డిశంబరులో బైబిలు పఠనాలను ప్రారంభించుట
1 సువార్తను బోధించేవారిగా ఉండాలని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. (మత్త. 28:19, 20) మనము ఇతరులకు బోధించే ప్రాథమిక పద్ధతి ఏమంటే బైబిలు పఠనాలను నిర్వహించడమే. మీరు ఈ పనిలో భాగం వహిస్తున్నారా? లేనట్లైతే, ఇతరులకు బోధించడంలో పాల్గొనడం ద్వారా ఆనందాన్ని అనుభవించడానికి మీరెలా ఒక పఠనాన్ని ప్రారంభించవచ్చు?
2 బహుశ మనం విల్ దిస్ వరల్డ్ సర్వైవ్? అనే కరపత్రాన్ని గృహస్థునికి యిచ్చి, దానిలోని విషయాలను చర్చించేందుకు తిరిగి దర్శిస్తామని వాగ్దానం చేసి ఉంటాం.
మనం “విల్ దిస్ వరల్డ్ సర్వైవ్” అనే కరపత్రాన్ని ఇచ్చివచ్చిన గృహస్థున్ని తిరిగి దర్శించినప్పుడు, మనమిలా అనవచ్చు:
◼ “కొన్ని రోజులక్రితం నేనిక్కడకు వచ్చినప్పుడు, మనం మన కాలంయొక్క ప్రాముఖ్యతనుగూర్చి అంటే మన కాల పరిస్థితులనుగూర్చి యేసు కచ్చితంగా వర్ణించినదాన్ని గూర్చి చర్చించాం. నేను మీతో కొద్ది నిమిషాలు గడిపి, మీకిచ్చిన కరపత్రంనుండి కొంత సమాచారాన్ని క్లుప్తంగా చర్చించాలను కుంటున్నాను. ‘ది సైన్’ అనే ఉపశీర్షిక క్రింద వివరించిన దాన్ని గమనించండి.” కరపత్రంలోని 3వ పేజీకి త్రిప్పి, ఆ ఉపశీర్షికలోని మొదటి రెండు లేదా మూడు పేరాలను చర్చించి, సమయం అనుమతించే కొలది అక్కడ పేర్కొన్న లేఖనాలను చదవండి. ఈనాడు యేసు చెప్పిన ప్రవచనం ఎలా నెరవేరుతున్నదో నొక్కితెల్పండి. పునర్దర్శించి, ఈ ఉపశీర్షికలోని పేరాలను చర్చించడానికి ఏర్పాటుచేయండి. మీరు తిరిగి దర్శించేముందు విషయాన్ని చదవమని గృహస్థున్ని ప్రోత్సహించండి.
3 లేదా మీరు ఈక్రింది విధంగానైనా చెప్పవచ్చు:
◼ “ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు, నేను మీకు విల్ దిస్ వరల్డ్ సర్వైవ్? అనే కరపత్రాన్ని ఇచ్చివెళ్లాను. ఆ సమయంలో మనం లోక వ్యవహారాల్లో యేసుక్రీస్తుయొక్క పాత్రను గూర్చి మాట్లాడుకున్నాం. మనం యోహాను 17:3లో వ్రాయబడిన ఆయన మాటలను కూడా చదివాం. [చదవండి.] మనం నిత్యజీవాన్ని కోరుకుంటే యేసునుగూర్చి, దేవుని గూర్చి నేర్చుకోవడం ప్రాముఖ్యం గనుక, అలాంటి జ్ఞానాన్ని సంపాదించడానికి మనకు సాధ్యమైందల్లా చేయడం సబబే. యేసు భూమిపైనున్నప్పుడు, దేవుని అద్భుతమైన అనేక లక్షణాలను ఆయన ప్రతిబింబించాడు. యేసునుగూర్చి, ఆయన పరిచర్యను గూర్చి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువగా ఆయన తండ్రిని గూర్చి తెలుసుకుంటామని నమ్మడం కారణసహితంగా లేదంటారా? [జవాబు చెప్పనివ్వండి.] జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే ఈ పుస్తకం ఏమని చెప్తుందో గమనించండి.” నూట పదహారవ అధ్యాయంయొక్క 10వ పేజీలోని మొదటి, రెండు పేరాలను చదవండి. ఈ పుస్తకంలో నాలుగు సువార్తల్లోని యేసునుగూర్చిన వృత్తాంతానికి సంబంధించిన సమాచారమంతా ఉందని, ఆ సంఘటనలు జరిగిన క్రమంలోనే వ్రాయబడిందని నొక్కితెల్పండి. ఒకానొక ప్రత్యేకమైన అధ్యాయంలోని అంశాలను, చిత్రాలను, పుస్తక ప్రారంభంలోని పటాన్ని చూపించండి. తనకొరకు ఒక ప్రతిని 40.00 రూ.ల చందా చెల్లించి తీసుకోవచ్చని గృహస్థునితో చెప్పి, ఆయనకు ఆ పుస్తకాన్ని అందించండి.
4 “జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి” అనే పుస్తకాన్ని తీసుకున్న గృహస్థునికి నమస్కారం చేసిన తర్వాత, మనమిలా అనవచ్చు:
◼ “ముందు దర్శించినప్పుడు నేను చెప్పినట్లుగా, మహాగొప్ప మనిషి అనే పుస్తకం బైబిలు పఠనాల కొరకు తయారుచేయబడింది. దీన్ని అత్యంత ప్రభావవంతమైన పద్ధతిలో ఎలా ఉపయోగించవచ్చునో నేను ప్రదర్శించాలని కోరుకుంటున్నాను.” “పరలోకము నుండి వర్తమానములు” అనే మొదటి అధ్యాయానికి పుస్తకాన్ని త్రిప్పండి. ముద్రించిన ప్రశ్నలకు గృహస్థుని అవధానాన్ని మళ్లించండి. మొదటి ప్రశ్నను చదవండి, ఆ తర్వాత ప్రారంభ పేరాలను పరిశీలించండి. వాటికి రెండవ పేజీలోని చిత్రాన్ని ముడిపెట్టండి. మిగిలిన ప్రశ్నలను కూడా చర్చించి, సమయం అనుకూలించిన కొలది సమాధానాలను ఉన్నతపర్చండి. ఇక ముగించేముందు మరల పునర్దర్శించి, మాట్లాడుకునే ఏర్పాటు చేసుకొనండి.
5 అనుకూలమైన దృక్పథం కల్గివుండి, బాగా సిద్ధపడి, ప్రతి అవకాశాన్ని ఉపయోగించు కోవడం ద్వారా, డిశంబరు నెలలో ఒక బైబిలు పఠనాన్ని ప్రారంభించడానికి మనం బాగా సన్నద్ధులమై ఉంటాము.