సంఘపుస్తక పఠన ఏర్పాటు
భాగము 5: సేవాకాపరియొక్క సందర్శనము
1 సేవాకాపరి సువార్తికుడును, బోధకుడునై యుండవలెను. సంఘమునకు ఏర్పరచబడిన ప్రాంతములో సువార్తను ప్రకటించి మరియు బోధించు బాధ్యతను నెరవేర్చుటలో సహాయపడుటయందు అతడు కీలకమైన పాత్ర వహించును. (మార్కు 13:10) అతడు తన బాధ్యతను గంభీరముగా తీసికొనినప్పుడు ఆలాగే ప్రతివారు సహకరించినప్పుడు ప్రచారకులు సువార్తను అందించుటలో గొప్ప నైపుణ్యమును సాధింతురు మరియు ప్రాంతమంతటిని బహుగా చుట్టివచ్చుట జరుగును.
2 సేవాకాపరి ప్రాంతీయసేవలో ఎక్కువ పనిచేయుటను పురికొల్పుటపై దృష్టినిల్చును. ఇది ప్రాథమికముగా సంఘపుస్తక పఠనము ద్వారా నెరవేర్చబడును. సాధారణముగా, ఒక పుస్తక పఠనము జరిగించుట సేవాకాపరికి ఏర్పాటు చేయబడును. అయితే నెలకొకసారి ఆయన వేరొక గుంపును సందర్శించ వెళ్లినప్పుడు, అతని స్థానములో అతని సహాయకుడు పఠనము నిర్వహించును.—km 11/81 పు. 1, 7.
3 సందర్శనకు సిద్ధపడుట: ఈ సందర్శనమునకు ఒక వారముముందు, సేవాకాపరి ఆ గుంపులో ఉన్నవారి పబ్లిషరు రికార్డు కార్డులను తనిఖీ చేయవలెను. అంతేకాకుండా, పఠన నిర్వాహకునితో కలిసికొను ఏర్పాటు చేసికొని ఆ గుంపుకొరకు ఏర్పాటు చేయబడిన ప్రచారకుల పనివిధానమును పునఃసమీక్షించవలెను. సేవాసంబంధముగా ఎటువంటి సమస్యలున్నను లేక రికార్డు కార్డులనుండి స్పష్టముకాని అవసరతలను పఠన నిర్వాహకుడు సేవాకాపరికి తెలియజేయవలెను. సేవాకాపరి తన 15 నిమిషముల సేవాప్రసంగమును ఇచ్చుటకు వీలుగా పఠనము కేవలము 45 నిమిషములు మాత్రమే ఉండవలెనని పఠన నిర్వాహకునికి గుర్తు చేయవలెను.
4 ఈ ప్రసంగము పరిచర్య కొరకు మరిగొప్ప ప్రశంసను ప్రోత్సహించుటపై కేంద్రీకరించబడవలెను. పరిచర్యలో ఒకానొక విషయమందు ప్రచారకులకు సహాయము అవసరమయినట్లయిన, అభివృద్ధి సాధించుటకు సేవాకాపరి అభ్యాససిద్ధమైన సలహాలనివ్వవలెను. అతను గుర్తుచేయు విషయములు అనుకూలముగా ఉండి ప్రోత్సహించవలెనేగాని, ప్రతికూల వ్యాఖ్యానములద్వారా కలతపెట్టునవిగా లేక నిరుత్సాహపరచునవిగా ఉండకూడదు. ఇలావుంటే అది అతని సందర్శనముయొక్క సంకల్పమునే ఓటమిపాలు చేయును. అతని ప్రసంగము అందరు అభివృద్ధి సాధించుటకు ప్రోత్సహించవలెను.
5 సేవాకాపరి తన కాలపట్టిక అనుమతించుకొలది సాధ్యమైనంతమేరకు వివిధ సహోదర సహోదరీలపై వ్యక్తిగత శ్రద్ధనిల్చుటకు కృషిచేయును. సేవలో వివిధ వ్యక్తులతో కలిసి పనిచేయుటకు ఆయన ముందే ఏర్పాట్లు చేసికొనవచ్చును. ప్రచారకునితో కలిసి ఇంటింటి సేవచేయునప్పుడు, వారు తమ ప్రసంగములను అభివృద్ధి పరచుకొనుటకు ఒకటి లేక రెండు సలహాలను ఆయనివ్వవచ్చును. విమర్శించు విధముగా కాదుగాని, వారికి సహాయపడేందుకే మంచి ఉద్దేశ్యముతో వీటినివ్వవలెను. ప్రచారకులతో కలిసి పునర్దర్శనములకు మరియు బైబిలు పఠనములకు వెళ్లుటకు కూడా ఆయన ఇష్టపడవచ్చును. గుంపులో వ్యక్తిగత సహాయము అవసరమున్న వారిగా ఎవరైనా కనబడితే, వారికి సహాయపడుటకు ఆయన ఆ వారములో షెప్పర్డింక్ కాల్ చేయవచ్చును. ఆ పిమ్మట, ఇవ్వబడిన సలహాలనుగూర్చి పఠననిర్వాహకునికి ఆయన తెలియపర్చవచ్చును. ఈ ఉత్తేజితమైన, వ్యక్తిగత శ్రద్ధ తమ ప్రాంతీయసేవలో వెనుకబడిన కొందరికి మంచి పురికొల్పుగా ఉండెను.
6 సేవకొరకైన కూటము: ఆ వారములో ప్రాంతీయ సేవకొరకైన కూటములను సేవాకాపరి నిర్వహించవలెను. కేవలము కొద్దిమందే హాజరైననూ వాటిని సరిగ్గా సమయమునకు ఆరంభించవలెను. ఆ కూటము కేవలము 10 లేక 15 నిముషముల వ్యవధిని మించకూడదు. దినవచనమును ఆలోచించుట ఇష్టమునకు వదిలివేయబడుచున్నది. గుంపు బయలుదేరిపోవుటకు ముందే, ప్రతివారు ఆయన ఎక్కడ మరియు ఎవరితో పనిచేయునో తెలిసికొనియుండవలెను. (1 కొరిం. 14:33, 40) ఆలస్యము చేయకుండా సేవకు బయలుదేరుటకు సేవాకాపరి ప్రతివారిని ప్రోత్సహించవలెను.
7 ఆయా గుంపులను సేవాకాపరి క్రమముగా సందర్శించుట సంఘమునకు నిజమైన ఆశీర్వాదముగా ఉండగలదు. ఆయన సందర్శించునప్పుడు మనలో ప్రతివారము ఆయనతో సహకరించితే, మన పరిచర్య క్రమముగా మరియు ప్రభావితముగా ఉండును. అంతేకాకుండా, తన పనిద్వారా ఆయన ఆనందముననుభవించును. (హెబ్రీ. 13:17) గొర్రెవంటివారు సమకూర్చబడుదురు. కాగా వినువారందరికి ప్రకటించుమనే ఆజ్ఞను నెరవేర్చితిమని తెలిసికొనుట మనకు ఆనందము కలిగించును.—యెష. 61:1, 2; యెహె. 9:11; యోహా. 17:26.