సువార్తనందించుట—సూటిగా సమీపించుటద్వారా పఠనములను ప్రారంభించుట
1 “శిష్యులను చేయుడని” యేసు మనకాజ్ఞాపించెను. (మత్త. 28:19) దీనిని నెరవేర్చుటకు సాధారణముగా ఆసక్తిగలవారితో బైబిలు పఠనములను ప్రారంభించుట అవసరము. బైబిలు పఠనములను ప్రారంభించుటకు ఇంటింటి పరిచర్యలో సూటిగా సమీపించుట దీనిని త్వరగా నెరవేర్చుటకు మనకు సహాయపడగలదు. అంతేకాకుండ అది దర్శించుటలోని ముఖ్య సంకల్పమును స్పష్టముగా గుర్తించుటకు పనిచేయును.
2 బైబిలు పఠనములను ప్రారంభించుటలో సూటిగా సమీపించునప్పుడు మనమేమి చెప్పవచ్చును? చాలా సరళముగా సమీపించుట శ్రేష్టము. మనమిట్లు చెప్పవచ్చును: “బైబిలును అర్థము చేసికొనుటకు ప్రజలకు సహాయము చేయవలెనని నేను ఇష్టపడుచున్నాను. మరియు నేను మీతో మీ కుటుంబముతో కూడ దానిని పఠించవలెనని కోరుకొనుచున్నాను. దానికొరకు మీరు ఏ మూల్యము చెల్లించనక్కరలేదు లేక మీకు ఏ భారము ఉండదు. మీ బైబిలునే మనము ఉపయోగించవచ్చును. ఒకవేళ బైబిలు మీ దగ్గర లేనట్లయిన, నేను మీకొరకు ఒకటి తీసుకురాగలను.”
3 మరొక విధానమేమనగా: “గృహ బైబిలు పఠనమును ప్రోత్సహించవలెనను ఉద్దేశ్యముతో ఈరోజు నేను అందరిని కలుస్తున్నాను. ఈ లోకము ఎక్కడికి పయనించుచున్నది మరియు దేవుడు మనకొరకు ఏమి కలిగియున్నాడో అర్థము చేసికొనుటకు అది మనకు సహాయము చేయును. మీ బైబిలునుండి మీరు అధిక ప్రయోజనమునెట్లు పొందగలరో చూపించుటకు నేను ఇష్టపడుచున్నాను. దానికొరకు మీరు ఏ మూల్యము చెల్లించనక్కరలేదు లేకు మీకు ఏ భారము ఉండదు.” గృహ యజమాని అంగీకరించినట్లయిన, మీరు లైఫ్ ఇన్ ఎ పీస్పుల్ న్యూ వరల్డ్ లేక క్రియేషన్ పుస్తకమును ఉపయోగించవచ్చును. పుస్తకములో పుట 234, పేరా 6ను ఉపయోగించి ప్రారంభించవచ్చును. ఈ అధ్యాయములోని ప్రారంభపుటలు పరదైసును పునరుద్ధరించు యెహోవా వాగ్దానమును ఉన్నతపరచుచున్నవి.
4 బైబిలు కరపత్రములను ఉపయోగించుము: సూటిగా సమీపించుటలో కరపత్రములు సహాయకరముగాయున్నట్లు అనేకులు కనుగొనిరి. యింటివారు గుమ్మముయొద్దకు వచ్చినప్పుడు, మడత పెట్టకుండా లైఫ్ ఇన్ ఎ పీస్పుల్ న్యూ వరల్డ్ అను కరపత్రమును వారి చేతికివ్వండి, అలా వారు దానిపైగల దృష్టాంతమును పూర్తిగా చూడగలరు. మరొక కరపత్రమును మీ చేతిలో ఉంచుకొని, మొదటి రెండు పేరాలలోని ప్రశ్నలను చదువుము లేక వాటి భావము వచ్చురీతిగా మాట్లాడుము. జవాబులను చర్చించి, బలపరచు ఒకటి లేక రెండు లేఖనములను చదువుము. ఈ చర్చ మీకు సంతోషము కల్గించినదని ప్రస్తావించి, మరలా తిరిగివచ్చు ఏర్పాటు చేసికొనుము. సరియని తోచనట్లయిన, క్లుప్తముగా మన ఉచిత బైబిలు పఠన కార్యక్రమమును వివరించుము, లేదా కరపత్రములోని మరొక అంశమును విచారించుటకు మరలా దర్శించు ఏర్పాటు చేసికొనుము.
5 మరలా తిరిగివచ్చు ఏర్పాటు చేయునప్పుడు, యింటి యజమానికి ఆసక్తికరమైన అంశమని మీరు తలంచు ఒకానొక విషయమును ప్రస్తావించుట మంచిది. ఇది ప్రశ్న రూపములో ఉండవలెను. ఇది ఆ ప్రశ్న జవాబు కొరకు యింటి యజమాని మీరు మరలా దర్శించుట కొరకు ఎదురుచూచులాగున చేయును.
6 క్రియేషన్ పుస్తకము అనేక రీతులలో అసాధారణమైయున్నది. దేవుని ఉనికిని నిరూపించు దృఢమైన రుజువును అది సమకూర్చుచున్నది. పరిణామము ఎందుకు సత్యము కాజాలదో అది చూపించుచున్నది. బైబిలును దేవుని వాక్యముగా మనమెందుకు నమ్మగలమో అది చూపించుచున్నది. 18 మరియు 19 అధ్యాయములలోని దృష్టాంతములు, సహృదయులైన ప్రజల శ్రద్ధను చూరగొని, బైబిలు మరియు యెహోవా సంకల్పముల యెడల వారి ఆసక్తిని పెంచును. కావున మనందరము పఠనములను ప్రారంభించుటకు ప్రతి అవకాశమును తీసికొని, “శిష్యులను చేయుడి,” అను ఆజ్ఞను పాటించుటలో భాగము వహింతుము గాక.—మత్త. 24:14; 28:19, 20; మార్కు 13:10.