తర్వాత, రక్తమార్పిడి ఏ విధమైన హాని చేయవచ్చును?
పుట 9
1. రక్తమార్పిడి మరియు క్యాన్సరు శస్త్రచికిత్సను గూర్చిన రుజువుయొక్క ప్రాముఖ్యత ఏమి?
2, 3. రక్తమార్పిడిలు ఇంకా ఏ ఇతర వ్యాధినిరోధక హాని చేయవచ్చును?
4, 5. రక్తమార్పిడివలన వచ్చు వ్యాధియొక్క ఆపదను ప్రజలు తెలిసికొను అవసరము ఎందుకు కలదు?
పుట 10 (బాక్సు)
1, 2. రక్తమార్పిడిద్వారా కాలేయముపైవచ్చు జబ్బు యొక్క అపాయం ఎంత తీవ్రమైనది?
3. ఒకప్పుడు, రక్తముద్వారా కాలేయముపైవచ్చు జబ్బు యొక్క అపాయం అధిగమించబడుచుండెనని ఎందుకు కనిపించెను?
4, 5. రక్తముద్వారా కాలేయముపైవచ్చు జబ్బుయొక్క అపాయం ఇంకను అలక్ష్యము చేయకూడనిదిగా యున్నదని వృద్ధియైన ఏ సంగతులు రుజువుపరచినవి?
6-8. కాలేయముపైవచ్చు జబ్బునుగూర్చిన చింత గతించి పోయిన సంగతి ఎందుకుకాదు?
పుట 11
1. రక్తమువలన కలుగు వ్యాధుల అపాయము అప్పుడే కనుమరుగు కాలేదని ఏది దృష్టాంతపరచుచున్నది?
2-4. తన ప్రాంతములో సాధారణముగా లేనటువంటి వ్యాధులకు రక్తము ఒక మనుష్యుని ఎలా గురిచేస్తుంది? (పుట 11లోని బాక్సుకూడ చూడుము.)
5-7. ప్రాణమునకు అపాయము తెచ్చు జబ్బులు రక్తముతో ముడిపడియున్నవని సర్వవ్యాప్తితమైన ఎయిడ్స్ వ్యాధి ఎలా చూపించినది?
పుట 12
1, 2. తెల్ల రక్తకణములతో ఎయిడ్స్ వైరస్ను కనిపెట్టుటకు చేసిన పరీక్షలుకూడ రక్తము నిరపాయమని ఎందుకు అభయమిచ్చుట లేదు?
3-5. ఎయిడ్స్ వైరస్యొక్క బెదిరింపుతోనే విషయము ఎందుకు సమాప్తము కాదు?
6, 7. రక్తము వలనవచ్చే వైరస్ను గూర్చి నిపుణులు ఏ న్యాయమైన వ్యాకులత కలిగియున్నారు?
మూడవ వారము
పుట 13
1, 2. నాణ్యతగల వైద్య జాగ్రత్తలు ఎవరికి కావాలి, ఇందులో ఏమి ఇమిడియున్నది?
3-5. రక్తమార్పిడి వేరే ప్రత్యామ్నాయములు ఉన్నవని నీవు ఎలా విశదీకరిస్తావు?
6-8. తరచుగా ఎప్పుడు రక్తమార్పిడి జరుగును, కాని ఈ అభ్యాసము ఎందుకు ప్రామాణికమైనది?
పుట 14
1. సామాన్యముగా ఉండే హిమోగ్లోబిన్ మట్టము తగ్గినచో అది నింపబడవచ్చని ఏది చూపించుచున్నది?
2, 3. రక్తము ఎక్కువగా పోయినట్లయితే ఏమి అవసరము మరియు ఆ సమస్యకు ఎట్లు చికిత్స చేయవచ్చును?
4. రక్తము పోయినచో, ఆ రక్తమును భర్తీచేయగల రక్తము కానటువంటి ద్రవపదార్థములు ఎందుకు బాగా పనిచేయగలవు?
5. రోగికి ఎర్రరక్త కణములు తగ్గినచో వైద్యులు అతనితో ఎలా సహకరించగలరు?
పుట 15
1. ఎర్ర రక్తకణములను త్వరగా ఉత్పత్తి చేయుటకు ఏమి చేయవచ్చును?
2-4. శస్త్రచికిత్స చేయునప్పుడు, రక్తము పోవుటను ఎలా కొంతవరకు అరికట్టవచ్చును?
పుట 16
1-3. పెద్ద శస్త్రచికిత్స మార్పిడి లేకుండా సాధ్యపడునని ఏ రుజువు చూపుచున్నది?
4-6. రక్తమును ఎక్కించకుండా ఎన్ని విధములుగా శస్త్ర చికిత్స చేయుటకు సాధ్యపడుతుంది? (పుట 28, పేరాలు 2-4 చూడుము.)
పుట 17
1. రక్తమును ఎక్కించకుండా చేసినటువంటి గుండె శస్త్రచికిత్సలో ఎటువంటి మంచి ఫలితములు వచ్చినవి?
2-4. రక్తము ఉపయోగించకుండా చేసినటువంటి శస్త్రచికిత్సలో రోగులుగా ఉన్నటువంటి సాక్షులు ఎటువంటి శ్రేష్టమైన అనుభవాలను అందజేస్తున్నారు?
నాల్గవ వారము
పుట 17
5, 6. అపాయకరమైన/లాభకరమైన పరిశీలన ఏమిటి, మరియు అది ఎట్లు నియమించబడినది?
పుట 19
1, 2. రోగి ఎటువంటి పాత్రను అపాయకరమైన/లాభకరమైన పరిశీలనలో వహించగలడు?
3-5. అపాయకరమైన, మరియు లాభకరమైన వాటిని తగినట్లుగా చూచుటయందు రక్తచికిత్స ఎందుకు ఇమిడియున్నది? (పుట 31 పేరాలు 1, 2 చూడుము.)
6. వైద్యచికిత్సలను ఎన్నుకొనుట అనే మీ హక్కు ఏ న్యాయానుసారమైన సూత్రముమీద ఆధారపడియున్నది? (పుట 30, పేరాలు 1-8 చూడుము.)
పుట 18 (బాక్సు)
1-4. రోగులుగా ఉన్నటువంటి సాక్షులు వైద్య సిబ్బందిని న్యాయసంబంధమైన చట్టమునుండి విముక్తి చేయుటకు ఏమి చేస్తారు? (పుట 28, పేరా 5 చూడుము.)
5-7. సాక్షులు, వైద్యసిబ్బిందిని న్యాయానుసారమైన చట్టమునుండి పూర్తిగా విడిపిస్తున్నప్పుడు, వైద్యులు మరియు వైద్యశాలలు సాక్షులకు సహకరించుట ఎందుకు సమంజసమైయున్నది?
పుట 20
1-3. కొంతమంది వైద్య ఉద్యోగస్థులు సాక్షులు తీసుకొన్నటువంటి స్థానమునకు ఎట్లు ప్రతిస్పందించిరి?
4, 5. రోగులైనటువంటి కొంతమంది సాక్షుల వ్యాజ్యములలో కొన్ని న్యాయస్థానములు ఎట్లు ఇమిడియున్నవి?
పుట 21
1, 2. సాక్షులు మరియు రక్తము ఇమిడియున్న వ్యాజ్యములతో వ్యవహరించుటకు న్యాయస్థానము వైపు తిరుగుట ఎందుకు మంచి మార్గముకాదు?
3, 4. రోగి పిల్లవాడైనప్పుడు న్యాయస్థానమువైపు తిరుగుట ఏ కారణముచేత తగినదిగా ఉండదు?
5, 6. పిల్లలకు చికిత్సను ఎన్నుకొనునప్పుడు తల్లిదండ్రుల విషయములోనికి వచ్చు హక్కు ఏది? (పుట 28, పేరా 6, మరియు పుట 29, పేరా 1 చూడుము.)
పుట 22
1-4. పిల్లలకోసం తల్లిదండ్రులు స్వేచ్ఛగా వైద్య తీర్మానములు చేయుటకు కొన్ని చట్టరీత్యమైన సూచనలేవి?
5. సాక్షుల తల్లిదండ్రులు మరియు వైద్యసిబ్బంది ఎందుకు కలిసి పనిచేయవలెను?
ఐదవ వారము
పుట 22
6, 7. రక్తము లేకుండ వైద్యము చేయవలెనను సాక్షులు విన్నపము మరియు రక్తమునుగూర్చి ఏ కీలకమైన వాస్తవములను మనస్సునందుంచుకొనవలెను?
పుట 23
1-3. రక్తమును నిరాకరించినందున కొందరు చనిపోయినను, మనము దేనిని అలక్ష్యము చేయకూడదు? (పుట 29, పేరాలు 2-5, మరియు పుట 31, పేరాలు 3-5 చూడుము.)
4, 5. మరణము మరియు రక్తమునుగూర్చి నిజమైన దృష్టి ఏమైయున్నది?
పుట 24
1, 2. రక్తము నిజముగా ప్రాణమును కాపాడును అనుటకు మనకు ఏది సహాయము చేయును?
3, 4. క్రైస్తవులకంటే ముందున్న కాలములలో, రక్తమునుగూర్చి దేవుని దృష్టి ఏమైయున్నది, మరియు ఎందుకు?
పుట 25
1. పాపపరిహారార్థ దినమున రక్తము ఎట్లు ఇమిడియుండెను, మరియు మనమెందుకు లక్ష్యపెట్టవలెను?
2, 3. పాపపరిహారార్థ దినము మరియు యేసు పాత్రకు మధ్య ఏ సంబంధము కలదు?
4. (ఎ) క్రైస్తవులు రక్తమును విసర్జించుటకు ఏ ముఖ్య కారణము కలదు? (బి) రక్తమార్పిడివలన వచ్చు అపాయములను మనమెందుకు అంతగా నొక్కి తెల్పకూడదు?
5, 6. (ఎ) దేవునితో మన స్థానమునకు రక్తము ఎలా సంబంధము కలిగియున్నది? (బి) రక్తముమీద మన అభిప్రాయము కొరకు ఏ బోధను మనము ప్రధానముగా అర్థము చేసికొనవలెను?
7. రక్తముపై సాక్షులు కలిగియున్న స్థానము జీవమును గౌరవిస్తుందని మనమెందుకు చెప్పవచ్చును?
పుట 26
1, 2. మన నిత్య భవిష్యత్తునందు రక్తము ఎలా ఇమిడియున్నది?