సంఘపుస్తక పఠన ఏర్పాటు
భాగము 4: ఎడతెగక ఒకరినొకరు క్షేమాభివృద్ధి పరచుకొనుము
1 సంఘపుస్తక పఠన గుంపులోని ప్రతిఒక్కరు గుంపులోని ఇతరుల ఆత్మీయాభివృద్ధియందు అర్థవంతమైన పాత్ర వహించవచ్చును. మనమందరము ‘ప్రత్యేకముగా అంతము సమీపించుకొలది ప్రేమచూపుటకు మరియు సత్కార్యములు చేయుటకు ఇతరులను పురికొల్పవలెనను’ ఆజ్ఞకు లోబడవలెనని కోరుకొందుము.—హెబ్రీ. 10:24, 25.
2 ఒకరికొకరు సహాయపడుట: పుస్తక పఠనమందు ఆప్యాయత, స్నేహపూర్వక వాతావరణమును కల్గించుటకు అందరు సహాయపడవచ్చును. ఇతర సభ్యులయెడల మనలో ప్రతివారు వ్యక్తిగత శ్రద్ధచూపినప్పుడు, అది గుంపు సన్నిహితత్వమునకు దోహదపడును. గలతీయులు 6:10లో “అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము” అని మనకు సూచింపబడినది. ఉదాహరణకు, పుస్తకపఠనము గుంపులో ఒకరు అనారోగ్యముగా ఉన్నారని అందువలన కూటమునకు రాలేకపోయారని మీరు గమనించారా? బహుశ మీరు టెలిఫోనులో వారితో మాట్లాడవచ్చును లేదా వ్యక్తిగతముగా వారిని కలిసికొనవచ్చును. పుస్తక పఠనగుంపులో అటువంటి ఆత్మ సహోదరులను దగ్గరకు చేర్చును.
3 అనుదిన ఒత్తిడులు, కుటుంబ బాధ్యతలు, లేక ఇతర సమస్యల కారణముగా కొందరికి ప్రోత్సాహము అవసరమా? సహాయము చేయుటకు నీవేమి చేయవచ్చును? కేవలము వారికి శుభమని చెప్పుట కాదుగాని, కూటములయొద్ద సంభాషణలో ఇతరులు పాల్గొనునట్లు చేయుటకు ప్రత్యేకముగా ప్రయత్నించుము. కొందరు సిగ్గుపడువారిగా కన్పించవచ్చు. అయితే వారు తమతో ఎవరైనా మాట్లాడవలెనని చూచుచుండవచ్చును మరియు సమీపించినట్లయిన వారు ప్రత్యుత్తరమివ్వవచ్చును. (uw పు. 137-8) “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతము గలవారై యుండుడి” అని అపొస్తలుడైన పౌలు క్రైస్తవులను ప్రోత్సహించెను. (1 థెస్స. 5:14) ఎవరైనా అనారోగ్యముగా లేక నిరుత్సాహముగా ఉన్నట్లయిన స్నేహితులు మార్గమధ్యమందు వారియొద్ద ఆగి సహాయమునందించుట ఎంత ఓదార్పుకరము! తరచు, తమయెడల శ్రద్ధచూపువారు ఉన్నారని ఎరిగియుండుట మాత్రమే కావలసియుండును.
4 ప్రాంతీయ సేవా ఏర్పాట్లతో సహకరించవలెనని కూడ మనము కోరుకొందుము. గుంపులోని వివిధ వ్యక్తులతో పనిచేయుటకు మనము ప్రయత్నించవలెను. (2 కొరిం. 6:11-13; 12:15) కొన్నిసార్లు పుస్తక పఠన నిర్వాహకుడు ఎవరికైనా సహాయము చేయుమని మనలను అడుగవచ్చును. మనమెట్లు ప్రతిస్పందింతుము? ప్రకటించు మరియు శిష్యులనుగా తయారుచేయు పనియొక్క వివిధ అంశములలో ప్రచారకులు మరియు పయనీర్లు కలిసి పనిచేసినప్పుడు పుస్తకపఠన గుంపు బహుగా బలపర్చబడును.
5 వ్యక్తిగత మాదరి: సంఘపుస్తక పఠన ఏర్పాటుకు నీవు దోహదపడగల ఇతర మార్గములు గలవు. నీ మంచి మాదిరి ప్రాముఖ్యము. ఉదాహరణకు, రాజ్యమందిరమందలి కూటమునకు వేసికొనునట్లు దుస్తులు ధరించినట్లయిన, నీవు గౌరవము చూపినవాడవగుదువు. సాధారణముగా దుస్తులు ధరించు అలవాటును పెంపొందించుకొనిన వారికి నీవు అనుకూలమైన ఉదాహరణనుంచుదువు. కూటమును ఆటంకపరచకుండుటకు సమయానికి వచ్చుటను నీవు అభ్యాసముగా చేసికొందువా?
6 సంఘపుస్తక పఠన ఏర్పాటు మనము పూర్తి మద్దతునివ్వవలసిన యెహోవా ప్రేమపూర్వక ఏర్పాటైయున్నది. (యెష. 40:11) అది మనము వ్యక్తిగత సహాయము పొందుటకు మరియు ఇతరులకు ఆత్మీయముగా సేదదీర్చుటకు దోహదపడు స్థలమైయున్నది. ఈ ఏర్పాటుకు సంపూర్ణముగా మద్దతునిచ్చుట ద్వారా మనమందరము “యొకనినొకడు ఆదరించి యొకనినొకడు క్షేమాభివృద్ధి కలుగజేసికొందము” గాక.—1 థెస్స. 5:11.