మనుష్యులను అంధకారమునుండి వెలుగునకు మరల్చుము
1 ఆత్మీయాంధకారము భూమిని ఆవరించియున్నది. (యెష. 60:2) మానవులు పాపములో పడినదగ్గరనుండి, “ఈ యుగసంబంధమైన దేవత” అయిన సాతాను ప్రజలను ఆత్మీయాంధకారములో ఉంచెను. తత్ఫలితముగా నైతిక దిగజారుడుతనము ఏర్పడినది.—2 కొరిం. 4:4.
2 మనమిప్పుడు సత్యముచే వెలిగించబడితిమి గనుక, యేసువలె మనముకూడ ప్రజలయెడల జాలిపడుచున్నామా? (మత్త. 9:36) అట్లయితే, ఆయన ‘ప్రజల కన్నులను తెరచుటకు, వారిని చీకటినుండి వెలుగునకు, సాతాను అధికారమునుండి దేవునివైపు త్రిప్పుటకు’ అపొస్తలుడైన పౌలుకు ఇచ్చిన ఆజ్ఞను మనము అభినందించగలము.—అపొ. కార్య. 26:16-18.
మనస్సులను, హృదయములను వెలిగించుము
3 తమ వశమున పడినవారి మనస్సును సాతాను అంధకారము చేసి హృదయమును కఠినపరచును గనుక వారికి తోడ్పడుటకు మనమేమి చేయగలము? దేవుని వాక్యముతో వారి మనస్సును, హృదయమును చేరవలసియున్నాము. ఎఫెసీయుల మనోనేత్రములు వెలిగింపబడవలెనని పౌలు ప్రార్థించెను. (ఎఫె. 1:17, 18) హృదయమును చేరుటకు దేవుని వాక్యముకంటె శక్తివంతమైనదేదియు లేదు. (హెబ్రీ. 4:12) దీనిని ఎరిగినవారమైతే ఇతరులతో మాట్లాడునప్పుడు బైబిలునుపయోగించు నైపుణ్యమును పెంపొందించుకొనుటకు మనలను పురికొల్పవలెను.
4 పరిచర్యలో మరింత ప్రభావితమగుటకు ఈ క్రింది ప్రశ్నలకు మీరిచ్చు జవాబులు తోడ్పడగలవు. ప్రాంతీయ సేవకు నీవు బాగుగా సిద్ధపడుచున్నావా? ఇంటివారి ఆసక్తిని గ్రహించగలిగే సంభాషణ ప్రారంభించగల అంశములతో నీవు సుపరిచితుడవగు అభ్యాససిద్ధమైన కార్యక్రమములను నీవు కలిగియున్నావా? ప్రస్తుత సంభాషణ అంశమును నేర్చుకొని దానిని ఉపయోగించ ప్రయత్నించుటకు నిశ్చయించుకొన్నావా? గుమ్మములవద్ద లేఖనములపై ఒప్పించగలిగే తర్కము చేయుటకు నీవు పట్టుదలతో కృషిసల్పుచున్నావా?—అపొ. కార్య. 17:2.
ది వాచ్‌టవర్ ఒక సహాయకము
5 లక్షలాదిమంది చీకటినుండి వెలుగునకు మరలుటకు ది వాచ్‌టవర్ సహాయపడినది. బైబిలు నైతిక సూత్రములను ఎట్లు అన్వయించాలో, మనకాలము కొరకైన ప్రవచనములను ఎట్లు గ్రహించాలో, యెహోవా అంగీకరించునట్లు నడుచుకొనుటకు ఏది నిజమైన మతమో, ఏది అబద్ధమైనదో తేడాను ఎలా చూడాలో అది చూపును.
6 ది వాచ్‌టవర్‌లో ప్రచురింపబడిన శ్రేష్టమైన బైబిలు సత్యములు ఎట్టి ఫలితములను తెచ్చెను? దేవునిగూర్చి ఆయన కుమారునిగూర్చిన ఖచ్చితమైన జ్ఞానముద్వారా సకల విధముల మనుష్యులు రక్షణకు మరల్చబడుచున్నారు. (యోహా. 17:3; 1 తిమో. 2:4) ఒక పాఠకుడు ఇలా వ్రాసెను: ‘ది వాచ్‌టవర్‌ను నేనెంతగా మెచ్చుకొనుచున్నాను! మనము జీవిస్తున్న కాలములను, సమయములను తేటగా గ్రహించునట్లు శీర్షికలు అందరికి సహాయపడెను. నిజంగా ఆత్మీయాహారమైన ది వాచ్‌టవర్‌ను సిద్ధపర్చుటలో విస్తృత పరిశోధన, అధ్యయనము, పనియంతటి విషయములో మీకు మా ధన్యవాదములు.’
వివేకమును ఉపయోగించుము
7 వాచ్‌టవర్ చందా అందించు ప్రత్యేకమైన పనిలో ఈ రెండవనెలలో మనుష్యులను అంధకారమునుండి వెలుగులోనికి మరల్చే అవకాశములను మనము అన్వేషించాలి ఇంటింటా మనము సందర్శించు ప్రజలతో చేయు బైబిలు చర్చలు దీనిని చేయుటకు మనకు దోహదపడును. రాజ్యవర్తమానము యెడల ప్రజలు నిజమైన ఆసక్తిని కలిగియుండుటకు ప్రజలకు తోడ్పడాలని మనము కోరుచున్నాము. దీనిని చేయుటకు శ్రేష్టమైన మార్గములలో ఒకటి ది వాచ్‌టవర్ కొరకు సంవత్సర చందా అందించుటయే. ఒకవేళ ఆ వ్యక్తి చందాచేయకపోయినను, మన పత్రికలను అంగీకరించవచ్చును అలాంటి వారిని మీ పత్రికా మార్గమందు చేర్చుటకు ప్రయత్నించుము. తుదకు వారు ఆ పత్రికల విలువను గ్రహించి చివరకు అవి చందాద్వారా తమ గృహములకు క్రమంగా వచ్చు ఏర్పాటు చేసికొనవచ్చును. చందా స్వీకరించిన చోట తదుపరి సందర్శించుటకు మరియు చందా ముగియుచుండగా దానిని పునఃప్రారంభించుటకు వీలగునట్లు మంచి రికార్డును కలిగియుండుము.
8 మనము ఇంటింటికి వెళ్లుచు, వీధిసాక్ష్యములో పాల్గొనుచు, లేదా తోటిపనివారికి, తోటి విద్యార్థులకు, బంధువులకు తటస్థ సాక్ష్యమిచ్చుచుండగా ప్రజలను స్వతంత్రులను చేయు సత్యమును వ్యాప్తిచేయుటలో పాలుపంచుకొందము. (యోహా. 8:32) స్వాతంత్ర్యమును పొంది నిత్యజీవ నిరీక్షణను గుర్తెరుగునట్లు చేయుటకు మరియు అంధకారమునుండి వెలుగునకు వారిని మరల్చుటకు సహాయపడుటలో ది వాచ్‌టవర్ ఒక ప్రత్యేకసాధనమైయున్నది.