సువార్తనందించుట—గృహ బైబిలు పఠనములను అందించుట
1 క్రీస్తు శిష్యులను తయారుచేయు విధానమందు నాటుట మరియు నీరుపోయుటయొక్క మన బాధ్యతను 1991 సెప్టెంబరు మన రాజ్య పరిచర్య ఇన్సర్ట్ మనకు జ్ఞాపకము చేసినది. రాజ్యవర్తమానమునకు ప్రత్యత్తరమిచ్చు ప్రజలయెడల మనకు ప్రేమకలదు గనుక బైబిలు పఠనములను నిర్వహించుటకు మనము కదిలించబడవలెనని అది చూపినది. గృహ బైబిలు పఠనములను అందించుట శిష్యులను చేయుమని మనకివ్వబడిన ఆజ్ఞను నెరవేర్చుటకు మనకు సహాయము చేయును.—మత్త. 28:19, 20.
2 ఇవ్వబడిన చక్కని ప్రోత్సాహమును మనలో అనేకులు అభ్యసించుటకు ఆరంభించుట మంచిగా యున్నది. అనేక బైబిలు పఠనములు ఇంకను నిర్వహించబడుచున్నవని రిపోర్టులు సూచించుచున్నవి. ఇండియాలో రిపోర్టు చేయబడుచున్న బైబిలు పఠనముల సంఖ్య 1990 సేవా సంవత్సరముకంటే 1991లో దాదాపు 17 శాతము పెరిగినది. మొదటిసారిగా పఠనములను నిర్వహించుటకు ఆరంభించిన వారు శిష్యులను చేయు పనిలో తాము కలిగియున్న భాగము విషయమై నిశ్చయముగా ఆనందించుచున్నారు. అయితే మన పరిచర్యలో ప్రతిఫలదాయకమైన ఈ పనిలో ఇంకా ఎక్కువమంది ఎట్లు పాల్గొనగలరు?
3 నెల కొరకైన అందింపుగా ఉపయోగించుము: క్రొత్త బైబిలు పఠనములు ప్రారంభించ వెదకుటకు డిశంబరు ప్రత్యేకముగా అనుకూలమైన నెలయైయున్నది. మనము న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ది హోలి స్క్రిప్చర్స్ మరియు ది బైబిల్—గాడ్స్ వర్డ్ ఆర్ మ్యాన్స్? అను పుస్తకములను అందింతుము. గృహస్థుని ఆసక్తిని రేకెత్తించుటకు రీజనింగ్ పుస్తకములో కనుగొనబడు సలహాలను ఉపయోగించుట ఒక మంచి మార్గమైయున్నది.
4 రీజనింగ్ పుస్తకములో సూచింపబడిన ఉపోద్ఘాతములను ఉపయోగించుట ద్వారా మనము బైబిలును అందించవచ్చును. బైబిలువైపు శ్రద్ధ మళ్లించుటకు అక్కడ ఐదు విధానములు కలవు. జీవిత సమస్యలకు బైబిలు జవాబులను వెదకుమని ప్రజలను ప్రోత్సహించుట బైబిలు పఠనమునకు మార్గము తెరవవచ్చును.
5 రీజనింగ్ పుస్తకము పుట 12లోని “హోమ్ బైబిల్ స్టడీ” అను ఉపశీర్షిక క్రింద, గాడ్స్వర్డ్ పుస్తకమువైపు శ్రద్ధ మళ్లించుటకు ఉపయుక్తమైన రెండు సలహాలు కలవు. ఆ రెండు ఒక క్రమమైన రీతిలో పఠించుటకు పుస్తకమును ఉపయోగించుటను ప్రోత్సహించును. బైబిలు పఠనమును ప్రారంభించుటకు నీవు సూటిగా సమీపించుటను చేయుచున్నట్లయిన, నీవు 1991 అక్టోబరు మన రాజ్య రిచర్య నందు ఇవ్వబడిన చక్కని సలహాలను అనుసరించవచ్చును.
6 యెహోవాయందు నమ్మికయుంచుము: బైబిలు స్టడీపనిలో విజయము సాధించవలెనంటే, మనము కేవలము యెహోవా సహాయముచేతనే బైబిలు పఠనములు అందించుట సాధ్యమని గుర్తుంచుకొనవలెను. ప్రజలకు సహాయముచేయు మన ప్రయత్నములలో ఆయన ముఖ్యపాత్ర వహించును. (1 కొరిం. 3:6) కాబట్టి, పఠించుటకు ఎవరినైనా కనుగొనుటనుగూర్చి మాత్రమే కాకుండా, కనుగొనిన ఆసక్తిగలవారి అభివృద్ధి కొరకును మనము ప్రార్థించవలెను. (యోహా. 16:23) మనము “దేవుని జతపనివారమని” గుర్తుంచుకొనవలెను.—1 కొరిం. 3:9.