సంఘపుస్తక పఠన ఏర్పాటు
భాగము 3: ప్రాంతీయ సేవకొరకైన కేంద్రము
1 గుంపుగా పఠించుటకు స్థలమును సమకూర్చుటకు తోడుగా, సంఘపుస్తక పఠన స్థలము ప్రాంతీయసేవ కొరకైన కూటములకు స్థలముగా కూడ పనిచేయవచ్చును. అటువంటి కూటముల సమయములు ఎక్కువమంది ప్రచారకులకు అనుకూలమైనవిగా ఉండవలెను, మరియు కూటములు ప్రచారకులు ప్రాంతీయసేవ కొరకు వ్యవస్థీకరించుకొనుటకు అభ్యాససిద్ధమైన సహాయమును అందించవలెను.
2 పఠనము మరియు సేవకొరకు సరియైన రీతిలో వ్యవస్థీకరింపబడు గుంపులు ఆత్మీయతను పెంపొందించును. అభ్యంతరములను ఎట్లు ఎదుర్కొనవలెను. సంభాషణను ఎట్లు ప్రారంభించవలెను. బైబిలు పఠనమును ఎట్లు అందించవలెను, లేక పునర్దర్శనమందు ఏమి చెప్పవలెనో అను వాటిమీద ఇవ్వబడిన ప్రోత్సాహము లేక సలహాలద్వారా ప్రయోజనము పొందని వారెవరు? తోటి ప్రచారకులు మరియు పయనీర్లు పుస్తక పఠన స్థలములో కేవలము అటువంటి సహాయమునే అందిస్తున్నారు.—గల. 6:9, 10.
3 నిర్వహకుని పాత్ర: సంఘ పుస్తక పఠన నిర్వాహకుడు నాయకత్వము వహించును మరియు ఆయన గుంపు సేవావిధానమును వ్యవస్థీకరించు బాధ్యతను కలిగియున్నాడు. ప్రాంతీయ సేవలో ఆయన క్రమముగా ప్రచారకులతో పనిచేయును. (1 పేతు. 5:2, 3) సేవకొరకు బహుగా సిద్ధపడిన కూటములు సేవకు గుంపును తయారుచేయుటలో లేఖనములను మరియు అభ్యాససిద్ధమైన సలహాలను నాటింపజేయును. గుంపులన్నియు ఒకే స్థలములో కూడుకొనుటకు బదులు, ప్రతి పుస్తక పఠన గుంపు తమ స్వంత ప్రాంతీయ సేవకొరకైన కూటమును కలిగియుండుట మంచిది. అయితే, అవసరమైనప్పుడు చిన్న గుంపులను రెంటిని కలుపవచ్చును. కావలికోట పఠనము తర్వాత ప్రాంతీయ సేవ ఉన్నట్లయిన, ప్రాంతీయ సేవకొరకైన కూటము క్లుప్తముగా ఉండవలెను. ఆ తర్వాత, ప్రతి పుస్తక పఠన నిర్వాహకుడు తన స్వంత గుంపు యెడల శ్రద్ధవహించవలెను.
4 ఎడతెగక ఉండు ప్రాంతీయ సేవాయేర్పాటు పరిచర్యలో క్రమముగా పాల్గొనుటను ప్రోత్సహించును. నిర్ణయించిన సమయము మరియు స్థలములో సేవకొరకైన కూటములు జరిగినట్లయిన, ప్రాంతము అందుబాటులో ఉన్నది మరియు కలిసి పనిచేయుటకు ఇతరులుకూడ ఉందురనుటద్వారా ప్రోత్సహింపబడినవారై, ప్రచారకులు తదనుగుణ్యముగా పథకము వేసికొందురు. (లూకా 10:1 పోల్చుము.) పఠన నిర్వాహకుడు లేకపోయినప్పుడు సహితము, ఆయన ప్రాంతమును సమకూర్చి గుంపుకొరకు తగిన ఏర్పాట్లు చేయును. (om పు. 44-5) సేవ కొరకైన కూటమును నిర్వహించుటకు ఒకవేళ అర్హతగల సహోదరుడు ఎవరును అందుబాటులో లేనట్లయిన, నిర్వాహకుడు దీనిని చేయుటకు ఒక సహోదరిని అడుగవచ్చును. (om పు. 77-8; km 4/88 పు. 3) సేవకొరకు గుంపు క్రమముగా సాధారణముగా ఒకే సమయములో మరియు స్థలములో కూడుకొనినట్లయిన గందరగోళము ఉండదు. దీనిలో ఏదైనా తాత్కాలిక సవరణ ఉన్నట్లయిన సాధ్యమైతే ఒకవారము ముందుగనే దీనిని ప్రకటించవలెను.
5 సహకారము అవసరము: పరిచర్యలోని వివిధ కార్యక్రమ రూపములయందు అర్థవంతమైన భాగము కలిగియుండుటకు అందరు కృషిచేయవలెను. స్థానికముగా ఉత్పన్నముకాగల అభ్యంతరములు, పరిస్థితుల నిజరూపమును ఉపయోగించుచు, అభ్యాస కార్యక్రమములతో కలిసి సిద్ధపడుటకు ప్రచారకులు చొరవ తీసికొనవచ్చును.—సామెతలు 27:11.
6 శిష్యులను చేయు పనిలో మరింత నైపుణ్యవంతునిగా తయారయ్యేందుకు అనుభవజ్ఞుడైన ప్రచారకుడు నీకు సహాయపడవలెనని కోరుదువా? అట్లయిన మీ సంఘపుస్తక నిర్వాహకునితో మాట్లాడుము. నీకు సహాయపడుటకు ఆయన అర్హతగల ప్రచారకుని ఏర్పాటు చేయగలడు. ప్రయోజనము పొందుటకు, పొందిన సలహాలను అన్వయించుటకు మరియు చేసిన నియామకములకు హత్తుకొనియుండుటకు పట్టుదల కలిగియుండుము.
7 సహాయము చేయుటకు పుస్తక పఠన నిర్వాకునిచే ఏర్పాటు చేయబడినవారు, సహాయకరముగా మరియు వారినుండి అపేక్షించు విషయములలో సహేతుకముగా ఉండవలెను. ప్రాంతీయసేవ యెడల అనుకూల మరియు సమతూక దృష్టిగలవారు మరియు అభ్యాససిద్ధముగా సమీపించువారు ఇతరులకు శ్రేష్టమైన రీతిలో శిక్షణనివ్వగలరని అనుభవము చూపినది. (km 8/79 పు. 3-4; km 9/79 పు. 3-4) అభివృద్ధి సాధించుకొలది అన్ని సమయములలో మెచ్చుకొనవలెను. ఆ పిమ్మట వేరే గమ్యములను పెట్టుకొనవచ్చును.—లూకా 19:17-19 పోల్చుము.
8 సువార్తను ప్రకటించుటలో మరియు శిష్యులను చేయుటలో ఒకరికొకరము సహాయము చేసికొనవలెనని మనము కోరుకొందుము. దిగజారుచున్న లోక పరిస్థితులు ఈ పనియొక్క అత్యవసరతను రుజువు చేయుచున్నవి. ప్రాణములు ఇమిడియున్నవి. మరియు యెహోవా సమకూర్చు పనిని వేగము చేయుచున్నాడు. (యెషయా 60:22) మనకప్పగించబడిన పరిచర్యను మనము మనస్సు నందుంచుకొనుచు ఒకరినొకరము సంపూర్ణముగా ఉపదేశించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ మనకప్పగింపబడిన పనిని నెరవేర్చుటకు మన సంఘపుస్తక పఠన గుంపుతో సన్నిహితముగా పనిచేయుదము.—రోమా. 12:6-8; 2 తిమో. 4:1, 2, 5.